ఈ చిత్రంలో అతడి అంగీకి పెన్ను ఉండటం కూడా చూడవచ్చు. ఆయన్ని పార్సీగుట్టలో నిన్న తీశాను.
కందుకూరి రమేష్ బాబు
పనిలేని సమయంలో లేదా పని చేయడానికి సంసిద్దంగా లేనప్పుడు తమ బండిలో తాము ఆరాంగా విశ్రాంతి తీసుకుంటూ కనిపించే ఆటో డ్రైవర్లు లేదా రిక్షా డ్రైవర్లు ఎంతో బాగుంటారు. యజమానిగా వాళ్ళు కన్పించే తీరు హుందాగా కానవన్తుంది.
వాళ్ళ ధీమా, యజమానిగా అధికారమే కాకుండా కులాసా, సౌకర్యం, సంతృప్తి భిన్నమైన వాళ్ళ బాడీ లాంగ్వేజ్లను రకరకాలుగా దర్శించవచ్చు.
వేరే వాళ్ళ దగ్గర జీతగాల్లుగా పనిచేసే వాళ్ళ కన్నా స్వతంత్రంగా బతికే తీరులోని దర్జా వీరిలో స్పష్టంగా చూస్తాం. తీరుబాటులోని సుఖ లాలసనూ అందులో గమనిస్తాం.
తనకు తానే యజమాని. శ్రామికత్వంలోని హుందా తనం ఎంత బాగా చిత్రీకరించారు. ఎవరు ఆలోచించని కన్ను మీది. అభినందనలు సర్.