ఇది మరో చిత్రం. దీన్ని మొన్న తీశాను. ఒక పిచ్చుక ఆ ఆహార పదార్థాన్ని తినడానికి మరో పిచ్చుక దగ్గరకు వస్తే బెదిరిస్తున్న వైనం. ఎం ప్రవర్తన అది!
కందుకూరి రమేష్ బాబు
ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. పొద్దున్న ఆ అద్భుతాన్ని కళ్ళారా చూశాను. విస్మయం. అపురూపం.
ఒక ఉడుత – ఒక పిచ్చుక స్నేహంగా ఒకదాని పక్కన ఒకటి కనిపించాయి. అచ్చంగా ఇద్దరు మనుషుల్లా అనిపించాయి. అవి తమకే సాధ్యమైన ఎదో నిశబ్ద సంభాషణలో మాట్లాడుకుంటున్నాయి. అది మా అపార్ట్ మెంట్ లో ఒక కారు పక్కన. వాటి ఉనికి తెలియక అక్కడికి వెళ్లాను. నా అలకిడికి అవి తుర్రున చేరువైపు పారిపోయాయి. ఎంత బాధ పడ్డానో. ఒక Decisive moment ను శాశ్వతంగా మిస్సైన వైనం ఇది. ఒక miraculous experienceని చూపలేని నిస్సహాయత ఇది.
మీరు చూస్తున్న పై చిత్రమా? ఇది మరో చిత్రం. దీన్ని మొన్న తీశాను. ఒక పిచ్చుక ఆ ఆహార పదార్థాన్ని తినడానికి మరో పిచ్చుక దగ్గరకు వస్తే బెదిరిస్తున్న వైనం. ఏం ప్రవర్తన అది!
ఆ ఫోటో ఒక యధార్థం. అద్భుతమైన జీవన శీలం. ప్రకృతి. ఇది వికృతి.
ఇలాంటి ఫోటోలు పెట్టడం నిజానికి ఇష్టం లేదు. కానీ మొదటి ఫోటో తీయలేని వైఫల్యం వల్ల ఇది యాదికి వచ్చింది. ఆ ఫోటో ఒక యధార్థం. అద్భుతమైన జీవన శీలం. ప్రకృతి. ఇది వికృతి.
ఎప్పటికైనా అలాంటివి తీయాలి. ఉదయం అనుభవంతో ఇంకా మెల్లగా అడుగులు వేయడం మంచిదని ఎరుకైంది. అదే సామాన్యశాస్త్రం.
అన్నట్టు, ఉడుత – పిచ్చుక ఫోటో మిస్సైనప్పటికీ ఆ కోవలోనిదే…గతంలో ఒక ఎలుకా శునకం చిత్రం తీశాను. ఇదే అది…