Editorial

Monday, December 23, 2024
Peopleడా. సుంకర వెంకట ఆదినారాయణ రావు : ఈ 'పద్మశ్రీ' విరిసిన విధానం...

డా. సుంకర వెంకట ఆదినారాయణ రావు : ఈ ‘పద్మశ్రీ’ విరిసిన విధానం అపూర్వం

ఐదు దశాబ్దాల కాలంలో మూడున్నర లక్షలకు పైగా పోలియో ఆపరేషన్లు నిర్వహించి ఎందరో అభాగ్యులకు ‘నడక’ నిచ్చిన డా. సుంకర వెంకట ఆదినారాయణ గారికి నేడు పద్మశ్రీ పురస్కారం వరించింది. తన చికిత్సకు ఆధారమైన తాత్వికత ఎలాంటిదో చెబితే ఎవరికైనా విస్మయం కలుగుతుంది. అది తెలివి తేటలతో కాదు, భావోద్వేగాల గుణపాఠాలతో ఎదిగిన వికాసం అన్న సంగతి మనలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంది. ముఖ్యంగా అది ‘IQ’ కాదు, ‘EQ’ విలువ ప్రాధాన్యాన్ని చెబుతుంది. అన్నిటికీ మించి ఒక మహానుభావుడి వికాసం వెనుక సామాన్యుల అనుభవాల మేళవింపును అపూర్వంగా చాటుతుంది. వారి స్పూర్తిదాయక కథనం సామాన్యశాస్త్రం. అది తెలుపుకు ప్రత్యేకం.

కందుకూరి రమేష్ బాబు

“ప్రతి మనిషికీ ఒక ఎమోషనల్ బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది. ఒక తల్లి వికలాంగురాలైన తన కూతురిని చూసి జీవితకాలం కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ తల్లి కన్నీళ్లు తుడువడానికి వైద్యం చేయి గానీ కేవలం ఆ బిడ్డ్డకు వైద్యం చేయడమే నీ పని అనుకోవద్దు”

విద్యార్థిగా ఉన్నప్పుడు తన గురువు చెప్పిన ఈ సలహాను యువకుడైన వైద్యుడు, వెంకట ఆదినారాయణ పాటించాడు. దాంతో తాను ఒకరిద్దరు కాదు. వందలు, వేలు కాదు. మూడున్నర దశాబ్దాలుగా అక్షలాది మంది కన్నీళ్లు తుడిచాడు. అతడు పోలియో బాధితుల పాలిట దేవుడే అయ్యాడు.

విశాఖపట్నానికి చెందిన ఆ వైద్యుడు నడిపే ఆసుపత్రి పేరు ‘ప్రేమ’.

నిజమే. ఆ వైద్యుడు తన తెలివి తేటలకు (IQ) పని చెబితే అది ప్రేమ అయ్యేది కాదు. కానీ మనిషిగా వైద్యం చేయడం నేర్చుకున్నాడు. సమాజం ప్రధానంగా చికిత్స చేయడానికి పూనుకున్నాడు. మనుషుల భావోద్వేగాలను గమనించుకుంటూ వికసించినందువల్లె ఆ వైద్యుడు నేడు పద్మశ్రీ పురస్కార గ్రహీత అయ్యాడు. EQ గురించి తరచూ నొక్కి చెప్పే ఒక నిండు మనిషయ్యాడు.

తాను పేషెంట్లకు మాత్రమే వైద్యం చేయడం లేదన్న గ్రహింపు వల్లే అయన ఒక్కో మెట్టు ఎక్కడం కాదు, దిగివచ్చి అందరికీ చేరువయ్యాడు. పోలియో బాధితుల కన్నీళ్లు తుడిచే మహానీయుడయ్యాడు.

తాను పేషెంట్లకు మాత్రమే వైద్యం చేయడం లేదన్న గ్రహింపు వల్లే అయన ఒక్కో మెట్టు ఎక్కడం కాదు, దిగివచ్చి అందరికీ చేరువయ్యాడు. పోలియో బాధితుల కన్నీళ్లు తుడిచే మహానీయుడయ్యాడు. వారి బంధుమిత్రుల కళ్ళల్లో ఆనంద భాష్పాలు చూసే విశాల మానవుడూ అయ్యాడు.

చిత్రమేమిటంటే తన ఎదుగుదలకు కారణం IQ (Intelligence quotient) కాదు, EQ (emotional quotient) అని చెప్పి విస్మయ పరుస్తాడు. అంతేకాదు, ఆ వైద్యుడు దయాళువు కావడం, సౌహార్ద్రంతో మసులుకునే వివేకి కావడం వెనుకాల ఉన్న మూడు దశలనూ వివరిస్తాడు. ఆ మూడు దశలకూ ముగ్గురు కారణం, వారే తనని విశాలం చేశారని వివరించడం మరో విశేషం.

ముందు గురువుగారి పాఠం

“పేషెంటుకు చికిత్స చేయడం గురించి ఆలోచిస్తే అది వైద్యం. కానీ నీ వైద్యం ద్వారా ఆ పేషెంట్ తల్లి కన్నీళ్లు కూడా తుడుస్తున్నావంటే అది ప్రేమ. అది సమాజానికి గొప్ప ఓదార్పు” అని డా. వెంకట ఆది నారాయణ గారిని మేలుకొలిపారాయన.

తర్వాత ఒక అమ్మాయి పాఠం

ఆమె పదహారు ప్రాయంలో ఉంది. కానీ దిగులుతో బిక్కచిక్కి చీపురు పుల్లలా అయింది. తానొక పల్లెటూరు నుంచి వచ్చింది. ఏంతో నమ్మకంతో అప్పటికీ ఎంతో బ్యుజీ అయిన ఈ డాక్టరుకు చూపించుకుంది. ఆయన ఇలా అన్నారు. “నువ్వు కనీసం నడవ గలుగుతున్నావమ్మా. కానీ చాలా మందికి ఈ మాత్రం పరిస్థితి కూడా లేదు. నీకు ఆపరేషన్ ఎందుకమ్మా…వెళ్ళు “ అన్నాడాయన.

ఆమె ఆ మాటలు విని వెళ్ళలేదు. వెళ్ళకపోగా ఆగ్రహావేశాలతో ఊగి పోయింది. చెంప చెళ్ళు మనిపించేలా ఒక మాట అన్నది. “నిన్నేవరైనా కుంటోడా అంటే ఎలా ఉంటుందో తెలుసా?” ఆవేశంగా అడిగింది.

ఆమె తిరిగి వెలుతూ గర్వంగా నడిచిన నడకను తానెన్నడూ మరచి పోలేనని డా. వెంకట ఆది నారాయణ చెబుతూ ఆ అనుభవం తనకు జీవితంలో గొప్ప పాఠాన్ని నేర్పిందని ఇలా వివరించారు.

అతడికి అర్థమైంది. ఆమె బాధను, ధర్మాగ్రహాన్ని సహనంతో భరించి అటు పిమ్మట సహృదయంతో అర్థం చేసుకున్నాడు. ఇక ఆలస్యం చేయలేదు. తక్షణం వైద్యం చేసి ఆమె కాళ్ళను సవరించాడు. ఆమె తిరిగి వెలుతూ గర్వంగా నడిచిన నడకను తానెన్నడూ మరచి పోలేనని డా. వెంకట ఆది నారాయణ చెబుతూ ఆ అనుభవం తనకు జీవితంలో గొప్ప పాఠాన్ని నేర్పిందని ఇలా వివరించారు. “ఆ అమ్మాయి గనుక సమాజం తనను అంతలా న్యూనతకు గురిచేస్తుందనే వాస్తవాన్ని అంత బలంగా గనుక నాకు చెప్పకపోయి ఉంటే…నాకు తన బాధ తెలిసేది కాదు. తనవంటి లక్షలాది మంది బాధను నేను తొలగించే వాడినే కాదు. ఇంత పెద్ద డాక్టరును కూడా అసలు అయ్యేవాడినే కాదు” అన్నారాయన.

ఆ తర్వాతి గుణ పాఠం ఒక వృద్ధుడు నేర్పు

ఇందులో ఆ అమ్మాయి వంటి ఆగ్రహం లేదు, బాధ ఉంది.

ఆ పెద్ద మనిషికి ఎనభై ఏండ్లు. అయినా వైద్యం కోసం వచ్చాడు. కానీ తాను చేయనన్నాడు. “కాటికి కాళ్ళు చాపిన వాళ్లకు కూడా వైద్యం ఎందుకు?” అన్న భావంతో తాను తిరస్కరించాడు. “నేకేందుకు నాయనా…ఇక్కడ చాలామంది పిల్లలు, యువతీ యువకులు..అరవై ఏళ్ళు కూడా దాటని వారు వందలు, వేలున్నారు. వారంతా క్యూ కట్టి మరీ చికిత్స కోసం ఎదురు చూస్తున్నారు. నా సమయాన్ని శక్తినీ వారికోసం వెచ్చించ నీయండి” అని మన్నింపు ధోరణితోనే అయినా నిక్కచ్చిగా చెప్పారాయన.  వృద్ధుడు నొచ్చుకున్నాడు. కన్నీళ్ళు దిగమింగుకొని “ఒక్కమాట” అన్నాడు. “వైద్యం చేయి బాబూ అని నాలా నీ తండ్రే అడిగితే కాదనే వాడివా అయ్యా?” అని ప్రశ్నించాడు.

 అప్పటి నుంచి అయన నూరేళ్ళు నిండిన వారికీ నో అనరు. ఒక కాలు ఉంది కదా అని సర్ది పుచ్చుకోరు. అన్ని వయస్కుల వారికీ… ఒక్క మాటలో పోలోయో సోకి కాళ్ళూ చేతులూ సహకరించని వారందరికీ ప్రేమాస్పదులైన వైద్యులయ్యారు.

ఆ మాట సూటిగా తగిలింది తనకు. దాంతో ఆ వైద్యుడి కళ్ళు తెరుచుకున్నాయి. నిజమే కదా అన్న ఆలోచనల్లో పడ్డాడు. ఇక అప్పటి నుంచి అయన నూరేళ్ళు నిండిన వారికీ నో అనరు. ఒక కాలు ఉంది కదా అని సర్ది పుచ్చుకోరు. అన్ని వయస్కుల వారికీ… ఒక్క మాటలో పోలోయో సోకి కాళ్ళూ చేతులూ సహకరించని వారందరికీ ప్రేమాస్పదులైన వైద్యులయ్యారు. వెంకట ఆదినారాయణ రావు నిజంగానే కనిపించే ‘నారాయణుడు’ అయ్యారు.

ఆ ముగ్గురికీ ప్రణామాలు

చిత్రమేమిటంటే నేడు ఆ వైద్యుడికి భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. లక్షలాది పోలోయో బాధితుల కన్నీళ్లు తుడిచే వారిగా అత్యున్నత గౌరవాన్ని స్వీకరిస్తున్నారు. వేలాది క్యాంపులు నిర్వహించినందుకు గాను ఈ విశిష్ట పురస్కారాన్ని పొందుతున్నారు. వారన్నట్టు, తాను ఇంతవాడు కావడానికి జీవితంలో మూడు దశలున్నయి. ఆ ముగ్గురి గుణ పాఠాలున్నాయి.

ఈ ముగ్గురు తనలోని వైద్యుడిని మానవీయం చేశారని డా. ఆదినారాయణ రావు అన్నారు. తనలోని IQకు బదులు EQను ప్రేరేపించిన ఆ ముగ్గురికీ తాను సదా రుణపడి ఉంటానని వినమ్రంగా చెప్పారు.

తొలుత పేషెంట్లు కాదు, సమాజం కన్నీళ్లు తుడవాలనే దృష్టి నిచ్చిన గురుదేవుల సూచన ఉంది. తర్వాత న్యూనతను సవరించమన్న అమ్మాయి ఉంది. అటు పిమ్మట వయసుతో నిమిత్తం లేకుండ బాధను నివారించమని చెప్పిన పెద్ద మనిషి ఉన్నారు. ఈ ముగ్గురు తనలోని వైద్యుడిని మానవీయం చేశారని డా. ఆదినారాయణ రావు అన్నారు. తనలోని IQకు బదులు EQను ప్రేరేపించిన ఆ ముగ్గురికీ తాను సదా రుణపడి ఉంటానని వినమ్రంగా చెప్పారు.

తెలుపు అభినందన

అంతటి గుణ పాఠాలతో ఎదిగిన ఈ వైద్యుడు నిజంగా భరత రత్న.

లక్షలాది కన్నీళ్లు తుడిచిన వీరికీ ‘పద్మశ్రీ’ సముచితం. వారికి తెలుపు హృదయపూర్వక అభినందనలు.

ఈ కథనం ‘మీరు సామాన్యులు కావడం ఎలా?’ అన్న పుస్తకంలోనిది.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article