Editorial

Wednesday, January 22, 2025
సామాన్యశాస్త్రంఅతడి ఇరానీ ఛాయ్ తెలుపు

అతడి ఇరానీ ఛాయ్ తెలుపు

babu rao

తెలుపడంలోని గురుతర బాధ్యతను భోదపర్చిన వారికి కృతజ్ఞతగా ‘తెలుపు’ కోసం మొదటి సామాన్యశాస్త్రం కథనాన్ని వారిపైనే రాస్తున్నాను.

కందుకూరి రమేష్ బాబు

కందుకూరి రమేష్ బాబు హైదరాబాద్ లోని నీలోఫర్ కేఫ్ గురించి తెలియని వారుండరు. అది చక్కటి ఇరానీ టీకి చిరునామా మాత్రమే కాదు, తన సంపాదనలోని కొంతభాగం ఖర్చు పెట్టి ఎందరికో ఆపన్నహస్తం ఇవ్వడానికీ ఆ వ్యాపారమే అతడికి ఆధారభూతం. ఈ విషయం గురించి మీరు అనేక కథనాలు చదివే ఉంటారు.

నిరుపేద కుటుంబానికి చెందిన తాను పదో తరగతి చదువుకునే రోజుల్లో బోర్డు పరీక్షలకు ప్రిపేర్ కావలసి వచ్చి పుస్తకాలు తప్పక కావాలని అడిగాడు. దురదృష్టవశాత్తూ వాటిని కొనివ్వడానికి తన తండ్రి పాలిచ్చే ఆవును అమ్మడంతో, అదీ తన దగ్గరి బంధువులకే కావడంతో అతడు ఎంతటి మనస్తాపానికి గురయ్యాడూ అంటే భరించలేని ఆ వేదనకు తాళలేక అదే రాత్రి ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్ నగరానికి చేరుకున్నాడు.

అవసరానికి సహాయం చేయడానికి తమ ఊర్లో యే ఒక్కరూ నిస్వార్థంగా ముందుకు రాని వైనానికి తాను ఎంత తీవ్ర దుఃఖితుడు అయ్యడూ అంటే ఆ నాడే నిర్ణయించుకున్నాడు, తాను ఎదగాలని. తన ఎదుగుల నుంచి పదుగురు ఇలా బాధపడకుండా చేయడం తన గురుతర బాధ్యత అని.

ఇంటి నుంచి పారిపోయి రావడంతో అతడి చదువు అట్లా ఆగిపోవడం, తాను స్థిరపడేదాక ఇంటికి తానెక్కడున్నాడో వారికి తెలియక పోవడం, బాగ్యనగరంలో ఫుట్ పాత పై జీవనాన్ని ఎంచుకొని అష్ట కష్టాలు పడటం, కొద్ది రోజుల్లోనే ఒక బట్టల షాపులో పని మానేసి రెండు పూటలా భోజనం కూడా ఉచితంగా దొరుకుతుందని ఒక ఇరానీ షాపులో క్లీనర్ గా కుదిరాడు. అలా తన ప్రస్థానం ప్రారంభమై అనతికాలంలోనే, నిజానికి దశాబ్దంలోగానే, తాను అదే షాపుకు యజమాని కావడం నిజంగానే విశేషం.

తండ్రి పాడి ఆవును అమ్మడంతో మరో దిశగా మలుపు తిరిగిన అనుమల బాబురావు జీవన వికాసం, అందులో దాగిన ఈ చేదు అధ్యాయం ఎవరినైనా చలింప జేస్తుంది.

పుష్కర కాలం క్రితం చెమ్మగిల్లిన కళ్ళతో అయన తన జీవితాన్ని పంచుకున్న రీతిని నేను అప్పుడే విపులంగా ఒక కథనంగా రాశాను. అది అద్భుతంగా వచ్చింది. గొప్ప స్పందన అందుకుంటున్నాను. మరునాడు అతడు కబురు పెట్టడంతో ఎంతో సంతోషంగా వెళ్లాను. ఆనందంగా ఆహ్వానం చెబుతారని అనుకున్నాను. కానీ అయన ఎంతో విచారంగా ఉన్నారు. గంభీర వదనంతో కనిపించారు. మెల్లగా అసలు విషయం చెప్పరు.

 

‘మీరు రాసిన కథనం అవతలి హృదయాలలో పరివర్తనకు లేదా స్ఫూర్తికి తప్పక కారణం అయ్యేలా ఉండాలి లేదా మీరు రాయడం అయినా ఆపాలి. ఈ విషయంలో నా అనుభవం తర్వాతనైనా మీరు ఒక మాట తీసుకోవాలి. ఏమంటారు?’ అన్నారాయన.

‘బాబూ…మీరు గొప్పగా రాశారు. నా గాథను ఇంత చక్కగా ఇంతకు ముందు ఎవరూ రాయలేదు కూడా’ ఆగారాయన. నన్ను సన్నద్ధం చేస్తున్నారు దేనికో అనుకున్నాను. మళ్ళీ చెప్పసాగారు.
‘బాబూ. చాలా బాగా రాశారు గానీ నాదొక చిన్న మనవి. మీరు చాలా ఏళ్లుగా పత్రికా రంగంలో ఉన్నారు. కొన్ని పుస్తకాలు కూడా రాశారు. బాగుంది. మంచి హృదయం, చేయి తిరిగిన రచయిత అయిన మీరు కూడా ఒక పెద్ద పొరబాటు చేశారు’ అన్నాడు.

ఆ మాట అర్థం కాలేదు. ‘అదేమిటీ?’ అన్నాను. ఆయన మెల్లగా చెప్పారు. ‘మీరు రాసిన కథనం వల్ల నా గాథ పదుగురికి తెలిసింది. నా సేవానిరతి గురించి మరెందరికో అందింది. కానీ ఆ కథనాన్ని చదివిన పిమ్మట వారి స్పందన ఎటువైపు ఉన్నదో తెలుసా? గమనించారా?’ అడిగారు.

‘మీ కథనం నాకు ఎదురైనా స్థితి మరొకరికి రాకుండా చేయడంలో స్ఫూర్తి నివ్వాలి కదా. నాలా… సంపాదన లోంచి వారు కూడా ఎంతో కొంత సహకరించాలి కదా. కానీ, వ్యాసం చదివి వెంటనే నా దగ్గరకు వచ్చు క్యూ కడుతున్నారు, మాకు కూడా సహాయంచేయాలని ప్రాధేయ పడుతున్నారు. ఇదేమిటి? అన్నారాయన.

‘నా సేవా దృక్పథానికి మూలం ఇతరుల స్వార్థపరమైన విధానమే అని చదివి కూడా, నేను సేవను ఒక ముఖ్య జీవనశైలిగా ఎంచుకోవడానికి కారణం నా గతం అని తెలిసి కూడానూ వాళ్ళు మళ్ళీ నా సహాయం అర్థించి వస్తున్నారంటే నా రచన విఫలం అయినట్లే అని అయన చెప్పసాగారు. ‘మీరు రాయడంలో మరింత బాధ్యత, ఎరుకతో ఉండవలసిందే. నాకు నష్టం జరిందని కాదు, మీరు మళ్ళీ ఎప్పూడూ ఈ విషయంలో తప్పిదం చేయకుండా మెలుకువతో రాస్తారని చెప్పడానికి పిలిపించాను’ అన్నారాయన. ఇంకో మాట కూడా అన్నారు.

ఆయన హృదయం తెలిసింది. రచయితగా నా గమ్యం ఏమిటో కూడా బోధపడింది.

‘మీరు రాసిన కథనం అవతలి హృదయాలలో పరివర్తనకు లేదా స్ఫూర్తికి తప్పక కారణం అయ్యేలా ఉండాలి లేదా మీరు రాయడం అయినా ఆపాలి. ఈ విషయంలో నా అనుభవం తర్వాతనైనా మీరు ఒక మాట తీసుకోవాలి. ఏమంటారు?’ అన్నారాయన.

ఆయన హృదయం తెలిసింది. రచయితగా నా గమ్యం ఏమిటో కూడా బోధపడింది. అదీ మొదలు, వారు నాకు గురుతుల్యులు అయ్యారు. ఒక మంచి పాత్రికేయుడిగా, రచయితగా ఎదగాలంటే బాగా రాయడం ఒక్కటే సరిపోదని బోధపర్చిన ఆ నిండు మనిషిని నేనెప్పటికీ మరచిపోను. కొత్త పని తలపెట్టినప్పుడల్లా వారి మాటలను మననం చేసుకుని ముందుకు సాగిపోవడం మరింత ఉత్తేజంగా ఉంటుంది. వారికి హృదయం పూర్వక కృతజ్ఞతలు.

samanyashastram logo

More articles

1 COMMENT

  1. The article uniquely reflects, that, how people fail to gain inspiration from the individual efforts/ news item and they rush to approach the source to seek support, is a burden they create on the source itself.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article