“వాళ్ళు చేసే పని యే పాటిదీ?” అని గనుక మనం వారిని తక్కువభావంతో చూశామా …ఇక ఎప్పటికీ మనకు సత్యం బోధపడదు.
బతుకు పొడవునా వారే తారసిల్లుతారు గనుక ఇక ఎప్పుడూ మనం జీవన వాస్తవికతకు దూరంగా… అసలు సత్యం బోధపడక గుడ్డిగా బతికేస్తాం
నిజానికి ఈ సామాన్య జనం అలవోకగా తమ పనిని తాము పనిముట్లతో సహా ఎంత చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటారూ అన్నది మనం శాశ్వతంగా మిస్ అయినట్లే.
ఆ ఒక్క క్షణానికి కాదు, జీవితాంతం. అవును మరి, బతుకు పొడవునా వారే తారసిల్లుతారు గనుక ఇక ఎప్పుడూ మనం జీవన వాస్తవికతకు దూరంగా… అసలు సత్యం బోధపడక గుడ్డిగా బతికేస్తాం అనే చెప్పాలి. లేదంటే గొప్ప కళలోనో… మంచి సంగీతంలోనో అపూర్వ కంపోజిషన్ ను లేదంటే విశిస్తమైన రాగాల కూర్పును వెతుక్కునే బికారిలను చేస్తాయి.
ముందున్న సామాన్యతను విస్మరిస్తే చివరకు గొప్ప కళాకారుళం కావలసి వస్తుందన్నదే విషాదం.