Editorial

Friday, November 22, 2024
వ్యాసాలుపదునెక్కిన స్వేరో | ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ రాజీనామా...

పదునెక్కిన స్వేరో | ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ రాజీనామా…

భారమైన హృదయం…అదే సమయంలో ఎంతో సంతోషం

with a heavy heart ( and joy at the same time..)

ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ రోజు తన సుదీర్గ సర్వీస్ కు రాజీనామా చేస్తూ, స్వచ్చంద  పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నానని ప్రెస్ నోట్ విడుదల చేయడం సంచలనం సృష్టించింది.  అయితే, ఈ ఇది కొంత బాధ కలిగించినా పరిమితులు లేకుండా మనసుకు ఇష్టమైన పనులు చేసుకోవడానికి వీలు కుదురుతున్నదన్న ఆనందాన్ని అయన వ్యక్తం చేయడం మరో విశేషం.

ఇక నుంచి ప్రవీణ్ కుమార్ గారు ఎటువంటి శశబిషలు లేకుండా సూటిగా స్వేరోగా పునరంకితం అవుతారని భావించవచ్చు.

ఇది తనకు మరింత ఉత్సాహాన్ని, కొత్త శక్తిని ఇస్తోందని అనడాన్ని బట్టి, ఈ పని సామాజిక న్యాయం, సమానత్వం కోసం తనదైన శైలిలో మరింత ఉత్సహంగా పని చేసుకోవడానికే అని చెప్పడాన్ని బట్టి వారు మరింత కీలకమైన పాత్ర పోషించేందుకే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ప్రవీణ్ కుమార్ గారు గురుకుల సంక్షేమ కార్యదర్శిగా పని చేసే క్రమంలో వారు ఎంచుకున్న స్వతంత్ర వైఖరి దళితుల్లో వారిని బంధువును చేయగా ఆర్ ఎస్ ఎస్, హిందూ శక్తులకు కంట కింపుగా మారడం అందరికే తెలిసిందే. తన అధికారాన్ని వారు సద్వినియోగం చేస్తున్నారని ఒక వర్గం, దుర్వినియోగం చేస్తున్నారని మరో వర్గం అనుకోవడం ఎరిగినదే.
 
ఈ నేపథ్యంలో అయన రాజీనామా ఒక రకంగా వెనక్కు తగ్గడమే అని భావించవచ్చు. కాకపోతే, రెట్టించిన ఉత్సాహాంతో పని చేయడానికి కూడా అదే కారణం కావొచ్చు.

ఐతే, వారు పెంచి పోషించిన స్వేరోలు ఆయనకు లోపలి నుంచి మద్దతు తెలుపుతారా లేదా అన్నది, ఇప్పటి దాకా వెన్నుదన్నుగా ఉన్న కేసీఆర్ ఇక ముందు కూడా వారి సేవలను తనకు అనుకూలంగా మలుచుకుంటారా అన్నది ఆసక్తికరం. 

 
ఏమైనా, ఇక నుంచి ప్రవీణ్ కుమార్ గారు ఎటువంటి శశబిషలు లేకుండా సూటిగా స్వేరోగా పునరంకితం అవుతారని భావించవచ్చు. ఐతే, వారు పెంచి పోషించిన స్వేరోలు ఆయనకు లోపలి నుంచి మద్దతు తెలుపుతారా లేదా అన్నది, ఇప్పటి దాకా వెన్నుదన్నుగా ఉన్న కేసీఆర్ ఇక ముందు కూడా వారి సేవలను తనకు అనుకూలంగా మలుచుకుంటారా అన్నది ఆసక్తికరం. 
చిత్రమేమిటంటే, నేడు కేసేఆర్ ‘దళిత బంధు’ పథకం పేరును ఖాయం చేసిన రోజే ప్రవీణ్ కుమార్ గారు  రాజీనామా ప్రకటించడం.

ఏమైనా, ఇక నుంచి ప్రవీణ్ కుమార్ గారు ఎటువంటి శశబిషలు లేకుండా సూటిగా స్వేరోగా పునరంకితం అవుతారని భావించవచ్చు. ఐతే, ఈ సారి అంబేద్కర్ ఆశయాలకోసమా లేక కేసేఆర్ కోసమా అనండి చూడవలసే ఉన్నది.

దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టడాన్ని కేసేఆర్ నిర్ణయించడం ఎట్లా రాజకీయ వ్యూహమో ప్రవీణ్ కుమార్ రాజీనామా ఆ వ్యూహంలో ఒక భాగమా అన్నది రేపో మాపో తేలవచ్చు కూడా.

ఏమైనా, ఇక నుంచి ప్రవీణ్ కుమార్ గారు ఎటువంటి శశబిషలు లేకుండా సూటిగా స్వేరోగా పునరంకితం అవుతారని భావించవచ్చు. ఐతే, ఈ సారి అంబేద్కర్ ఆశయాలకోసమా లేక కేసేఆర్ కోసమా అనండి చూడవలసే ఉన్నది.

మొత్తానికి భావి తరాలను కొత్త ప్రపంచంలోకి నడిపించాలన్న వారి నూతన ప్రయత్నంలో ప్రవీణ్ కుమార్ గారు స్వతంత్రంగా ప్రవర్తిస్తే ఇక నుంచి అన్ని శక్తులూ అభినందిస్తాయి. లేకపోతే వారి ఇంతకాలం కృషి తేలిపోతుందని చెప్పడానికి సందేహం అక్కరలేదు.

ఎంతో ఉద్విగ్నంగా రాసిన వారి పూర్తి పాఠం, తెలుగులో ఇంగ్లీషులో చదవండి మరి.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article