Editorial

Wednesday, January 22, 2025
Peopleప్రతాప్ నట పోతనుడు - రామ్ చింతకుంట ఙ్ఞాపక నివాళి

ప్రతాప్ నట పోతనుడు – రామ్ చింతకుంట ఙ్ఞాపక నివాళి

ఆకలి రాజ్యంలో తాను కనిపించిన ప్రతి దృశ్యంలోను హాలులో నవ్వులు పండించాడు. చప్పట్లు, ఈలలు వేయించాడు. తాను కమిడియన్ కాదు, ఓ ముఖ్య క్యారెక్టర్. కథలో వచ్చి పోతుండే పాత్ర మాత్రమే. కానీ మళ్లి ఎప్పుడు వస్తాడో అన్నట్టు వేచి చూసే వాడిని.

రామ్ చింతకుంట

అది 82-83 మధ్యలో, రెండు మూడు సార్లు సినిమాకు తీసుకెళ్తానన్న నాన్న, దాట వేస్తూ వచ్చి ఓ రోజున అడిగిన దానికి బదులు ‘ఆకలి రాజ్యం’ తీసుకెళ్లారు. అదేంటో కానీ ఆ రోజున కరెంటు పోయి హోరున గాలి, జోరున వర్షం. జనరేటర్ వేసి చూసిన ఆ సినిమా మరిచిపోలేని సంఘటన.

ప్రేక్షకులు కూడా ఆద్యంతం ఓ కలిసి రాని కాలంలోని కొద్ధి మంది ఆశ, నిరాశ, నిరంకుశ వాదుల మధ్య నడిచే కథ వల్లే దాని ప్రభావం మాపై కూడా పడింది. సినిమా ఆద్యంతం నేను పెద్దగా ఇమడ లేక పోయాను. ఆ కధానిక నిరాసక్తతకు విసిగి పోయాను. నాన్న పాడే ఓ రెండు ప్రజాదరణ పొందిన పాటలు నన్ను కొంచం కూచోనిచ్చాయి. చూడనిచ్చేలా చేసింది మాత్రం కమల్ హాసన్, శ్రీదేవి కాదు; ఒకరు జే.వి. రమణ మూర్తి (కమల్ హాసన్ తండ్రి గా), ఇంకొకరు ఎవరో తెలియని ఓ కళ్లద్దాలు కుర్రాడు. అతడు నన్ను కట్టిపడేసినవాడు. తానే ప్రతాప్ పోతన్. తన గురించి నేను నాన్నతో చాలా సేపు మాటలాడు కొన్నాం, మరుసటి రోజు స్కూల్ లో కూడా పంచుకొన్నాను. నేటి ఉదయం కాలం చేసారని తెలుసుకొని, నా అనుభవాల నుంచి ఓ ఙ్ఞాపక నివాళి.

ఆకలి రాజ్యంలో తాను కనిపించిన ప్రతి దృశ్యంలోను హాలులో నవ్వులు పండించాడు. చప్పట్లు, ఈలలు వేయించాడు. తాను కమిడియన్ కాదు, ఓ ముఖ్య క్యారెక్టర్. కథలో వచ్చి పోతుండే పాత్ర మాత్రమే. కానీ మళ్లి ఎప్పుడు వస్తాడో అన్నట్టు వేచి చూసే వాడిని. తాను ప్రదర్శించిన నటన ఒక్క సందర్భంలో కూడా సినిమాలో నటిస్తున్నట్టు లేదు. నిజ జీవితంలోని వ్యక్తిని చూసినట్టే ఉంది. సినిమా నిడివిలో ఓ పది కన్నా తక్కువ సన్నివేశాల్లో మాత్రమే కనిపించినా నన్ను చాలా ఆకర్షించేసాడు.

తాను ప్రదర్శించిన నటన ఒక్క సందర్భంలో కూడా సినిమాలో నటిస్తున్నట్టు లేదు. నిజ జీవితంలోని వ్యక్తిని చూసినట్టే ఉంది.

ఆవేశం, ఆవేదన, అక్కసు, అసంతృప్తి, నిర్వేదం, నిస్పృహ, చమత్కారం, గేలి, చలాకీతనం, క్షమాపణ, బయపడ్డం, భయపెట్టడం, తిరస్కారం, కసి, తాపత్రయం – ఒకటేంటి అన్ని భావాలూ అలవోకగా పలికించేసి ఆ సినిమా టైటిల్ కు  న్యాయం చేసిన నటుడు తను మాత్రమే అన్నట్టు అగుపించాడు.

‘ఆకలి’ ఉన్న నటన ప్రదర్శించిన వాడు, ఆకలి కలిగించే నటుడు. తన పాత్రకు రాజసం అద్దిన వాడు. ఆలా చిన్నతనం నుండి నాపై ముద్ర వేసిన నటుడు ప్రతాప్.

ఇంగ్లీషు, తెలుగు, మలయాళం మాట్లాడే ఓ నాటక కంపెనీ యజమానిగా, దర్శకుడిగా, అర్బన్ వైఖరి ప్రదర్శించిన వైనం అద్భుతం. ప్రేమను దక్కించుకోవాలనే బలమైన కోరిక, సతమతమవుతూ ప్రేదర్శించే పలు చేష్టలు, బెదిరించైనా సాధించుకోవాలని ప్రయత్నించే పిచ్చి, ఓ నటుడికి అరుదుగా దక్కే వరం.

ఇదంతా ఒక ఎతైతే, సినిమా చివర్లో ఇక ప్రేమలో విఫలమైనానని తట్టుకోలేక స్వీయ నింద, తనపై తానే తిట్టుకోవడంతో ఆగకుండా, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కోవడానికి వచ్చిన బిక్షగాడికి, తాను కొన్న తాళిని వాడికి దానం చేస్తూ, వాణ్ణి చూసే చూపులోని తీక్షణత ఓ అరుదైన మెరుపు. ఆ సందర్భంలో ఓ గర్జన లాంటి స్టేట్మెంట్ చెప్తాడు,’యూ లక్కీ బాస్టర్డ్’ (you lucky bastard). ప్రతి పద ఉచ్చారణ లోను తన కోపం, దుఃఖం మరియు నిజాన్ని ఆహ్వానించలేని దైన్యం స్పష్టంగా కనిపిస్తుంది.

అతడి శైలి క్లాసిక్. ఆ కళ్ళు, హావభావాలు, సంఘర్షణ కలిపి చూపించే మెథడ్ యాక్టింగ్ కు అభిమానిగా మారాను.

ఈ పాత్రనే తీసుకొని స్కూల్లో చేసిన మోనో యాక్టుకు ప్రధమ బహుమతి వచ్చిందంటే, నన్ను ఎంతగా పట్టేసుకొన్నాడో తెలుస్తుంది. కాదు, ఆవహించాడో తెలుస్తుంది.

ఓ సీన్లో, ప్రతాప్ లాగే ఫైల్ను ప్రేక్షకుల పై వేసిరేసాను, అది అనుకోకుండా పాఠలు సరిగ్గా వినని విద్యార్థులను గురి తప్పకుండా చాక్ పీసుతో కొట్టే సైన్స్ టీచర్ (ఆవిడా నన్) పై పడ్డంతో అందరు నేను కావల్సి చేశాను అని అనుకొన్నారు. తరువాత అది కాదు, అని తెలుసుకొని తరువాత నేను పాత్రను అచ్చు తప్ప కుండా అనుకరణ చేసే క్రమంలోనే అది జరిగిందని క్షమించేసారు. మెచ్చుకొన్నారు కూడా.

బాలు మహేందర్ దర్సకత్వంలో వచ్చిన ‘మూడు పని’లోని నటన గురించి చెప్పుకుంటే, అది అమాయకత్వం, arrogant, strained మరియు చాలా tumultuous ప్రదర్శన.

ప్రతాప్ ఇంగ్లీషు, తమిళ్, మలయాళం భాషలపై పట్టు అద్వితీయం. అర్బన్ సంస్కృతిని ప్రతిబింబించేవాడు. శైలి క్లాసిక్. ఆ కళ్ళు, హావభావాలు, సంఘర్షణ కలిపి చూపించే మెథడ్ యాక్టింగ్ కు అభిమానిగా మారాను. ప్రతాప్ ఎక్కువగా తమిళం, మలయాళం సినిమాలు చేయడంతో చాలా తక్కువే చూడగలిగాను.

బాలు మహేందర్ దర్సకత్వంలో వచ్చిన ‘మూడు పని’లోని నటన గురించి చెప్పుకుంటే, అది అమాయకత్వం, arrogant, strained మరియు చాలా tumultuous ప్రదర్శన అంటాను నేను. అందులోని ‘యెన్ ఇనియ పోణ నిలావే’ 90ల కాలం నుండి నేటి వరకు రాత్రుల్లో తప్పక వినే తమిళ పాట.

తన స్వీయ దర్సకత్వంలో రాధికా తో నటించిన ‘మీండుం ఒరు కాదల్ కథై’ పిండేస్తుంది.

తరువాతి కాలంలో దర్శకుడిగా, కమల్ నటించిన ‘వెట్రీ విళ్లా’, తెలుగులో నాగార్జున నటించిన ‘చైతన్య’లో తన స్టైలిష్, ఈజీ గోయింగ్, అర్బన్ మార్కు ఆలోచన కనిపిస్తుంది. గ్రాడ్యుయేషన్ లో అప్పటి సన్ టీవీలో చూసిన తన స్వీయ దర్సకత్వంలో రాధికా తో నటించిన ‘మీండుం ఒరు కాదల్ కథై’ పిండేస్తుంది. వారిద్దరి నటన అమోఘం. ఆ సినిమాకు దర్శకుడిగా తోలి ప్రయత్నంలోనే జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం అందుకోవడం ఆ దర్శక ప్రతిభకు దక్కిన గుర్తింపు. ఆ సినిమా కాపీని ఈ మధ్యనే దొరికిందని ఫేస్ బుక్లో దాని డిజిటల్ వెర్షన్ లింకు పోస్ట్ చేసుకొన్నరు. ఆ సంబరం మనల్ని తాకుతుంది. ఆరని తడిగా మనపై అలాగే ఉండి పోతుంది.

మణిరత్నం, సత్యరాజ్, కమల్ హాసన్, మోహన్ లాల్, ప్రిథ్వి రాజ్, దుల్కర్, మాధవన్, కుష్బూ వారి ట్విట్టర్లు స్పందనే అందుకు సాక్ష్యం. కమల్ చెపినట్టు, ‘ఓ గొప్ప తపనున్న నటనను దగ్గరగా చూసే భాగ్యం మనకు ఇచ్చాడు. ఇంకా ఏంతో ఉన్నా ప్రదర్శనకు నోచుకోకుండా పోయాం’ అనడం అతిశయోక్తికాదు. ఓ సారి ఆ నటన ఆకలిని వెళ్లి చూడండి, ఇంకా తిరిగి రాడు కాబట్టి.

Truly, Pratap! There’s No Match For You.

 

More articles

3 COMMENTS

  1. మీ రచన తో విలక్షణమైన ప్రతాప్ నటనకు జీవం పోశారు. ఆసక్తికరంగా సాగింది స్వగతం తో కూడిన కథనం. కాల క్రమంలో కొంతమంది నటులను మర్చి పోతున్నాం. ఇలాంటివి చదినప్పుడు ఒక్కసారి వారిని గుర్తు చేసుకున్నట్లు ఉంటుంది. అలాగే గౌరవించినట్లు కూడా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article