Editorial

Monday, December 23, 2024
Serialరక్ష – 4th chapter – డా.విఆర్.శర్మ డైలీ సీరియల్

రక్ష – 4th chapter – డా.విఆర్.శర్మ డైలీ సీరియల్

నిన్నటి కథ

ఒక కొత్త లోకానికి వేల్లినట్లుగా ఉంది రక్షకు. అక్కడ అందమైన స్వప్నాన్ని చూస్తున్నట్టు ఉంది ఆ దృశ్యం. దూరంగా ఒక పెద్ద కొండ పైనుంచి కిందకు దూకుతున్న జలపాతపు హోరు పై లోకాల్లోంచి వస్తున్న సంగీతంలా వినబడుతోంది. “ఆహా! అద్భుతం! ఎంత అందంగా ఉంది మీ ఊరు!” సంతోషం దాచుకోలేనట్టుగా చప్పట్లు కొట్టింది రక్ష. వాళ్లు ఆ ఊళ్లో అలా కొంత సేపు నడిచి ఒక ఇంట్లోకి ప్రవేశించారు. ఇక నేటి కథలికి వెళదాం.

నాలుగో అధ్యాయం

డా.వి.ఆర్.శర్మ

“ఎవరు మీరు? మనం ఎక్కడ ఉన్నాం?” అడిగింది రక్ష.

“మేమూ మీలాంటి ప్రాణులమే. కానీ ఈ భూగ్రహం మీద మీకంటే వేల సంవత్సరాల ముందు పుట్టిన వాళ్లం. మేం దాదాపు మీలాగే ఉంటాం. కానీ, మీరూ మేమూ ఒకే రకమైన వాళ్లం కాదు. మీకూ మాకూ కొన్ని విషయాల్లో తేడాలు ఉన్నాయి. మేమూ, మాకు సంబంధించినవి ఏవీ మీకు కనబడవు, వినబడవు, అందవు. ప్రకృతి మాత మమ్మల్ని అలా సృష్టించింది. మనం ఇప్పుడు అత్యంత ప్రాచీన కాలం నుంచి వ్యాపించి ఉన్న ఒక మహారణ్య గర్భంలో ఉన్నాం,” రక్ష ప్రశ్నకు జవాబుగా చెప్పింది అరణ్య.

వాళ్లు వలయాకారంలో ఉన్న ఆ ఇంటి హాల్లో వెదురు, ఇంకా ఏవో సన్నటి బలమైన చెట్ల తీగలతో చేసిన కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. వాళ్ల చేతుల్లో ఏవో పళ్లతో చేసిన రసంతో నిండిన పాత్రలు ఉన్నాయి. అవి వెదురు పాత్రల లాగానే ఉన్నాయి. అందంగా, పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఒక పర్ణశాలలా ఉంది ఆ ఇల్లు. ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా ప్రకృతి సిద్ధంగా దొరికిన వస్తువులతోనే చేసినట్టుంది. వాళ్లతో బాటు ఆ ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్లు ఉన్నారు. వాళ్లను తన తల్లిదండ్రులని పరిచయం చేసింది అరణ్య. వాళ్ల పనుల్లో వాళ్లు ఉన్నారు.

నాకు జరిగిన అనుభవం వల్ల ఇదంతా కల కాదని తెలుస్తోంది. కానీ, సరిగా అర్థం కావడం లేదు. నాకు మరింత బాగా అర్థం అయ్యేలా చెపుతారా?” వాళ్లను అడిగింది రక్ష.

“నాకు జరిగిందీ, జరుగుతున్నదీ అంతా అయోమయంగా, గందరగోళంగా అనిపిస్తోంది. ఇది మీ లోకం అంటున్నారు. నమ్మడానికి వీలుకాని విషయాలు చెపుతున్నారు. కానీ, నాకు జరిగిన అనుభవం వల్ల ఇదంతా కల కాదని తెలుస్తోంది. కానీ, సరిగా అర్థం కావడం లేదు. నాకు మరింత బాగా అర్థం అయ్యేలా చెపుతారా?” వాళ్లను అడిగింది రక్ష.

రక్ష : ఇది పిల్లల సైన్స్ ఫిక్షన్ నవల. ‘తానా’ – ‘మంచి పుస్తకం’ సౌజన్యంతో ప్రచురణ. రచయిత డా.వి.ఆర్.శర్మ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, కామారెడ్డి వాస్తవ్యులు. తెలుగు భాష బోధనతో తన ఉద్యోగ జీవితాన్ని సార్థకం చేసుకున్న శర్మ గారు బాల సాహిత్యానికి చేసిన సేవ అమూల్యమైనది. వారు అనేక సాహిత్య సంస్థల్లో పనిచేస్తున్నప్పటికీ స్వయానా తానే ఒక సంస్థ అనడం సముచిత గౌరవం. ‘సాహు జీవితం – రచనలు’ వారు ఎం.ఫిల్ పరిశోధనాంశం కాగా ‘ఆధునిక కవిత్వంలో బాల్య చిత్రణ’పై వారు పి.హెచ్ డి చేయడం మరో విశేషం. మీరు చదివే ‘రక్ష’ పిల్లక కోసం వారు రాసిన సైన్స్ ఫిక్షన్ నవల. ఇప్పటివరకు శర్మ గారు 8 కవిత సంపుటులు,  4 పాటల పుస్తకాలు, రక్ష నవలతో కలిపి 4 నవలలు వెలువరించారు. వారి పూర్తి పరిచయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. రచయిత ఇ – మెయిల్ : dr.v.r.sharma@gmail.com 

“చెపుతాను. కానీ, నువ్వు నమ్మలేనట్టుగా ఉంటుంది ఈ నిజం,” అంది అరణ్య.

కాసేపాగి, “మీలాగే మేమూ ఈ భూమి మీద పుట్టిన వాళ్లం. అనేక లక్షల జీవరాసులు ఈ భూగ్రహం మీద పుట్టి పెరుగుతున్నాయి కదా. అవన్నీ ఒకే రకంగా లేవు. ఈ ప్రకృతి రకరకాల లక్షణాలతో, జీవ నిర్మాణాలతో, అనేక వైవిధ్యాలతో ఉన్న విభిన్న ప్రాణులకు జన్మను ఇచ్చింది. మేం కూడా ఈ ప్రకృతి మాత బిడ్డలమే. మాకు ఉండే ప్రత్యేక లక్షణాలూ, ప్రత్యేకతలూ మాకు ఉన్నాయి. కానీ చూడటానికి దాదాపుగా మీలాగే ఉంటాం కదా!” చివరి మాట అంటున్నప్పుడు చిన్నగా నవ్వింది అరణ్య.

“నిజమే! మరి మీరు మాట్లాడుతున్న భాష?” సందేహంగా అడిగింది రక్ష.

‘‘ఇదీ మీ భాషే. ఇప్పుడు నేను నీతో నీ భాషలోనే మాట్లాడుతున్నాను. ఏ భాషనైనా ఒకసారి వినగానే పూర్తిగా నేర్చుకునే నైపుణ్యం మాకు పుట్టుకతోనే వస్తుంది. నిజానికి మా భాష వేరు. మాలో మేం మాట్లాడుకునే భాష వేరు. అది మీరు అర్థం చేసుకోలేరు,” చెప్పింది.

“మరి మీరు ఉండే ఈ చోటు… ?”

“ఈ భూమి మీదే ఉంది. కానీ చాలా పరిమితమైన ప్రాంతాల్లో మేం ఉంటున్నాం. మా జనాభా కూడా చాలా తక్కువ.”

“అందరూ ఇక్కడే ఉంటారా?”

“లేదు. వివిధ ఖండాల్లో కొన్ని ప్రాంతాల్లో మాలాంటి వాళ్లు ఉంటున్నారు.”

“నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నాకు ఇక్కడ ఎలాంటి వాహనాలు కనిపించలేదు. బస్సులు, కార్లు, బైకులు వంటివి…”

ప్రకృతిని నాశనం చేసే వేటినీ మేం సృష్టించం, ఉపయోగించం. ఆ తల్లి ఇచ్చిన దానిని ఉపయోగించుకుని జీవిస్తాం. మా జీవితాలకు అవసరమైనవన్నీ ఆ ప్రకృతిమాత మాకు ఇస్తూనే ఉంది.

“లేదు. మేం అలాంటివి ఏవీ తయారు చేయం. ఉపయోగించం. ఆ అవసరం మాకు లేదు. ప్రకృతిని నాశనం చేసే వేటినీ మేం సృష్టించం, ఉపయోగించం. ఆ తల్లి ఇచ్చిన దానిని ఉపయోగించుకుని జీవిస్తాం. మా జీవితాలకు అవసరమైనవన్నీ ఆ ప్రకృతిమాత మాకు ఇస్తూనే ఉంది.”

“మరి, మీరు ఎటైనా ఎలా వెళతారు? మీ ప్రయాణాలు, వస్తువుల రవాణా ఎలా?”

“మేం ఉన్న చోటనే అన్నీ దొరుకుతాయి. కాబట్టి పెద్ద ఎత్తున రవాణా అవసరాలు ఉండవు. లాభాల కోసం వ్యాపారాలు చేయం, ఆ రకమైన రవాణాలు మేం చేయం. అది మా కట్టుబాటు, అది మా నాగరికత.”

“మీ చదువులూ, ఆరోగ్యం, వైద్యాలూ… ?”

“ప్రకృతి ఒడిలోనే, ప్రకృతి సహకారంతోనే అన్నీ ఉంటాయి.”

“మీ గురించి మనుషులకు తెలియదా? ఎంతో శాస్త్రీయ ప్రగతి సాధించిన మనుషులు ఇంతవరకు మీ గురించి ఎందుకు తెలుసుకోలేక పోయారు?”

అవన్నీ పళ్లూ, కాయగూరలేనని, పూర్తిగా శాఖాహారమేనని చెప్పింది ఆ తల్లి. అది మరో లోకపు తిండిలా అనిపించలేదు. కడుపు నిండా తినేసింది రక్ష.

“ఇప్పటివరకైతే మా గురించి మనుషులకు తెలియదు. అలా ప్రకృతి మాకు రక్షణ కల్పించింది. అందుకు తగినట్టే మేం కూడా తగిన జాగ్రత్తలతో, కట్టుబాట్లతో జీవిస్తున్నాం. ప్రకృతి మాకు నిర్దేశించిన ప్రదేశాలలోనే ఉంటాం. మా ప్రాంతాలను మనుషులు చూడలేరు. మా చోటుకి రాలేరు. దేన్నీ ముట్టుకోలేరు. మేం ఇక్కడ ఉన్నట్టు ఏ పరికరాలతో కూడా గ్రహించలేరు. ఇలా మా పరిధుల్లో, మా ప్రాంతాల్లో మేం ఉన్నంత వరకు మా గురించి మనుషులకు తెలిసే అవకాశం లేదు.”

“మరి ఇప్పుడు మీ గురించి నాకు తెలిసింది కదా? మీ అందరినీ చూస్తున్నాను కదా?”

“ఔను. నీకు తెలిసింది. నీకు తెలిసేలా మేమే చేశాం. ఇప్పుడు ఈ పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది.”

“అంటే… కొంచం తెలిసేలా చెప్పండి,” అడిగింది రక్ష.

“చెపుతాను…” అంటుండగానే అరణ్య తల్లి, “తిన్న తరవాత మాట్లాడుకోండి,” అంటూ తినడానికి పిలిచింది.

“సరే అమ్మా!” అంటూ లేచింది అరణ్య. అవని, రక్ష కూడా ఆమెతో పాటే లేచారు. అక్కడ తినే చోట నేల మీద చిన్న చిన్న చాపల లాంటివి వేసుకుని కూర్చున్నారు. విస్తళ్ల లాగా ఉన్న పెద్ద పెద్ద ఆకుల్లో ఆహారం వడ్డించింది అరణ్య తల్లి. అవి రకరకాల ఆహార పదార్థాలు. రక్ష ఎన్నడూ అలాంటి ఆహార పదార్థాలను తినలేదు. కానీ ఎంతో రుచికరంగా ఉన్నాయని రక్షకు అనిపించింది. అవన్నీ పళ్లూ, కాయగూరలేనని, పూర్తిగా శాఖాహారమేనని చెప్పింది ఆ తల్లి. అది మరో లోకపు తిండిలా అనిపించలేదు. కడుపు నిండా తినేసింది రక్ష.

గత చాప్టర్ల కోసం కింద క్లిక్ చేయండి

మూడో అధ్యాయం. రెండో అధ్యాయం. తొలి అధ్యాయం

మీ స్పందనలు టైప్ చేయడానికి కింద LEAVE A REPLY అని ఇలా ఉంటుంది.
అక్కడ తెలుపవచ్చు. కృతజ్ఞతలు – ఎడిటర్

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article