Editorial

Saturday, September 21, 2024
Serialరక్ష - 2nd chapter - డా.విఆర్.శర్మ డైలీ సీరియల్

రక్ష – 2nd chapter – డా.విఆర్.శర్మ డైలీ సీరియల్

నిన్నటి కథ :

తెల్లటి కాంతి సుడిగుండంలా తిరుగుతుంటే. అదేమిటో చూడాలని దానికి మరింత దగ్గరకు వెళ్లి నిలబడింది రక్ష. దానివైపు ముందుకు వంగి చూసింది. అంతే… హఠాత్తుగా బలమైన శక్తి ఏదో తనను దాని లోపలికి లాగేస్తున్నట్టు… తాను రబ్బర్లా సాగిపోతున్నట్టు, నీళ్లలా జారిపోతున్ననట్టు, గాలిలా తేలిపోతున్నట్టు… అలా దాని లోపలికి వెళ్లిపోతున్నట్టు అనిపించింది. ఆ తర్వత ఏమైంతో చెప్పే రెండో అధ్యాయం ఇది.

డా.వి.ఆర్.శర్మ

Rakshaమధ్యాహ్నం ఒంటి గంట…

రక్ష కోసం తాతయ్య, బాబాయి, మరికొందరు ఊరంతా జల్లెడ పట్టినట్టు వెతుకుతున్నారు. ఆ పాఠశాల ఆవరణ, ఆ శిథిల భవనం, ఆమె స్నేహితుల ఇళ్లు, వీధులు అన్నీ వెతికారు. రక్ష కనిపించడం లేదని ఊరంతా చెప్పుకుంటున్నారు. ‘రక్షతో కలిసి తాము ఆ బడిలో ఉన్న ఆ బిల్డింగ్ వైపు వెళ్లామని, తాము మొదటి గదిలోనే ఆగిపోతే లోపల చూసి వస్తానని రక్ష వెళ్లిందని, మళ్లీ బయటకు రాలేదని, చాలా సేపు ఎదురుచూసి, అంతా వెతికామని, కానీ రక్ష కనిపించలేదని,’ రక్షతో కలిసి వెళ్లిన స్నేహితులు చెపుతున్నారు. ఎంత మంది అడిగినా, ఎన్నిసార్లు అడిగినా వాళ్లది అదే సమాధానం. వాళ్లు చెప్పేది నిజమని చాలామంది నమ్మడం లేదు. నిజమే అయితే రక్ష ఏమైపోయినట్టు?

‘వాళ్లకు తాను కనిపించడం లేదేమో!’ అనే ఆలోచన రక్షను తీవ్ ఆందోళనకూ, భయానికీ గురి చేసింది. మరో విషయం కూడా రక్ష గమనించింది. మనుషులనే కాదు కుర్చీలు, మంచం, తలుపులు, గోడలు వంటి ఏ వస్తువులను కూడా తాను ముట్టుకోలేక పోతోంది.

కానీ, ఇప్పుడు రక్ష అక్కడే వాళ్ల మధ్యనే ఉంది. వాళ్లను చూస్తూనే ఉంది. తాతయ్యతో, నానమ్మతో, బాబాయితో, తన స్నేహితులతో మాట్లాడాలని ప్రయత్నిస్తూనే ఉంది. గట్టిగా అరిచి చెపుతున్నా ఎవరూ తన మాటలను వినిపించుకోవడం లేదు. తను అక్కడ ఉన్నట్టు ఎవరూ గుర్తించడం లేదు. వాళ్లను ముట్టుకోవాలని, గట్టిగా పట్టుకోవాలని తిరిగి వచ్చినప్పటి నుంచి అనేకసార్లు ప్రయత్నం చేసింది. కానీ ఎవరూ తన స్పర్శకు అందడం లేదు. ‘వాళ్లకు తాను కనిపించడం లేదేమో!’ అనే ఆలోచన రక్షను తీవ్ర ఆందోళనకూ, భయానికీ గురి చేసింది. మరో విషయం కూడా రక్ష గమనించింది. మనుషులనే కాదు కుర్చీలు, మంచం, తలుపులు, గోడలు వంటి ఏ వస్తువులను కూడా తాను ముట్టుకోలేక పోతోంది. మరో ఘోరమైన విషయం ఏమిటంటే తన కాళ్లు కూడా నేలను తాకడం లేదు. తాను కూర్చున్నా, నిలబడ్డా నేలకు ఆనడం లేదు. కొంప తీసి తాను చనిపోయిందా? ఒక ఆత్మగానో, దయ్యంగానో మారిపోయిందా? గుండె దడదడా కొట్టుకుంటున్నట్టు అనిపించింది. తాను చచ్చిపోతే తన శరీరం వీళ్లకు దొరికి ఉండాలి కదా? కానీ తన శరీరం తనకు కనబడుతూనే ఉంది. తనకి తన స్పర్శ తెలుస్తోంది. ‘ఊహు… నేను చావలేదు. నేను చావలేదు,’ గట్టిగా తనకు తాను చెప్పుకుంది రక్ష.

రక్ష : ఇది పిల్లల సైన్స్ ఫిక్షన్ నవల. ‘తానా’ – ‘మంచి పుస్తకం’ సౌజన్యంతో ప్రచురణ. రచయిత డా.వి.ఆర్.శర్మ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, కామారెడ్డి వాస్తవ్యులు. తెలుగు భాష బోధనతో తన ఉద్యోగ జీవితాన్ని సార్థకం చేసుకున్న శర్మ గారు బాల సాహిత్యానికి చేసిన సేవ అమూల్యమైనది. వారు అనేక సాహిత్య సంస్థల్లో పనిచేస్తున్నప్పటికీ స్వయానా తానే ఒక సంస్థ అనడం సముచిత గౌరవం. ‘సాహు జీవితం – రచనలు’ వారు ఎం.ఫిల్ పరిశోధనాంశం కాగా ‘ఆధునిక కవిత్వంలో బాల్య చిత్రణ’పై వారు పి.హెచ్ డి చేయడం మరో విశేషం. మీరు చదివే ‘రక్ష’ పిల్లక కోసం వారు రాసిన సైన్స్ ఫిక్షన్ నవల. ఇప్పటివరకు శర్మ గారు 8 కవిత సంపుటులు,  4 పాటల పుస్తకాలు, రక్ష నవలతో కలిపి 4 నవలలు వెలువరించారు. వారి పూర్తి పరిచయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. రచయిత ఇ – మెయిల్ : dr.v.r.sharma@gmail.com 

‘ఏ వస్తువులూ తనకు తగలడం లేదు కదా. మరి ఈ గోడలు తనను ఆపుతాయా… చూద్దాం,’ అనుకుంది. వెంటనే కళ్లు మూసుకుని తలను కొద్దిగా ముందుకు వంచి, దాదాపు పరిగెడుతున్నట్టుగా వేగంగా అడుగులు వేస్తూ సూటిగా గోడవైపు వెళ్లింది. దడేలుమంటూ గోడకు తల తగులుతుందేమో? ఆశ్చర్యంతో గుండె ఆగిపోయినట్టయ్యింది. తాను ఏ ఆటంకం లేకుండా ఆ గోడలోంచి పక్క గదిలోకి వచ్చేసింది. అంటే… వస్తువులు ఏవీ తనకు తగిలే అవకాశం లేదన్నమాట! ఆలోచిస్తున్న రక్షకు అప్పుడే కడుపులో సన్నగా ఆకలి మొదలైనట్టు అనిపించింది. కానీ ఎలా? తాను ఏదీ ముట్టుకోలేదు, పట్టుకోలేదు. తినలేదు, కనీసం నీళ్లు కూడా తాగలేదు కదా. మరి… తనకు ఆకలి, దాహం పెరిగితే ఎలా?

నాన్నమ్మ ఏడుస్తోంది, పిన్ని సముదాయిస్తోంది. తాతయ్య, “ఆ అడివి లింగేశ్వరం గుడి దిక్కు వెళ్లి చూడండి. అక్కడి అడివిలో కూడా బాగా తిరిగి, మళ్లీ వెతికించండి,” అని చిన్న కొడుకుకి చెప్పి, “మాణిక్యం వాళ్లకు ఫోన్ చేశావా?” అని అడిగాడు.

“అప్పుడే ఫోన్ చేశాను నాన్నా. వాళ్లు మరో రెండు గంటల్లో వచ్చేస్తారు. అలాగే పోలీస్ స్టేషన్లో కూడా చెప్పి రమ్మని పంపించాను,” బదులు ఇచ్చాడు శివుడు. “మన వాళ్లు అడివి లింగేశ్వరం గుడి దిక్కు వెతకటానికి వెళ్లారు. ఇంకా ఆ చుట్టుపక్కల వెతుకుతున్నారు,” చెప్పాడు మళ్లీ. తాతయ్య, చిన్నాన్న ఇద్దరూ ఇంట్లోంచి బయటకు వెళ్లారు. గదిలో నాన్నమ్మ ఏడుస్తూనే ఉంది. పిన్ని వంటింట్లోకి వెళ్లింది. నాన్నమ్మను ఓదార్చాలనుకుంది రక్ష. కానీ అది తనకు సాధ్యమయ్యేలా లేదు. అసలు, ఆ పాడుబడిన భవనంలో తనకి ఏం జరిగింది? గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది.

అక్కడ తనకు కనబడ్డ ఆ నీలి రంగు కాంతి దగ్గరకు వెళ్లి చూడడం వరకు మాత్రమే తనకు గుర్తుంది. అంతే, ఆ తరవాత ఏం జరిగిందో తనకు గుర్తులేదు

అక్కడ తనకు కనబడ్డ ఆ నీలి రంగు కాంతి దగ్గరకు వెళ్లి చూడడం వరకు మాత్రమే తనకు గుర్తుంది. తరవాత ఏదో జరిగింది. తనను ఏదో అదృశ్య శక్తి ఆ కాంతిలోకి లాగేస్తున్నట్టు, తాను కరిగిపోతున్నట్టు, ఎటో ఎగిరి పోతున్నట్టు అనిపించింది. అంతే, ఆ తరవాత ఏం జరిగిందో తనకు గుర్తులేదు. తాను కళ్లు తెరిచే సరికి ఆ భవనంలో అదే గదిలో నిలబడి ఉంది. కానీ అక్కడ అంతకు ముందు కనబడిన ఆ నీలి వెలుగు లేదు.

బయటకు వచ్చి తన స్నేహితుల కోసం చూస్తే అక్కడ వాళ్లు ఎవరూ లేరు. సూర్యుడు నడినెత్తిన వెలుగుతున్నాడు. అంటే తాను ఆ గదిలో సుమారు రెండు గంటలకు పైగా ఉందన్నమాట. మరి తన స్నేహితులు ఏరి? తనను పిలవకుండా ఒంటరిగా అక్కడ వదిలేసి ఎందుకు వెళ్లిపోయారు? ఆలోచిస్తూనే నేరుగా ఇంటికి వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి, తాను కనిపించడం లేదని అందరూ కంగారు పడుతున్నారు. తనను ఎవరూ చూడలేకపోతున్నారు. ఇంతసేపైనా ఏం జరిగిందో తనకి కూడా అర్థం కావడం లేదు.

మూడు గంటలు కావస్తుండగా బయట ఏదో కారు హారన్ వినిపించింది. దాంతోబాటు, “అన్నయ్య వాళ్లు వచ్చారు,” అంటున్న రక్ష బాబాయ్ శివ మాటలు వినిపించాయ్. రక్ష చప్పున తన ఆలోచనల్లోంచి బయటపడి, సంతోషంగా ఇంట్లోంచి బయటకు వచ్చింది. రక్ష తల్లిదండ్రులు నందన, మాణిక్యం కారులోంచి దిగి వస్తున్నారు. “అమ్మా!” అని గట్టిగా పిలుస్తూ అలాగే పరిగెత్తుకుంటూ వెళ్లి, తల్లిని గట్టిగా కౌగలించుకుంది రక్ష. కానీ తల్లి తనను దాటి ముందుకు వెళ్లిపోతోంది. తనకు అందడం లేదు. అమ్మా, నాన్నలు తనను చూడలేకపోతున్నారు. తన మాటలు వినలేకపోతున్నారు. తనకు మాత్రమే తాను కనబడుతోంది. తన మాటలు తనకు మాత్రమే వినబడుతున్నాయ్… అంతా అయోమయం… ఏం చేయాలో తెలియని దు:ఖం… రక్ష అలా వెర్రిదానిలా ఆ ఎండలో నిలబడిపోయింది.

వాళ్లు ఇంట్లోకి వెళ్లిపోయారు. వెనక వచ్చిన తాతయ్య, ఆయన వెంట మరికొందరు ఇంటి లోపలికి వెళుతున్నారు. తాను కూడా లోపలికి వెళ్లడానికి అటువైపు కదిలింది.

తాను అక్కడకు రాగానే అప్పటి వరకూ చెట్లమీద ఉన్న కొన్ని పక్షులన్నీ ఎవరో తరుముతున్నట్టు అరుస్తూ లేచి ఎగిరి పోతున్నాయి. ‘తను వాటికి కనబడుతోందా? తనను చూసే అవి అలా అరుస్తూ దూరంగా ఎగిరి పోతున్నాయా?’ అనిపించింది రక్షకు.

ఆ పరిస్థితుల్లో కూడా ఒక విషయం గమనించింది రక్ష. తనకిప్పుడు ఆకలి, దాహం అనిపించడం లేదు. కడుపు నిండినట్టుగా ఉంది. దాహం తీరినట్టుగా ఉంది. కానీ తాను ఏమీ తినలేదే!? నీళ్లు కూడా తాగలేదు కదా!? మరి ఈ మార్పు ఎలా జరిగింది? మెరుపులా ఒక ఆలోచన కలిగింది. తాను ఒక చెట్టులా సూర్యరశ్మి సహాయంతో ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోగలుగుతోందా!?

ఇంట్లో వాతావరణం అంతా దు:ఖంతో నిండిపోయింది. తాతయ్య చెపుతున్నాడు, “నేను కూడా ఇప్పుడే పోలీస్ స్టేషన్కు వెళ్లి వచ్చాను. వాళ్లు కూడా వస్తున్నారు. అటువైపు అడవిలో వెతకడానికి కూడా కొందరు వెళ్లారు.” ఎంత గంభీరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా, ఆయన పడుతున్న ఆందోళన బయటికి తెలిసిపోతోంది. ఏం జరిగిందో, ఎలా జరిగిందో అక్కడ ఉన్నవాళ్లు రక్ష వాళ్ల అమ్మా, నాన్నలకు చెపుతున్నారు. పోలీసులు వచ్చారు. ఇంట్లో వాళ్లు చెప్పిన విషయాలు విన్నారు. రక్ష స్నేహితులను కూడా కలిసి, రకరకాల ప్రశ్నలు అడిగారు. పాఠశాల వైపు వెళ్లి ఆ ప్రాంతాలు, శిథిలమైన భవనం తిరిగి చూశారు. రక్ష అమ్మా, నాన్నా, తాతయ్య, బాబాయ్, మరి కొందరు కూడా వాళ్లతో వెళ్లారు. వాళ్లతో బాటే రక్ష కూడా తిరిగింది. కానీ ఎక్కడా వాళ్లకు ఏ ఆధారాలూ దొరకలేదు. చివరికి “సరే, మేం చేయాల్సిన విధంగా ప్రయత్నం చేస్తాం,” అని చెప్పి, పోలీసులు వెళ్లి పోయారు. ఆ రాత్రంతా ఎవరూ నిద్రపోలేదు. చీకటి గడ్డకట్టినట్టు, మెలకువలో పీడకల లాగా గడిచింది.

మరునాడు తెల్లవారింది. ఆ రోజు సంక్రాంతి పండగ. ఊరంతా పండగ వాతావరణం కనబడుతున్నా ఊళ్లో లోలోపల తెలియని దిగులూ, భయం కనిపించని గాలిలా వీస్తున్నట్టుంది. రక్ష వాళ్ల ఇంట్లో పండగ వాతావరణమే లేదు. అక్కడ విషాదం గూడు కట్టుకుంది. రక్షకు ఏం చేయాలో తోచడం లేదు. తాను ఇందరి మధ్య ఉన్నా ఒంటరిది. రక్షకు ఎందుకో మళ్లీ ఒకసారి ఆ పాత భవనంలోకి వెళ్లి చూడాలనిపించింది. మెల్లగా అటువైపు బయలుదేరింది.

రక్ష గుండె ఝల్లుమంది. అలాగే కదలకుండా నిలబడి పోయింది. మళ్లీ అది కనబడుతోంది. దగ్గరికి వెళితే మళ్లీ ఏమౌతుందో… ‘ఏమైనా కానీ,’ అనుకుంది. అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా దాని దగ్గరికి వెళ్లింది. ఆ నీలి వలయం గుండ్రంగా, వేగంగా ఒక సుడిగుండంలా తిరుగుతోంది. రక్ష తెగించినట్టుగా చటుక్కున ఆ వలయం మీదికి ముందుకు వంగింది.

పాఠశాల గేటుదాటి లోపలికి వచ్చింది. ఆ ప్రాంగణం అంతా శూన్యంగా కనిపిస్తోంది. తను కనిపించకుండా పోయిన తరవాత పిల్లలు ఎవరూ భయంతో ఇటువైపు రావడం లేదు. కొద్దిసేపు అక్కడే ఉన్న ఒక చెట్టు కింద నిలబడింది. తాను అక్కడకు రాగానే అప్పటి వరకూ చెట్లమీద ఉన్న కొన్ని పక్షులన్నీ ఎవరో తరుముతున్నట్టు అరుస్తూ లేచి ఎగిరి పోతున్నాయి. ‘తను వాటికి కనబడుతోందా? తనను చూసే అవి అలా అరుస్తూ దూరంగా ఎగిరి పోతున్నాయా?’ అనిపించింది రక్షకు.

మళ్లీ ఆ పాడుబడిన కట్టడంలోకి నడిచింది. తాను ఇంతకు ముందు వెళ్లినప్పుడు ఉన్నట్టే ఉంది అది. ఆ గదిలో అదే మసక వెలుతురు. అదే ముక్కవాసన. నలుమూలలా బూజు, పెచ్చులు ఊడిపోయి, నలుపూ ఆకుపచ్చదనం కలిసిన మరకలతో కనిపిస్తున్న గోడలు. మట్టి, చెత్తాచెదారంతో నిండి ఉన్న నేల. తనకు ఆ నీలి రంగు వలయం లాంటిది మళ్లీ కనిపిస్తుందేమో అని అక్కడ నేల మీద వెతికింది. అక్కడ అంతా మట్టి, చెత్త మాత్రమే కనిపించాయి. నిరాశగా వెనకకు తిరుగబోతుండగా అది జరిగింది. ఏదో సుడిగాలి వచ్చినట్టు హఠాత్తుగా అక్కడ ఉన్న చెత్త గుండ్రంగా తిరుగుతూ పైకి లేచింది. సరిగ్గా అది లేచిన చోట నేలమీద ఒక చిన్న చేతి గాజు పరిమాణంలో నీలి రంగు కాంతి వలయం భూచక్రంలా గిరగిరా తిరుగుతోంది. రక్ష గుండె ఝల్లుమంది. అలాగే కదలకుండా నిలబడి పోయింది. మళ్లీ అది కనబడుతోంది. దగ్గరికి వెళితే మళ్లీ ఏమౌతుందో… ‘ఏమైనా కానీ,’ అనుకుంది. అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా దాని దగ్గరికి వెళ్లింది. దాని మధ్యలో తెల్లటి కాంతితో అది అచ్చం తనకు గతంలో కనిపించినట్టే ఉంది. ఆ నీలి వలయం గుండ్రంగా, వేగంగా ఒక సుడిగుండంలా తిరుగుతోంది. రక్ష తెగించినట్టుగా చటుక్కున ఆ వలయం మీదికి ముందుకు వంగింది. రక్షకు మళ్లీ అదే అనుభవం… సాగిపోతున్నట్టు, కరిగిపోతున్నట్టు, గాలిలా మారిపోతూ ఆ వలయం లోపలికి వేగంగా వెళ్లిపోతున్నట్టు…

మీరు చదివింది రెండో అధ్యాయం. నిన్నటి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. రేపు మూడో అధ్యాయం చదువుతారు. మీ స్పందనలు కాస్త కిందకు వెళ్లి చూడగలరు. LEAVE A REPLY అని ఇలా ఉంటుంది. అక్కడ తెలుపవచ్చు. కృతజ్ఞతలు – ఎడిటర్

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article