Editorial

Wednesday, January 22, 2025
Serialరక్ష - పున్నమి చందమామలా ఉంది : 19th Chapter

రక్ష – పున్నమి చందమామలా ఉంది : 19th Chapter

నిన్నటి కథ

రక్ష మోకాళ్ల మీద కూర్చుని ముందుకు వంగి ఆయనకు నమస్కరించింది. రక్షకు వీడ్కోలు చెపుతున్నట్టు అరణ్య, అవని ఆత్మీయంగా పట్టుకుని, ప్రేమగా కౌగిలించుకున్నారు. ఆ స్వచ్ఛ, సుందరమైన ప్రాకృతిక లోకపు పరిసరాలను తన అణువణువునా నింపుకుంటూ చూసింది రక్ష. ఆ జ్ఞాపకాలను తన హృదయం నిండా నింపుకోవడానికి ప్రయత్నించింది. ఆ తర్వాత మెల్లగా ఆ నీలి బిలం వైపు అడుగు వేసి దానిలోకి వంగి చూసింది. మరుక్షణం ఆ నీలి బిలం రక్షను తనలోకి తీసేసుకుంది. ఇక తర్వాత ఏమైందో చదవండి…

పందొమ్మిదో అధ్యాయం

డా.వి.ఆర్.శర్మ

“నువ్వు మనిషివా? యంత్రానివా? లేక మరేదైనానా? నిన్ను ఏమి అనుకోవాలి?” మోక్షను ప్రశ్నించాడు శరత్.

“మనుషులూ, మా లోకపు ప్రకృతి శక్తులూ కలిసి నన్ను సృష్టించారు. ఒక రకంగా యంత్రాన్ని, మరొక రకంగా ప్రకృతిని. కాబట్టి నన్ను మోక్ష గానే అర్థం చేసుకోండి,” చిరునవ్వుతో బదులు ఇచ్చింది మోక్ష.

“శరత్ అన్నా! మీకూ ఇలాంటి అనుభవం ఒకటి గతంలో గ్రహాంతర వాసులతో కలిగిందని నాకు తెలుసు. మీ లోకంతో పాటు, మరో గ్రహవాసులనూ ఎలా రక్షించారో కూడా నాకు తెలుసు. కానీ దానిని మీరు ఎవరికీ చెప్పలేరు. రుజువు చేయలేరు,” అంది మోక్ష.

శరత్ ఆశ్చర్యపోతూ ఆమెను చూశాడు. తరవాత అన్నాడు, “నిజమే, ఇలాంటి నమ్మలేని అనుభవాలు నాకు ఉన్నాయి. కాబట్టే రక్ష చుట్టూ జరుగుతున్న విషయాలను కొంత వరకు నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ఇలాంటిది ఏదో ఉండవచ్చనే అనుమానంతోనే నేను రక్షతో ఇక్కడికి వచ్చాను. నిజానికి నాకు శ్రీశైలంలో ఏ కార్యక్రమమూ లేదు. నా ఊహ నిజమైంది.”

మోక్ష చిరునవ్వుతో మాట్లాడింది, “తెలుసు. అందుకే నేను మీకు కూడా కనిపిస్తున్నాను. రక్ష వెంట మీ లాంటి వాళ్లు ఉండడం అవసరం అనే భావనతోనే ఆ రోజు మీకు నిద్రలో కనిపించి, వెంట రమ్మని అడిగాను. అది అడిగింది రక్ష అనే మీరు అనుకున్నారు.”

“ఔను! సరే, మరి ఇప్పుడు రక్ష ఎటు వెళ్లింది? ఇక్కడి నుంచి ఆమె తీసుకుని వెళ్లింది ఏమిటి?”  “రక్ష వెళ్లింది ఈ లోకంలోనే ఉన్న మరో అదృశ్య లోకానికి.

“ఔను! సరే, మరి ఇప్పుడు రక్ష ఎటు వెళ్లింది? ఇక్కడి నుంచి ఆమె తీసుకుని వెళ్లింది ఏమిటి?”

“రక్ష వెళ్లింది ఈ లోకంలోనే ఉన్న మరో అదృశ్య లోకానికి. నీలి బిలం నిర్మాణ రహస్యం ఉన్న వివరాలను ఆమె తనతో తీసుకుని వెళ్లింది.”

“నీలి బిలమా? నల్ల బిలం అంటే నాకు తెలుసు, శ్వేత బిలం గురించి కూడా చదివాను. కానీ నీలి బిలం ఏమిటీ?” కుతూహలంగా అడిగాడు శరత్.

“నల్ల బిలం, అంటే బ్లాక్ హోల్లోకి ఏది ప్రవేశించినా అనంత వేగంతో ప్రయాణిస్తుంది. దానిని ఆధారం చేసుకుని అంతరిక్ష సొరంగాలు నిర్మించవచ్చు అనే సిద్ధాంతాలు కూడా మీ శాస్త్రవేత్తలు చేశారు, చేస్తున్నారు. మీ బాలివుడ్ సినీమాల్లోనైతే ఇలాంటి అంతరిక్ష సొరంగాలు సృష్టించుకుని, క్షణాల్లో అనంత దూరాలకు ప్రయాణాలు చేస్తున్నట్టు చూపిస్తున్నారు. పిల్లలూ, పెద్దలూ వాటిని చాలా ఇష్టపడి చూస్తున్నారు. అదంతా మీకు ఇప్పటి ఆధునిక కాల్పనిక ప్రపంచం. రక్ష వెళ్లింది నిజమైన నీలి బిలం. అది ప్రకృతి ఏర్పరచుకున్న తోవ. ఒక లోకంలోంచి మరో లోకంలోకి ప్రవేశించే మార్గం. కానీ అది మీకు ఇంకా అందని మార్గం.”

“అర్థమైంది. నిజమే కావచ్చు. నల్ల బిలాలు ఎక్కడో సుదూర అంతరిక్షంలోనే ఉంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ నేలకు దగ్గరలో కూడా అవి ఏర్పడవచ్చనే చర్చ ఒకటి శాస్త్రవేత్తలు చేశారు. రష్యాలో సైబీరియాలో ‘తుంగస్క’ సంఘటనకు కారణాలు వెదికే క్రమంలో ఈ చర్చ కూడా జరిగింది. అక్కడ నల్ల బిలం లాంటిది ఏదో ఏర్పడి ఉండవచ్చని కొందరు ఊహించారు. అలాగే అంతరిక్ష సొరంగాలు ఏర్పరుచుకోవడం గురించి కూడా సిద్ధాంతపరంగా సాధ్యం అవుతుంది. కానీ ఏ నిర్ధారణలు జరగలేదు. కొత్తగా ఇప్పుడు నీలి బిలం గురించి విన్నాను,” అన్నాడు శరత్.

“రక్ష తనకు సంబంధించిన అతి పెద్ద బాధ్యతను పూర్తిచేసుకుని వస్తోంది. ఇక మిగిలింది ఆమె తల్లిదండ్రులను రక్షించుకోవడం. వాళ్లను అపహరించుకుని పోయిన వాళ్లను తుదముట్టించడం. అప్పటి వరకూ మీరు ఆమెతోనే ఉండాలి,” చెప్పింది మోక్ష.

“నీకు కూడా తెలియదా?” సందేహంగా ప్రశ్నించాడు శరత్. “ఊహు, నాకు కూడా తెలియదు,” అని మోక్ష చెపుతుండగానే అక్కడ రక్ష ప్రత్యక్షమైంది. ఆమె ముఖం పున్నమి చందమామలా, ఎన్నడూ లేనంత ప్రశాంతంగా కనిపిస్తోంది.

“ఆ నీలి బిలం రహస్యం కోసమే వాళ్లు రక్ష తల్లిదండ్రులను అపహరించారు కదా?”

“ఔను. కానీ ఆ నీలి బిలం తెరిచే మార్గం రక్షకు కూడా తెలియదు. అంటే ఈ లోకం వాళ్లకు ఎవరికీ తెలియదు.”

“నీకు కూడా తెలియదా?” సందేహంగా ప్రశ్నించాడు శరత్.

“ఊహు, నాకు కూడా తెలియదు,” అని మోక్ష చెపుతుండగానే అక్కడ రక్ష ప్రత్యక్షమైంది.

ఆమె ముఖం పున్నమి చందమామలా, ఎన్నడూ లేనంత ప్రశాంతంగా కనిపిస్తోంది. ఆమె తన పనిని నిరాటంకంగా పూర్తి చేసుకుని వచ్చిందని ఆమెను చూస్తుంటేనే తెలిసిపోతోంది. “ఇక ఇక్కడి నుంచి బయలు దేరదాం,” అంది మోక్ష. వాళ్లు అక్కడి నుంచి కదిలారు.

గత చాప్టర్ల కోసం కింద క్లిక్ చేయండి

పద్దెనిమిదో అధ్యాయంపదిహేడో అధ్యాయం | పదహారో అధ్యాయం | పదిహేనో అధ్యాయం | పద్నాలుగో అధ్యాయం | పదమూడో అధ్యాయం | పన్నెండో అధ్యాయం | పదకొండో అధ్యాయం | పదో అధ్యాయం | తొమ్మిదో అధ్యాయం | ఎనిమిదో అధ్యాయం | ఏడో అధ్యాయం | ఆరో అధ్యాయం | ఐదో అధ్యాయం | నాలుగో అధ్యాయం  మూడో అధ్యాయం రెండో అధ్యాయం |  తొలి అధ్యాయం  | రచయిత పరిచయం

మీ స్పందనలు టైప్ చేయడానికి కింద LEAVE A REPLY అని ఇలా ఉంటుంది.
అక్కడ తెలుపవచ్చు. కృతజ్ఞతలు – ఎడిటర్

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article