నిన్నటి కథ
మోక్ష రక్ష వైపు తిరిగి తన చేతిలోని పెట్టెను చూపిస్తూ, “ఇదిగో అచ్చం అలాంటి రాతి పెట్టె ఇది. కానీ ఇందులో ఎవరికీ అర్థం కాని పిచ్చిగీతలూ, రాతలూ ఉన్నాయి. ఇది ఇక్కడే, నా దగ్గర ఉంటుంది. నువ్వు వెంటనే ఆ మార్గంలోకి ప్రవేశించు. నీ చేతిలో ఉన్న ఆ పెట్టెను ఆ లోకం వాళ్లకు అంద జేస్తే, నువ్వు ఇచ్చిన మాట పూర్తి చేసినట్టు అవుతుంది. మన తల్లిదండ్రుల ఆత్మలు సంతోషిస్తాయి. ఆ లోకం వాళ్లు మన తండ్రిని క్షమిస్తారు. ఇక బయలుదేరు. నువ్వు వచ్చే వరకూ నేనూ, శరత్ అన్నా ఇక్కడే నీకోసం ఎదురు చూస్తుంటాం,” అని చెప్పింది. ఆమె మాటలు పూర్తి అవుతుండగానే రక్ష ఆ నీలి బిలం వైపు అడుగువేసి దానిలోకి ప్రవేశించింది. ఆమె గాలిలో కరిగి అదృశ్యమైనట్టు శరత్ కు కనిపించింది. ఆ తర్వాత?
పద్దెనిమిదో అధ్యాయం
డా.వి.ఆర్.శర్మ
ఇంతకు ముందు తనకు పరిచయం అయిన వాళ్లందరూ అక్కడ తన కోసం ఎదురు చూస్తున్నారు. విద్యాలయ ఆశ్రమ ప్రాంగణంలోకి మళ్లీ అడుగుపెట్టింది రక్ష. అక్కడ గతంలో తనకు పరిచయం అయిన అరణ్య, అవని, ఆ గురువుగారు, ఆయనతో పాటు మరో ఇద్దరు గురువులు ఉన్నారు.
తనను చూడగానే ఆత్మీయంగా ప్రేమతో పలకరిస్తున్నట్టు దగ్గరికి వచ్చి కౌగలించుకుంది అరణ్య. అవని కూడా గట్టిగా పట్టుకుని, “అభినందనలు రక్షా!” అంది. వాళ్ల ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. “రక్షా! నువ్వు తెచ్చిన దానిని గురువుగారికి అప్పగించు,” అంది అరణ్య. కొద్ది దూరంలో బోధి వృక్షం కింద కూర్చుని ధ్యానం చేసుకుంటున్న గురువు గారి వైపు నడిచారు. వాళ్లు అక్కడికి చేరి నిశ్శబ్దంగా నిలబడ్డారు.
గురువు గారు నెమ్మదిగా కళ్లు తెరిచి మందహాసం చేస్తూ, ప్రేమపూరితమైన చూపులతో పలకరించాడు.
రక్ష తన చేతుల్లో ఉన్న ఆ పేటికను ఆయన ముందు ఉంచి రెండు చేతులు జోడించి నమస్కరించి, నిలుచుంది. ఆయన ఆ పేటికను తెరిచి చూశాడు. సంతృప్తి చెందినట్టుగా ఆయన పెదవుల మీద చిరునవ్వు పూసింది.
దానిని అలాగే తెరిచి అక్కడ నేల మీద ఉంచి తీక్షణంగా దాని వైపు చూశాడు. వెంటనే అది ఒక చిన్న జ్వాలగా వెలిగి ఆ పేటికతో సహా అదృశ్యమైంది. తరవాత ఆయన రక్షతో ఇలా అన్నాడు, “అమ్మాయి! నీ జీవితం ధన్యమైంది. నీ తండ్రి చేసిన తప్పును సరిదిద్దడంతో బాటు, రెండు లోకాల వినాశనం జరగకుండా నువ్వు కాపాడావు.” ఆయన మాట్లాడుతుంటే రక్ష చేతులు జోడించి వినయంగా నిలబడింది.
రక్ష మోకాళ్ల మీద కూర్చుని ముందుకు వంగి ఆయనకు నమస్కరించింది. ఆ తర్వాత మెల్లగా ఆ నీలి బిలం వైపు అడుగు వేసి దానిలోకి వంగి చూసింది. మరుక్షణం ఆ నీలి బిలం రక్షను తనలోకి తీసేసుకుంది.
“నువ్వు కూడా ఈ లోకంతో రక్త సంబంధం ఉన్న దానివే. మాకు మనుమరాలివే. ఈ లోకపు బిడ్డవే. కానీ నువ్వు ఇక్కడికి మళ్లీ రాకూడదు. రాలేవు కూడా. అయితే మీ లోకంలో నువ్వు చేయవలసిన మంచి పనులు చాలా ఉన్నాయి. కాబట్టి, వెళ్లి నీ లోకానికి మేలు చేస్తూ నీ జీవితాన్ని సఫలం చేసుకో. మీ లోకంలో ప్రకృతినీ, మానవత్వాన్నీ కాపాడడానికి నీకు సంక్రమించిన శక్తులను ఉపయోగించు. స్వార్థానికి నీ శక్తులను వాడుకోకు. ఇక బయలుదేరు. శుభమస్తు!” అంటూ ఆశీర్వదించాడు.
వెంటనే వాళ్ల ముందు నేల మీద చిన్న కాంతి చక్రంలా గిరగిరా తిరుగుతూ ప్రత్యక్షమైంది నీలి బిలం.
రక్ష మోకాళ్ల మీద కూర్చుని ముందుకు వంగి ఆయనకు నమస్కరించింది. రక్షకు వీడ్కోలు చెపుతున్నట్టు అరణ్య, అవని ఆత్మీయంగా పట్టుకుని, ప్రేమగా కౌగిలించుకున్నారు. ఆ స్వచ్ఛ, సుందరమైన ప్రాకృతిక లోకపు పరిసరాలను తన అణువణువునా నింపుకుంటూ చూసింది రక్ష. ఆ జ్ఞాపకాలను తన హృదయం నిండా నింపుకోవడానికి ప్రయత్నించింది.
మెల్లగా ఆ నీలి బిలం వైపు అడుగు వేసి దానిలోకి వంగి చూసింది. మరుక్షణం ఆ నీలి బిలం రక్షను తనలోకి తీసేసుకుంది.
గత చాప్టర్ల కోసం కింద క్లిక్ చేయండి
పదిహేడో అధ్యాయం | పదహారో అధ్యాయం | పదిహేనో అధ్యాయం | పద్నాలుగో అధ్యాయం | పదమూడో అధ్యాయం | పన్నెండో అధ్యాయం | పదకొండో అధ్యాయం | పదో అధ్యాయం | తొమ్మిదో అధ్యాయం | ఎనిమిదో అధ్యాయం | ఏడో అధ్యాయం | ఆరో అధ్యాయం | ఐదో అధ్యాయం | నాలుగో అధ్యాయం | మూడో అధ్యాయం | రెండో అధ్యాయం | తొలి అధ్యాయం | రచయిత పరిచయం
మీ స్పందనలు టైప్ చేయడానికి కింద LEAVE A REPLY అని ఇలా ఉంటుంది.
అక్కడ తెలుపవచ్చు. కృతజ్ఞతలు – ఎడిటర్