Editorial

Saturday, September 21, 2024
Serial‘రక్ష’ – 17th Chapter : ఇచ్చిన మాట తీర్చు

‘రక్ష’ – 17th Chapter : ఇచ్చిన మాట తీర్చు

నిన్నటి కథ

ఆ సొరంగంలో మసక వెలుతురు మాత్రమే ఉంది. దాదాపు పది అడుగుల ఎత్తు ఉంది ఆ సొరంగం. వాళ్లు తమ బ్యాగుల్లోంచి టార్చ్ లైట్లు తీసి వెలిగించారు. అలా మరికొంత దూరం వెళ్లిన తరవాత నేల మీద నీళ్లు తగిలాయ్. ముందుకు వెళుతున్న కొద్దీ ఆ నీటి ప్రవాహం పెరుగుతోంది. దాదాపు నడుము దాకా నీళ్లు వచ్చాయి. కొంత దూరం నడిచిన తరవాత మళ్లీ ఆ మార్గం రెండుగా చీలింది. “అటు వెళ్లాలి,” అంటూ రక్ష ఎడమ వైపు ఉన్న సొరంగ మార్గంలోకి నడిచింది. ఆ మార్గంలో దాదాపు వంద గజాలు నడిచిన తరవాత వాళ్లకు కనిపించిన దృశ్యాన్ని చూసి శరత్ ఒళ్లు అనుకోకుండానే జలదరించింది. ఆ తర్వాత?

పదిహేడో అధ్యాయం

డా.వి.ఆర్.శర్మ

అక్కడ పది అడుగుల దూరంలో నీటి ప్రవాహం ముగిసి, నేల కనిపిస్తోంది. దానికి మరో ముప్పై గజాల దూరంలో ఆ సొరంగం ముగిసినట్టుగా ఎదురుగా రాతి గోడ కనిపిస్తోంది. ఆ గోడ లోంచి బయటకు పొడుచుకొచ్చినట్టు వాడిగా ఉన్న అనేక శిలలు రకరకాల వికృత రూపాలలో ఉన్నాయి. వాటి నడుమ పెద్ద పెద్ద రంధ్రాలు చాలా ఉన్నాయి. వాటిలోంచి ఏదో తెల్లటి పొగలాంటిది సన్నగా బయటకు వస్తోంది.

అది చూసి కాదు శరత్ సందేహ పడింది. తమకూ, ఆ రాతి గోడకూ నడుమ ఉన్న నేల మీద అడ్డంగా మెలితిరిగి పడుకుని ఒక పెద్ద కొండ చిలువ ఉంది. అది దాదాపు ఇరవై అడుగుల పొడవు ఉంది. వీళ్లు నీటి లోంచి నేల మీద అడుగులు వేయగానే చురుగ్గా తల ఎత్తి వీళ్ల వైపు చూసింది.

“భయపడకు శరత్ అన్నా. అది మనను ఏమీ చేయదు. మనం చేస్తోంది ప్రకృతిని రక్షించే పని. ఆ విషయం అవి పసిగట్టగలవు. కాబట్టి ప్రకృతి ఒడిలో జీవిస్తున్న ఇలాంటి జంతువులు మనకు ఏ అపకారం చేయవు. పదండి వెళదాం,” అంటూ ఏమాత్రం సంకోచం లేకుండా ముందుకు కదిలింది రక్ష.

నిజానికి శరత్ భయపడలేదు, ఆశ్యర్యపోయాడు. అర్థం అయ్యింది అన్నట్టుగా తల ఊపుతూ అతను కూడా ఆమె వెంట నడిచాడు.

కాసేపటి తరవాత దేనినో పట్టుకుని ఆమె చేతిని బయటకు తీసింది. ఆమె చేతిలో ఒక చిన్న రాతి పెట్టె కనిపించింది. దానిని తన రెండు చేతులతో జాగ్రత్తగా పట్టుకుని తెరిచింది. లోపల పూర్వ కాలపు తాటాకుల గ్రంథం లాంటిది ఒకటి కనిపించింది.

వీళ్లు దగ్గరకు వచ్చే వరకూ ఆ కొండ చిలువ అలాగే చూస్తూ ఉంది. దగ్గరకు రాగానే చటుక్కున వెనుదిరిగి, చరచరా ఆ గోడవైపు పాకుతూ వెళ్లింది. తరవాత అలాగే నిలువునా పైకి లేచి ఆ గోడకి ఉన్న ఒక పెద్ద రంధ్రంలోకి దూరి వెళ్లింది. రక్ష ఆ చోటికి వెళ్లి, నేలకు దాదాపు ఐదడుగుల ఎత్తున్న ఒక రంధ్రంలోకి తన చేతిని పెట్టి దేని కోసమో వెతికింది. కాసేపటి తరవాత దేనినో పట్టుకుని ఆమె చేతిని బయటకు తీసింది. ఆమె చేతిలో ఒక చిన్న రాతి పెట్టె కనిపించింది. దానిని తన రెండు చేతులతో జాగ్రత్తగా పట్టుకుని తెరిచింది. లోపల పూర్వ కాలపు తాటాకుల గ్రంథం లాంటిది ఒకటి కనిపించింది. దానిని ముట్టుకోకుండా పెట్టెను వెంటనే మూసి భద్రంగా పట్టుకుంది. ఆమె ముఖం ఉజ్వలంగా వెలిగిపోతోంది.

శరత్ కు ఆమె చేతిలో ఉన్నది ఏమిటో అడగాలని, దానిని చూడాలని బలంగా అనిపించింది. కానీ, ‘ఈ ప్రయాణంలో తనను ఏ ప్రశ్నలు వేయవద్దని, కేవలం జరిగేది చూస్తూ ఉండమని, చెప్పాల్సిన విషయాలు తానే చెపుతానని,’ తాము బయలుదేరే ముందే రక్ష చెప్పింది. కాబట్టి శరత్ తన ఆసక్తిని బలవంతంగా తనలోనే అణుచుకున్నాడు.

శరత్ కు అప్పుడే మరో వింత కనిపించింది. రక్షలాగే ఉన్న మరో అమ్మాయి వాళ్ల ముందు ప్రత్యక్షమైంది. “అభినందనలు రక్షా! మొత్తానికి దీనిని సాధించావు. అదిగో, నీ కోసం నీ ముందు ఆ లోకం వాళ్లు తమ లోకపు ద్వారాన్ని తెరిచేశారు,” అంటూ ముందు వైపుకి చూపించింది. రక్షకు ఎదురుగా నేల మీద గుండ్రంగా గిరగిరా తిరుగుతున్న నీలి బిలం కనిపించింది. అటు వైపు చూసిన శరత్ కు అక్కడ ఏమీ కనిపించలేదు. అయోమయానికి గురయినట్టు చూస్తూ నిలుచున్నాడు. రక్ష లాగే ఉన్న ఆ అమ్మాయి ఎవరో, అక్కడికి ఎలా వచ్చిందో, ఆమె రక్షతో దేని గురించి మాట్లాడుతోందో అర్థం కాక, అలా చూస్తూ ఉండిపోయాడు.

అతని భావాలు చదివినట్టుగా చిరునవ్వు నవ్వింది మోక్ష. “శరత్ అన్నా! నా పేరు మోక్ష. మేం తోబుట్టువులం. ఇప్పటికి ఈ వివరాలు చాలు. నీకూ గతంలో ఇలాంటి అనుభవాలు ఉన్నాయి. కాబట్టి అర్థం చేసుకుంటావనే నమ్మకం నాకు ఉంది,” అంది.

రక్ష వైపు తిరిగి తన చేతిలోని పెట్టెను చూపిస్తూ, “ఇదిగో అచ్చం అలాంటి రాతి పెట్టె ఇది. కానీ ఇందులో ఎవరికీ అర్థం కాని పిచ్చిగీతలూ, రాతలూ ఉన్నాయి. ఇది ఇక్కడే, నా దగ్గర ఉంటుంది. నువ్వు వెంటనే ఆ మార్గంలోకి ప్రవేశించు.

రక్ష వైపు తిరిగి తన చేతిలోని పెట్టెను చూపిస్తూ, “ఇదిగో అచ్చం అలాంటి రాతి పెట్టె ఇది. కానీ ఇందులో ఎవరికీ అర్థం కాని పిచ్చిగీతలూ, రాతలూ ఉన్నాయి. ఇది ఇక్కడే, నా దగ్గర ఉంటుంది. నువ్వు వెంటనే ఆ మార్గంలోకి ప్రవేశించు. నీ చేతిలో ఉన్న ఆ పెట్టెను ఆ లోకం వాళ్లకు అంద జేస్తే, నువ్వు ఇచ్చిన మాట పూర్తి చేసినట్టు అవుతుంది. మన తల్లిదండ్రుల ఆత్మలు సంతోషిస్తాయి. ఆ లోకం వాళ్లు మన తండ్రిని క్షమిస్తారు. ఇక బయలుదేరు. నువ్వు వచ్చే వరకూ నేనూ, శరత్ అన్నా ఇక్కడే నీకోసం ఎదురు చూస్తుంటాం,” అని చెప్పింది.

ఆమె మాటలు పూర్తి అవుతుండగానే రక్ష ఆ నీలి బిలం వైపు అడుగువేసి దానిలోకి ప్రవేశించింది. ఆమె గాలిలో కరిగి అదృశ్యమైనట్టు శరత్ కు కనిపించింది.

గత చాప్టర్ల కోసం కింద క్లిక్ చేయండి

పదహారో అధ్యాయంపదిహేనో అధ్యాయం | పద్నాలుగో అధ్యాయం | పదమూడో అధ్యాయం | పన్నెండో అధ్యాయం | పదకొండో అధ్యాయం | పదో అధ్యాయం | తొమ్మిదో అధ్యాయం | ఎనిమిదో అధ్యాయం | ఏడో అధ్యాయం | ఆరో అధ్యాయం | ఐదో అధ్యాయం | నాలుగో అధ్యాయం  మూడో అధ్యాయం రెండో అధ్యాయం |  తొలి అధ్యాయం  | రచయిత పరిచయం

మీ స్పందనలు టైప్ చేయడానికి కింద LEAVE A REPLY అని ఇలా ఉంటుంది.
అక్కడ తెలుపవచ్చు. కృతజ్ఞతలు – ఎడిటర్

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article