నిన్నటి కథ
ఈ నల్లమలను రక్షించడానికి ‘సేవ్ నల్లమల’ అంటూ కొంత కాలం సోషల్ మీడియా క్యాంపేన్ కూడా జరిగినట్టుంది…” అలా శరత్ నల్లమలకు సంబంధించిన అనేక విషయాలు వాళ్లకు చెపుతూనే ఉన్నాడు. వాళ్లు శ్రీశైలం డ్యాం దగ్గరికి చేరుకున్నారు. అక్కడి నుంచి మాణిక్యానికి ఫోన్ చేసింది నందన.
‘తాను దేవాలయం దగ్గరే ఉన్నానని. పని ఉండడం వల్ల అక్కడికి వచ్చానని, వాళ్లను కూడా అటే వచ్చేయమని, దర్శనం చేసుకుని ఇంటికి వెళదామని,’ చెప్పాడు మాణిక్యం. హరిత రిసార్ట్ దగ్గర శరత్ దిగిపోయాడు. దిగుతూ, ఆంటీ “ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. నేను వీలయితే రేపు కలుస్తాను. బై, రక్షా!” అని చెప్పాడు. ఆ తర్వాత?
పదిహేనో అధ్యాయం
డా.వి.ఆర్.శర్మ
“శరతన్నా! అర్జంట్గా మా ఇంటికి రాగలరా. ఈ రోజు మీకున్న కార్యక్రమాన్ని దయచేసి వాయిదా వేసుకొగలరా? ప్లీజ్ మీ సహాయం కావాలి?” పొద్దున ఆరు గంటలకే శరత్ కు ఫోన్ చేసింది రక్ష.
“తప్పకుండా వస్తాను. ఇంత పొద్దున్నే ఇలా ఫోన్ చేశావంటే ఏదో సీరియస్ ప్రాబ్లమే అయ్యుంటుంది. కంగారు పడకు, వెంటనే బయలుదేరుతున్నాను,” అటు నుంచి చెప్పాడు శరత్.
ఫోన్ పెట్టిన తరవాత హడావుడిగా తన క్యారీబ్యాగ్ సర్దుకుంటూ, రాత్రి జరిగిన దానిని మరోసారి గుర్తు చేసుకుంది రక్ష.
రాత్రి మూడు గంటల వేళ తనకు మెలకువ వచ్చింది. తన మంచం పక్కన ఎవరో ఇద్దరు నల్లని దుస్తుల్లో, మంకీ క్యాప్లు వేసుకుని నిలబడి ఉన్నారు. తనను తట్టి లేపినట్టు అనిపించింది. తను కళ్లు తెరవగానే వాళ్లలో ఒకడు చేతిలో పెద్ద కత్తి పట్టుకుని తన వైపు వంగి అరవొద్దని హెచ్చరించాడు.
రాత్రి మూడు గంటల వేళ తనకు మెలకువ వచ్చింది. తన మంచం పక్కన ఎవరో ఇద్దరు నల్లని దుస్తుల్లో, మంకీ క్యాప్లు వేసుకుని నిలబడి ఉన్నారు. తనను తట్టి లేపినట్టు అనిపించింది. తను కళ్లు తెరవగానే వాళ్లలో ఒకడు చేతిలో పెద్ద కత్తి పట్టుకుని తన వైపు వంగి అరవొద్దని హెచ్చరించాడు. తను అలా చూస్తూ లేచి కూర్చుంది. అప్పుడు వాళ్లలో రెండవ వ్యక్తి హిందీలో, “మీ అమ్మా, నాన్నల్ని మేం కిడ్నాప్ చేశాం. నీకు ఒక వస్తువుకు సంబంధించిన రహస్యం తెలుసు. దానిని తెచ్చి మాకు ఇచ్చి మీ అమ్మా, నాన్నల్ని విడిపించుకో. రేపటిలోగా నువ్వు ఆ వస్తువును మాకు తెచ్చి ఇవ్వకపోతే నీ తల్లిదండ్రులను చంపేస్తాం. రేపు రాత్రికి ఫోన్ చేసి నువ్వు ఎక్కడికి రావాలో చెపుతాం. మేమే నిన్ను కలుసుకుంటాం. ఈ విషయం పోలీసులకు చెప్పిన మరుక్షణం నీ తల్లిదండ్రులు చస్తారు. జాగ్రత్త! నిన్ను ప్రతిక్షణం మేం గమనిస్తున్నాం. నీకు ఉంది ఒక్క రోజు సమయమే,” అని చెప్పాడు.
అదృశ్యమైనట్టుగా వాళ్లు మరుక్షణమే వెళ్లిపోయారు. వాళ్లు వెళ్లగానే చూస్తే, అమ్మా, నాన్నలు వాళ్ల గదిలో లేరు. దూరంగా ఏదో వాహనం వెళ్లిపోయిన చప్పుడు వినిపించింది. ఇంటి బయట చీకటిగా ఉంది. వీధి లైట్లు వెలగడం లేదు. కరంట్ ఉన్నా ఆ వీధిలో లైట్లు ఎందుకు వెలగడం లేదో?! బహుశా వాళ్లే ఏదో చేసి ఉంటారు.
ఏం చేయాలో తోచలేదు. తన లాకెట్ను తాకి చూసింది. వెంటనే ఎదురుగా మోక్ష ప్రత్యక్షమైంది. “కంగారు పడకు రక్షా! ఇలా జరుగుతుందని నాకు తెలుసు. ఇదొక మంచి అవకాశంగానే భావించు.
ఏం చేయాలో తోచలేదు. తన లాకెట్ను తాకి చూసింది. వెంటనే ఎదురుగా మోక్ష ప్రత్యక్షమైంది. “కంగారు పడకు రక్షా! ఇలా జరుగుతుందని నాకు తెలుసు. ఇదొక మంచి అవకాశంగానే భావించు. నాన్న దాచిన ఆ రహస్యాన్ని వెతికే కార్యక్రమాన్ని ఇక మనం వెంటనే ప్రారంభిస్తున్నాం. అలాగే మన అమ్మా, నాన్నల్ని చంపేసిన ఆ దుర్మార్గులను పై లోకానికి పంపించడం మనం చేయవలసిన రెండవ పని. వాళ్లంతట వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఇక వాళ్లు ఎక్కడికీ తప్పించుకుని పోలేరు.”
మోక్ష మాటలతో రక్షకు కొండంత ధైర్యం వచ్చింది. తాను ఆ పనిని సాధించడానికి సమయం ఆసన్నమైందని అర్థంచేసుకుంది. “సరే ఇప్పుడు నేనేం చేయాలి?” మోక్షను ప్రశ్నించింది.
“శరత్ను వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు. ఇలాంటి అనుభవాలు అతనికి కూడా ఉన్నాయి. అతనికి కేవలం ఇక్కడ జరిగిన విషయాలు మాత్రం చెప్పి, ఏ ప్రశ్నలు వేయకుండా నువ్వు చేసే పనిలో సహకరించమని అడుగు. ఒప్పుకుంటాడు. అతడు వచ్చిన తరవాత ఇలా చేయండి…” అంటూ తరవాత ఏం చేయాలో వివరంగా చెప్పి వెళ్లిపోయింది మోక్ష.
రక్ష ఫోన్ చేసిన అరగంటలో అక్కడికి చేరుకున్నాడు శరత్.
గత చాప్టర్ల కోసం కింద క్లిక్ చేయండి
పద్నాలుగో అధ్యాయం | పదమూడో అధ్యాయం | పన్నెండో అధ్యాయం | పదకొండో అధ్యాయం | పదో అధ్యాయం | తొమ్మిదో అధ్యాయం | ఎనిమిదో అధ్యాయం | ఏడో అధ్యాయం | ఆరో అధ్యాయం | ఐదో అధ్యాయం | నాలుగో అధ్యాయం | మూడో అధ్యాయం | రెండో అధ్యాయం | తొలి అధ్యాయం | రచయిత పరిచయం
మీ స్పందనలు టైప్ చేయడానికి కింద LEAVE A REPLY అని ఇలా ఉంటుంది.
అక్కడ తెలుపవచ్చు. కృతజ్ఞతలు – ఎడిటర్