వరంగల్లులో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన రైతు సంఘర్షణ సభ రాహుల్ గాంధీ సమక్షంలో రైతులను ఆకర్షించే ‘డిక్లరేషన్’ ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం ఏర్పాటైతే కౌలు రైతులకు కూడా రైతు బంధు అమలు చేస్తామని, ఆ మొత్తాన్ని ఏటా పదిహేను వేలు ఇస్తామని ప్రకటించింది. అలాగే అనేక సమస్యలకు కారణమైన ‘ధరణి పోర్టల్’ ను రద్దు చేయడమే గాక నూతన రెవెన్యూ చట్టం తెస్తామని ప్రకటించింది. తెలంగాణ భూములకు అనుగుణమైన వ్యవసాయ విధానాన్ని అమలు చేయడమే కాక వివిధ పంటలకు ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర స్థానంలో పెంచిన మొత్తాన్ని తాము ఎలా ఇస్తామో కూడా ప్రకటించడం విశేషం. అంతేగాక ఉపాధీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని ప్రకటించింది.
రాహుల్ గాంధీ చేసిన వరంగల్ డిక్లరేషన్ ప్రధాన హామీలు ఇవే…
రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి అమలు చేస్తాం.
‘ఇందిరమ్మ రైతు భరోసా’ పథకం కింద భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి పదిహేను వేల రూపాయల సాయం చేస్తాం. ప్రస్తుతం రైతు బంధు కింద పదివేలు ఇస్తున్న విషయం తెలిసిందే.
ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమిలేని రైతు కూలీలకు పన్నెండు వేల సాయం.
రైతులు పండించిన అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు రేటు ఇస్తాం.
తెలంగాణలో మూత పడిన చెరుకు కర్మాగారాలను తెరిపిస్తూనే పసుపు బోర్డు కూడా ఏర్పాటు చేయడం.
మెరుగైన పంటల భీమ పథకం తెస్తాం.
భూమి లేని రైతులకు రైతు భీమా కల్పిస్తాం.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం.
పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీలకు యాజమాన్య హక్కులు.
అసైన్డ్ భూములపై దళిత గిరిజన ఆదివాసీలకు హక్కు.
రైతు పాలిత శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు.
అన్ని వర్గాల ప్రజల భూములకు రక్షణకు సరికొత్త రెవెన్యూ వ్యవస్థ.
WARNGAL DECLRATION :వరంగల్ డిక్లరేషన్ పూర్తి వివరాలకు ఈ పిడిఎఫ్ ఫైల్ ఒపెన్ చేసి చదవచ్చు
నకిలీ విత్తనాలు, పురుగు మందులు అమ్మేవారిని అరికడుతూ, నూతన చట్టం, పిడి యాక్ట్ అమలు చేస్తాం.
పెండింగ్ ప్రాజెక్టుల సత్వరమే పూర్తి.
రైతుల సమస్యల శాశ్వత పరిరక్షణ కోసం చట్ట పరిధిలో వారి హక్కుల అమలు కోసం నూతన రైతు కమిషన్
తెలంగాణ భూమలకు అనుగుణంగా నూతన వ్యవసాయ విధానం అమలు చేస్తాం. వ్యవసాయాన్ని లాభసాటిగా ఒక పండుగగా మలుస్తాం.
ఏ పంటను ఏ ధరలకు కొనుగోలు చేస్తామో ప్రకటన. వరి ధాన్యం కనీస మద్దతు ప్రస్తుత ధర 1960 ఉంది, దాన్ని 2500 రెండువేలకు పెంచుతాం. మొక్కజొన్న కనీస మద్దతు ధర 1870 ఉండగా దాన్ని 2200లు చేస్తాం. కందులు 6300 నుంచి 6800 లకు, పత్తి 6025 నుంచి 6500లకు కొనుగోలు చేస్తాం.