దళిత బంధు కార్యాచరణలో తారకం కుమారులు రాహుల్ బొజ్జకు అదనపు బాధ్యత. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా నియామకం.
2001 ఐఏఎస్ కేడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారి రాహూల్ బొజ్జను రేపటి నుంచే తన కార్యాలయ కార్యదర్శిగా నియమిస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ హుజురాబాద్ లో ఏర్పాటు చేసిన దళిత బంధు సభలో కొద్ది సేపటి క్రితం ప్రకటించారు.
దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్టు, హుజురాబాద్ లో ఉన్న ఇరవై ఒక్క వేల దళితులకే కాదు, ఈ మధ్య పెరిగిన కుటుంబాలతో సహా అందరికీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటిస్తూ ఉద్యోగులకు కూడా వర్తిస్తామని, వారికి చివరి విడుత అందిస్తామని చెప్పారు. చెబుతూ కార్యదర్శి నియామకం తాలూకు ఈ కీలక నిర్యయాన్ని ప్రకటించారు.
దేశంలోనే ఈ పథకం ఆదర్శనీయమని, రాష్ట్రంలో బ్రహ్మాండంగా దీన్ని అమలు చేయాలనీ, ఆ దిశలో మానవ హక్కుల నేత, న్యాయవాది శ్రీ బొజ్జ తారకం కుమారులు, ఏస్సీ వెల్ఫేర్ సెక్రెటరీగా ఉన్న రాహుల్ బోజ్జను తన కార్యాలయం కార్యదర్శిగా రేపటి నుంచి పని చేస్తారని ముఖ్యమంత్రి ప్రకటించారు.
దళితుడైన రాహుల్ బొజ్జా నుంచే దళిత బంధు పథకం ఆదేశాలన్నీ అమలవుతాయని ముఖ్యమంత్రి అన్నారు.
ఈ పథకం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ది ఒక్కటే కాదు, సమర్థవంతంగా అమలు చేసే ఆలోచనలో ఉన్నట్టు అందుకోసమే ఈ నిర్ణయం తెసుకున్నట్టు వారు చెప్పారు. దళితుడైన రాహుల్ బొజ్జ నుంచే దళిత బంధు పథకం ఆదేశాలన్నీ అమలవుతాయని ముఖ్యమంత్రి అన్నారు.
ఉదయం హుజురాబాద్ వెళుతూ ఉండగా రాష్ట ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ తో పాటు ఎం ఎల్ సి, ప్రముఖ కవి గాయకులూ గోరటి వెంకన్నతో చర్చిస్తూ ఈ విషయం మాట్లాడుకున్నామని, రేపే రాహుల్ బొజ్జ ఈ కీలక బాధ్యత చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ ప్రకటన ఒక్కటే కాదు, ముఖ్యమంత్రి ప్రసంగంలో ఈ పథకం మొత్తం రాష్ట్రంలో అమలవుతుందని, అందుకు ప్రభుత్వానికి పూర్తి సంసిద్దత ఉందన్న సంకేతాలు ఇవ్వడం మరో విశేషం. వారు ప్రసంగం ప్రారంభిస్తూ “జై బీం” అనడం కూడా ఒక ప్రత్యేకథ. ఇంకో విశేషం. దళిత బంధు పథకం కారణంగా తన కార్యాలయంలో మొదటి దళిత అధికారిగా రాహుల్ బొజ్జ అడుగు పెట్టినట్లు అయింది.