Editorial

Thursday, November 21, 2024
ARTSTeen aur aadha - కెమెరా వంటి గోడలు సాక్షిగా.. : రఘు మాందాటి చిత్ర...

Teen aur aadha – కెమెరా వంటి గోడలు సాక్షిగా.. : రఘు మాందాటి చిత్ర సమీక్ష

బుర్రలోని కుదురులేని పరి పరి ఆలోచనల గల మనసు ఎంత కుదురుగా ఉండగలదో పరీక్షించుకోడానికి కూడా  చిత్రం ఒక రుజువు. ఓపికతో చూసే వారికి ఇదొక మంచి అనుభూతి అనే చెప్పగలను.

రఘు మాందాటి

Randhu Mandhatiమనం అంతగా పట్టించుకోమెమో గాని కెమెరాలాంటి మన ఇంటి గోడలు, మన జీవితమనే నాటకానికి ప్రత్యక్ష సాక్షులు.

మూడు కథలు. అన్ని కూడా మానవతా సంబంధాల నాటకీయతను నిశ్శబ్దంగా ధ్వనింప చేస్తుంది.

జీవితాన్ని పరిపాలించే వైవిధ్యమైన భావోద్వేగాలన్నీ
అంటే బాల్యం, యువ్వనం మరియు వృద్ధాప్యం ఈ మూడు దశలని ఓ మూడు కథలుగా మలిచి వివిధ దశలుగా ఒక ఇంటి గోడల్ని సాక్షులుగా చూపిస్తూ కథనం సాగుతుంది.

యమరాజ్

బోర్ కొట్టించే పాఠశాల నుండి
తప్పించుకోవలనుకునే పిల్లాడు.
నిస్తేజంగా పనికిరాని దేహం ఇక్కట్లని తప్పించుకోవాలనుకునే వృద్ధుడు.
ఈ రెండు పాత్రలతో మొదటి కథ ‘యమరాజ్’ సాగుతుంది.

నటరాజ్

రెండవ కథ “నటరాజ్” జోయా హుస్సేన్ అందంగా పోషించిన వేశ్యను సందర్శించే యువకుడి నుండి తప్పించుకున్న తన నెరవేర్పు.

నిజానికి స్త్రీకి నటన ఒక సామాజిక అవసరం అనే తీరును ఎంతో హృద్యంగా అందంగా మరింత బావుకథగా మలిచిన తీరు బావుంటుంది.

కమరాజ్

మూడవది, “కమరాజ్”.
శారీరక అవసరాలను మించిపోయిన, ఒకరినొకరు ప్రేమించుకోకుండా పోయిన -వృద్ధ దంపతుల జ్ఞాపకాలు.

మన గది గోడలకు ఉన్నంత సహనం ఓర్పు ఈ మూడు కథలను చూడడానికి కావాలి.

ఒక విధంగా ఈ మూడు కథలు ఒక పాఠశాల నుండి వేశ్యాగృహం వరకు ఒక సుందరమైన ఇంటికి, పరివర్తనకు గురయ్యే భవనం దాని సరిహద్దుల్లో ఆడే జీవితం వంటివి కలిసి మెలిసి నడుస్తాయి.

కెమెరా వంటి గోడలు జీవిత నాటకానికి సాక్షి అనే సూత్రంతోనే ఈ చిత్రం మూడు లాంగ్ టేక్స్‌లో మాత్రమే చిత్రీకరించబడింది. కానీ అంత కలిపి ఉంటుంది.

మన గది గోడలకు ఉన్నంత సహనం ఓర్పు ఈ మూడు కథలను చూడడానికి కావాలి. చెప్పాలంటే మన బుర్రలోని కుదురులేని పరి పరి ఆలోచనల గల మనసు ఎంత కుదురుగా ఉండగలదో పరీక్షించుకోడానికి కూడా ఈ చిత్రం ఒక రుజువు.

ఈ చిత్రాన్ని Netflix లో చూడొచ్చు.

ఎందుకు అంటున్నానంటే మన మానవ సంబంధాలన్ని నాటకీయతతో కూడుకుంటాయన్న వాస్తవాన్ని మనం ఎన్నటికీ అంగీకరించలేము. అవన్నీ ఎప్పటికప్పుడు క్రమబద్దికరించుకోవలనే ధోరణి మనల్ని వివశుల్ని చేస్తాయి.

ఓపికతో చూసే వాళ్ళకి ఇదొక మంచి అనుభూతి అని మాత్రం చెప్పగలను.

Three and a half (Teen aur aadha).  ఈ చిత్రాన్ని Netflix లో చూడొచ్చు.

కథకుడు రఘు మాందాటి ఫోటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్. ట్రావెలర్ కూడా. తెలుపు ప్రచురించిన అతడి రచనల్లో సినిమా సమీక్షలు రెండు. ఒకటి, ‘ఆనందం అంటే Lunana’, రెండు, అద్భుతం అను Mucize. అలాగే తాను రాసిన  కథ ‘నడకలు’.  రఘు మొబైల్ 9966225666

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article