రూప చిత్రాల రారాజు అంబాజీ. ‘పీవీ మన ఠీవి’ అన్న మాటను వారు రూపంలోకి తెచ్చి ఆ మననీయులను గొప్పగా స్మరణలోకి తెచ్చారు. పివి హుందాగా నిలబడి ఉండగా వారి వెనుకాల తన లైబ్రరీలోని ప్రతి పుస్తకం ఏమిటో తెలుసుకొని తీసుకొని చదవొచ్చు అనిపించేలా ఎంతో నిశితంగా చిత్రీకరించారు.
కందుకూరి రమేష్ బాబు
పీవీ తెలుగు గుండెల్లో సదా చిరస్మరణీయులు. ఇటీవల వారి శత జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఐతే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ అసెంబ్లీలో వారి నిలువెత్తు రూప చిత్రాన్ని మొన్ననే ఆవిష్కరించడం విశేషం. ఈ చిత్రం, రూప చిత్రాల రారాజు శ్రీ అంబాజీ చిత్రించడం మరో విశేషం. ఆ చిత్రాన్ని కేసీఆర్ గారు ఆవిష్కరించి చిత్రకారుడిని కూడా సముచితంగా సత్కరించడం మరో విశేషం.
గీసే ప్రతిచిత్రంలోనూ ప్రధాన వస్తువుతో పాటు పరిసరాలను విశేషంగా రూపకల్పన చేస్తారు. చిత్రానికే జీవం పోస్తారు.
ఇప్పటికే అంబాజీ చిత్రించిన దాశరథి, కాళోజీల రూప చిత్రాలు తెలంగాణ సాంస్కృతిక శాఖా సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ కార్యాలయంలో ఎందరో చూసే ఉంటారు. అందులో దాశరథి గారు గోలకొండ పత్రికను చదువుతూ ఉంటే ఆ పత్రికలో వార్తలను మనం కూడా ఇటు నిలబడి చదవొచ్చు. అంత డీటైల్ గా అంబాజీ గారు చిత్రించారు. అదే వారి ప్రత్యేకత. గీసే ప్రతిచిత్రంలోనూ ప్రధాన వస్తువుతో పాటు పరిసరాలను విశేషంగా రూపకల్పన చేస్తారు. చిత్రానికే జీవం పోస్తారు.
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆవిష్కరించబడిన పీవీ చిత్రంలో కూడా అదే సరళి. ‘పీవీ మన ఠీవి’ అన్న మాటను వారు రూపంలోకి తెచ్చి గొప్పగా నివాళి అర్పించేలా చేశారు.
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆవిష్కరించబడిన పీవీ చిత్రంలో కూడా అదే సరళి. ‘పీవీ మన ఠీవి’ అన్న మాటను వారు రూపంలోకి తెచ్చి ఆ మననీయులను గొప్పగా స్మరణలోకి తెచ్చారు. పివి హుందాగా నిలబడి ఉండగా వారి వెనుకాల తన లైబ్రరీలోని ప్రతి పుస్తకం ఏమిటో తెలుసుకొని తీసుకొని చదవొచ్చు అనిపించేలా ఆ పుస్తక ప్రియుడిని, బహుభాషా కోవిదుడిని, రచయితను ఎంతో నిశితంగా చిత్రీకరించారు. వారి కళా వైశిష్ట్యంపై త్వరలో తెలుపు మంచి కథనం అందిస్తుంది. అన్నట్టు ఈ ఆయిల్ పెయింటింగ్ సైజు 9×6.