“కొన్ని విషయాలు ఎవరు చెబితే మైండ్ ఓపెన్ అవుతుందో వాడే పూరి జగన్నాథ్. వేరే వాళ్ళను సరే, మిమల్ని మీరు ప్రేమించుకోవడం గురించి చెప్పే అతడి మ్యూజింగ్స్ విన్నారా?
కందుకూరి రమేష్ బాబు
Puri Musings పేరుతో పూరీ జగన్నాథ్ పంచుకుంటున్న అనుభవాలు, అభిప్రాయాలు, ఆలోచనలు నిజంగానే విలువైనవి. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన ఈ దర్శకుడిలో అలవోకగా తాత్వికత పలుకుతుంది. అది తనదైన శైలిలో వ్యక్తం అవుతుంది. చెప్పే ప్రతి విషయంలో సంక్షిప్తత మాత్రమే కాదు, అది సూటిగా మీకు తగిలేలా చూసుకుంటారు. ఇక్కడ తాను చెప్పేది ప్రేమ గురించి. అది అవతలివారిపై కాదు, మీపై.
ఒక అడ సింహం ఒక మగ సింహం సైలెంట్ గా మాట్లాడకుండా కూచో గలుగుతాయి. మరి మనం? అలా ఏమీ ఆశించకుండా కూచోగాలమా ప్రేమగా… అని అడుగుతున్నారు
స్వయంగా ప్రేమికుడైన పూరీ తననే కాదు, ఇతరులనూ ప్రేమించే ఒక పిచ్చి మనిషి. భిన్నమైన ఆలోచనా సరళి గల వ్యక్తి, అతడి మ్యూజింగ్స్ ఇంటరెస్టింగ్. లవ్ అనే స్టేటాఫ్ మైండ్ గురించి, అదెంత అవసరమో, ఎలా సాధన చేయాలో సరళంగా తెలుపుతారు తాను. వినండి. “ప్రేమించడం మీ క్యారెక్టర్ కావాలి. లవ్ అనేది మీ వైఫై కావాలి” అంటున్నారు.
అంతేకాదు, “మొక్కను ప్రేమిస్తే నీళ్ళు పోయాలి. కుక్కను ప్రేమిస్తే తిండి పెట్టాలి. లవ్ ఈజ్ రెస్పాన్సిబిలిటి. నాట్ ఎ బర్డెన్” అని తమాషాగానే అయినా ప్రేమ తాలూకు గంభీర బాధ్యతను నొక్కి చెబుతున్నారు. మరి వినండి. నాలుగు నిమిషాల పదహారు సెకండ్లు.