చీమలు పాకితే రాళ్లరుగుతాయా!
అల్పులకు సహాయం చేసినందువల్ల సంపన్నులకు ఎలాంటి నష్టమూ ఉండబోదని…
“సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు” అంటారు. ఇప్పుడు నిజంగానే మన ఇల్లూ వాకిలే కాదు, సమస్త జీవన రంగాలు, పరిసరాలూ సహజత్వానికి, నిజ జీవితానికి దూరమయ్యాయి. నేటి తరానికి సామెతలు, పొడుపు కథలు, పద్యాలు, పాటలు మొత్తంగా మన జానపద జీవితాన్ని, సాహిత్య వారసత్వాన్ని పిల్లలకు కనీసం పరిచయం చెయడం, మన కర్తవ్యం. మంచి సంప్రదాయం. తెలుపు ఆ దిశలో చేసే చిరు ప్రయత్నంలో ఇలాంటి శీర్షికలు ఎంతో కీలకం అని భావిస్తోంది. మీ సలహా సూచనలు కూడా కోరుతూ నేటి సామెత చదవమని కోరుతున్నది. షేర్ చేసుకుని ప్రాచుర్యం కలిగించమని అభ్యర్తిస్తున్నది.