“పైసలుతో రాజకీయాలు ఎట్లైనా నడపవచ్చు అన్న వైఖరికి హుజురాబాద్ ప్రజానీకం గొప్పగా సమాధానం చెప్పారు. ఇది కేసిఆర్ కి చెంపపెట్టు. తెలంగాణారాజకీయాల్లో ఈ ఫలితం పెను మార్పుకు సంకేతం అవుతుంది ” అని అభిప్రాయ పడ్డారు.
ప్రొ కొదండరాం
పదిహేడవ రౌండ్ తర్వాత ఈటెలకు ఆధిక్యత స్పష్టమైన తర్వాత ప్రొ.కొదండరాం మాట్లాడుతూ “ఈ ఫలితాలు కేసేఆర్ నిరంకుశత్వానికి చెంప పెట్టు” అని అభిప్రాయ పడ్డారు.
“ఫక్తు రాజకీయ పార్టీగా నడుపుతున్న కేసేఆర్ రాజకీయాలకు, అయన తలబిరుసు తనానికి ఇది గొప్ప సమాధానం” అంటూ “పైసలుతో రాజకీయాలు ఎట్లైనా నడపవచ్చు అన్న వైఖరికి ఇది మంచి సమాధానం” అని అభిప్రాయ పడ్డారు.
ప్రజలు ప్రశ్నించే శక్తులవైపు నిలబడటం ఎంతో సంతోషదాయకం. ఇక నుంచి ప్రజలు తమ అభిప్రాయాన్ని ధైర్యంగా చేబుతారాన్ననమ్మకం కలుగుతోంది”
“ఇది మంచి పరిణామం. దాదాపు అన్ని రౌండ్లలో కూడా ప్రజలు ఈటెలకు ఆధిక్యత ఇచ్చారు. ప్రజలు ప్రశ్నించే శక్తులవైపు నిలబడటం ఎంతో సంతోషదాయకం. ఇక నుంచి ప్రజలు తమ అభిప్రాయాన్ని ధైర్యంగా చేబుతారాని, తెలంగాణా రాజకీయాల్లో ఇది పెను మార్పుకు చక్కటి సంకేతం అవుతుందన్న నమ్మకం కలుగుతోంది” అని వారు అన్నారు.
ఇష్టానుసారంగా దౌర్జన్యంగా నడిపే రాజకీయాలకు హుజురాబాద్ ప్రజలు గొప్పగా సమాధానం చెప్పారు. ఎన్నో ఒత్తిళ్ళు ఎదుర్కొన్న అక్కడి ప్రజలకు అభినందనలు” అన్నారు.
“కేసేఆర్ ఇదివరకు చెప్పే మాటలు ప్రజలు నమ్మేవారు. నేడు కేసేఆర్ మాటకు విలువ ఇవ్వడం లేదని తేలిపోయింది. అయన ప్రతిష్ట మసక బారింది. ఫక్తు రాజకీయ పార్టీగా అయన నడిపే రాజకీయాలు తమ పట్ల ప్రేమతో కాదని, తన ఆదిపత్యాన్ని స్థిరపరుచుకునేందుకే అని ప్రజలు గ్రహించారు. అందుకే ఇష్టానుసారంగా దౌర్జన్యంగా నడిపే రాజకీయాలకు హుజురాబాద్ ప్రజలు గొప్పగా సమాధానం చెప్పారు. ఈ నిర్ణయం సాహసోపేతమైనది. ఎన్నో ఒత్తిళ్ళు ఎదుర్కొన్న అక్కడి ప్రజలకు అభినందనలు” అన్నారు.