Editorial

Monday, December 23, 2024
ప్రేమ‌'వెండి తెర వెన్నెల' సాయి పల్లవి : బర్త్ డే విషెస్ తో 'విరాటపర్వం' BGM

‘వెండి తెర వెన్నెల’ సాయి పల్లవి : బర్త్ డే విషెస్ తో ‘విరాటపర్వం’ BGM

నేడు మన తరం సహజ నటి సాయి పల్లవి పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ‘విరాటపర్వం’ టీం చక్కటి బిజిఎంను విడుదల చేసింది. ‘వెన్నెల’గా నటిస్తున్న తమ కథా నాయకిని ‘వెండితెర వెన్నెల’గా అభివర్ణిస్తూ రెండోసారి జన్మించిందంటూ సినీ ప్రచారాన్నిఉధృతం చేసింది.

కందుకూరి రమేష్ బాబు 

జూలై 1 న విడుదల కానున్న విరాట పర్వం టీం తమ ప్రచారాన్ని ఉధృతం చేసింది. నేడు తమ కథ నాయకి సాయి పల్లవి పుట్టినరోజును పురస్కరించుకొని ఆ సహజ నటిక శుభాకాంక్షలు తెలుపుతూ అందమైన పోస్టర్ తో పాటు Soul of Vennela పేరుతో చక్కటి బిజిఎంను విడుదల చేసింది.

“రేపు మనం ఉన్న లేకపోయినా చరిత్ర ఉంటుంది. మన ప్రేమ కథను వినిపిస్తుంది”

ఈ చిత్రంలో సాయి పల్లవి పాత్ర పేరు ‘వెన్నెల’ కావడం కారణంగా ‘వెన్నెల రెండు సార్లు జన్మించింది” అంటూ చిత్ర యూనిట్ సాయి పల్లవికి జన్మదిన శుభాకాంక్షలను తెలుపుతూ విభిన్నంగా తమ సినిమా ప్రచారాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళింది. “ఆశయాన్ని ఆయుధం చేసినట్టు అతడి ప్రేమలో మరోసారి” అంటూ చిత్ర యూనిట్ సాయి పల్లవిని ‘వెండితెర వెన్నెల’గా అభివర్ణించడం మరో విశేషం.

ప్రేమ కూడా మానవ స్వేచ్ఛలో భాగమే అని నమ్మిన పాత్రలో సాయి పల్లవి నటిస్తున్న ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. “నిర్భందాలను కౌగలించుకుని వసంతకాలం ఉంది. రేపు మనం ఉన్న లేకపోయినా చరిత్ర ఉంటుంది. మన ప్రేమ కథను వినిపిస్తుంది” అని సాయి పల్లవి చెప్పే మాటలు ఈ ప్రచార చిత్రంలో కీలకం.

సురేష్ ప్రొడక్షన్ లో ఈ సినిమా నిర్మాణమై అతి త్వరలో మన ముందుకు రానున్నది. సంగీతం సురేష్ బొబ్బిలి. ఈ చిత్రం గురించి, దర్శకుల గురించి మరిన్ని వివరాలు తెలుపు కథనం చదవండి 

విరాటపర్వం : ‘యుద్దమే కథగా ప్రేమనే విప్లవం’గా వేణు ఊడుగుల చిత్రం – జూలై 1 విడుదల

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article