ప్రముఖ ఛాయా చిత్రకారులు శ్రీ క్యాతం సంతోష్ కుమార్ నిజామాబాద్ లో తీసిన చిందు భాగవతుల రూప చిత్రాలివి.
పల్లె ప్రజలకు అందుబాటులో ఉంటూ రమణీయ కళారూపాన్ని అనుసరించి నృత్య కేళిక చేయువారే చిందు వారు.
వీరు రామాయణ, భారత, భాగవత కథల్ని నృత్య నాటకాలుగా ఆడుతారు. ఈ సరస్వతీ పుత్రులు పండితుల్నీ, పామరుల్నీ తమ కళా నైపుణ్యంతొ రంజింప చేస్తారు.
ఈ కళాకారులు, ప్రదర్శించే నాటకాలలో ముఖ్యమైనవి, మోహినీ రుక్మాంగద, సారంగధర, చెంచు లక్ష్మి, వీరాభిమన్య, సుందర కాండ, సతీ సావిత్రి, మైరావణ మొదలైన నాటకాలు. వీటిని ప్రదర్శిస్తూ మధ్య మధ్య ప్రజల సమస్యలను సందర్బోచితంగా చొప్పిస్తూ వీరు ఆకట్టుకుంటారు.
దృఢంగా స్థిరంగా తమవైన రూపం సారం బలిమిగా అంతరించి పోనీ దేశీయ జీవనానికి ప్రతీకగా మట్టి నుంచి మొలిచిన పసుపు కొమ్ముల్లా వీరి రూప చిత్రాలు మన కళ్ళకు దీవెన. ప్రదర్శనకు ముందు తీసిన చిత్రాలివి.
ఎవరి పాటలు, పద్యాలు వారు పాడాతారు, తాళాలు వాయించడానికి మాత్రం స్త్రీలు వుంటారు.
నృత్యంలో, ఆడవారికీ, మాగవారికీ పెద్ద తేడా కనిపించదు. తమ ప్రదర్శన వల్ల కరువు కాటకాలు దరిచేరవన్న విశ్వాసం జనంలో ఇప్పటికీ ఉండటం మరో విశేషం.
చిందు నృత్యాన్ని ప్రదర్శించే సుమారు ఏభై బృందాలు నిజామాబాదు జిల్లాలో ఉన్నాయి. వంశ పారంపర్యంగా తమ పెద్దల వద్ద విద్య నభ్యసించి, ప్రజలకు వినోదాన్ని కూర్చే ఆచారాన్ని వీరు ఇప్పటికీ పాటిస్తున్నారు.
వీరు సారంగధర నృత్య నాటకాన్ని రసవత్తరంగా ప్రదర్శిస్తారు. అద్దాల బిళ్ళలు, బంగారు రంగు ముచ్చి రేకులు అంటించిన కిరీటాలు, అతి ప్రాచీనమైన, వివిధ రకాలైన ఆభరణాలు, ధరించే దుస్తులు కళ్ళు మిరుమిట్లు గొల్పుతాయి.
బృందంలో వున్న ప్రతి ఒక్కరూ కేవాం చిందు నృత్యం తొక్కడమే కాక, అందుకు తగిన అభినయాన్ని హావ భావ యుక్తంగా ప్రదర్శిస్తారు.
Nice pictures
Informative writeup
చాలా రమణీయమైన చిత్రాలు.. సంతోష్ గారికి 🙏🏽