Editorial

Sunday, November 24, 2024
వార్త‌లునేటి PASSWORD : ఈటెల

నేటి PASSWORD : ఈటెల

password

ఈటెల రాజెందర్

వ్యాఖ్య : గతంలో మంత్రి పదవి నాకు భిక్ష కాదని, తామే గులాబీ జెండాకు ఒనర్లమని మాట్లాడిన ఈటెల పదును మెల్లగా తగ్గిపోతున్నదా అన్న సందేహం వ్యక్తమవుతున్నది. గులాబీ నుంచి అయన కాషాయానికి దగ్గరవుతారా లేదా అన్న విషయం పక్కన పెడితే అయన గులాబీ జెండా ఒనర్ షిప్ విషయంలో యుద్ధం చేసే అంశం ప్రశ్నార్థకంలో పడినట్లే ఉంది. నిన్న బెజేపీ జాతీయ నేత ఒకరు, కొందరు రాష్ట నేతలతో ఈటెల సమావేశమైన నేపథ్యంలో, అయన బాహాటంగానే తాను బెజేపీతో చర్చల్లో ఉన్నట్టు వివరాలు బయటకు పోక్కేలా చేశారు. దీంతో తను లేవనెత్తిన ఆత్మ గౌరవం విషయం పక్కకు పోయినట్లే అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దీంతో ఒక రకంగా ఈటెలను కార్నర్ చేయడంలో కేసీఆర్ విజయం సాధించినట్లే కనిపిస్తోందని టీఆర్ ఎస్ శ్రేణులు సంబరపడుతున్నాయి.

కాగా, బెజెపిలో చేరడమా లేదా అన్నదానికన్నా మిన్న, టీఆర్ ఎస్ ఎమ్మెల్యేగా తనకు కొనసాగే ఉద్దేశ్యం లేదని మాత్రం అయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొత్త పార్టీ పెట్టె యోచన ఒక వైపు, ముఖ్య పదవిని ఇవ్వ జూపితే కాంగ్రెస్, బిజేపీ తన పార్టీలలో ఎదో ఒక పార్టీలో చేరే విషయం అయన ముందున్న అంశాలు. కాకపోతే కాకపోతే ఇంట గెలిచి రచ్చ గెలావాలన్న ధోరణిలో ఉన్న అయన తక్షణం తన శాసన సభ్యత్వానికి రాజీనామా హుజరాబాద్ ఎన్న్నికల్లో పోటీ చేసి గెలవడమే లక్ష్యంగా పని చేస్తారా లేక గులాబీ జెండా ఒనర్లం తామే అన్న ఆయుధాన్ని చేబూని ఇప్పటి నుంచే కేసీఆర్ ని ముప్పు తిప్పలు పెడుతారా అన్నది అన్నది తాజా సందిగ్ధం.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article