Editorial

Monday, December 23, 2024
అభిప్రాయాలుబీజేపీలో చేరడం ద్వారా ఈటెల ఏం సందేశం ఇస్తున్నారు ? BS TALKS

బీజేపీలో చేరడం ద్వారా ఈటెల ఏం సందేశం ఇస్తున్నారు ? BS TALKS

 

బీజేపీ లో చేరడం ద్వారా ఈటెల ఏం సందేశం ఇస్తున్నారు ?

BS

BS TALKS: సీనియర్ పాత్రికేయులు బుర్రా శ్రీనివాస్ TOP TELUGU TV ఛానెల్ చీఫ్ ఎడిటర్. BS TALK SHOW ద్వారా తాను తెలుగు ప్రజలకు, సోషల్ మీడియా వీక్షకులకు సుపరిచితులు. తెలుపు TV కోసం బి.ఎస్  తనదైన శైలిలో రాజకీయాలపై వ్యాఖ్యానం చేస్తారు.

ఈటెల రాజేందర్….నిన్న మొన్నటిదాకా తెలంగాణ ఉద్యమ రథ సారథి కేసీఆర్ కు కుడిభుజం.. కేసీఆర్ ఉద్యమంలో రుద్ర తాండవం చేస్తుంటే అదే పార్టీలో ఉంటూ శాంత గంభీరంగా ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి  … అట్లాంటి శివకేశవులు..ఇవాళ హటాత్తుగా బద్ధశత్రువులుగా మారిన వైనం..

ఆత్మగౌరవం అంటాడు ఈటెల.. నమ్మకద్రోహం అంటాడు కేసీఆర్…పార్టీని చీల్చే ప్రయత్నం చేశాడు అంటాయి టీఆర్ఎస్ పార్టీ వర్గాలు.. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు కేసీఆర్ అంటున్నారు ఈటెల అభిమానులు..

ఎప్పటిలాగే కేసీఆర్ మార్క్ పాలిటిక్స్…ఎవరికీ ఒక్క ముక్క అర్థం కావడం లేదు.. ఈటెల కూడా నిన్నమొన్నటిదాకా ఆ తానులో ముక్కే కాబట్టి ఆయన వ్యూహాలూ ఎవరికీ అర్థం కావడం లేదు..

సరే 2021 మే 31న ఈటెల వెళ్లి ఢిల్లీలోని బీజేపీ అధ్యక్షుడు నడ్డాను కలవడంతో దాదాపుగా ఈటెల బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయం అయింది. తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం జూన్ 2న పార్టీలో చేరే ముహూర్తమూ ఖరారయింది.

అందరూ ఊహించిందే చేశాడు ఈటెల…సరే ఈ పరిణామాల్ని జనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు..ఈటెల నిర్ణయం సరైనదేనా..? కేసీఆర్ ను ఢీకొనాల్సిందీ అంటే జాతీయ పార్టీలో చేరాల్సిందేనా? నిన్న మొన్నటిదాకా బీజేపీ పార్టీ కనుమరుగైపోయినట్లే అని ఈసడించుకున్న ఈటెల ఇప్పుడు ఆ పార్టీకి పునర్జీవం పోస్తారా?? హుజురాబాద్ ప్రజలు ఈ పరిణామాల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు. ఆయన శ్రేణులు ఎలా స్పందిస్తారు.. టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది. అసలు ఈటెల ఎపిసోడ్ ఎటు నుంచి ఎటు మలుపు తిరిగింది. ఒక్కసారి పరిణామ క్రమాన్ని చూద్దాం.

ఈటెల కూడా కేటీఆర్ ను ప్రతీ ప్రసంగంలో మెచ్చుకున్న తీరు చూశాం. పార్టీలోంచి గెంటేసిన తర్వాత కూడా. .ఇంత హటాత్తుగా ఈటెలను రాత్రికి రాత్రి ఎందుకు పక్కనబెట్టారు. అంటే దానికో స్టోరీ చెబుతున్నారు..

etela kcr

ఈటెల బీజేపీలో చేరడం కరెక్టేనా? కొందరంటారు…కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే బీజేపీలో చేరడమే కరెక్ట్ అని.. బీజేపీలో చేరడం అంటే ఈటెల తన ఆత్మాభిమానాన్ని చంపుకోవడమే అంటున్నారు కొందరు. ఢిల్లీలో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులంటున్నాయి. ఆస్తులను కాపాడుకోవడానికే ఈ చేరిక అంటున్నాయి.

ఈటెల రాజేందర్ కేసీఆర్ కు ఉద్యమంలో ఎంతగా తోడున్నాడో చెప్పడం చర్వణ చర్వితమే.. తన ఆస్తులమ్మి…తాకట్టు పెట్టి ఉద్యమ ప్రస్థానంలో ఎన్నోసార్లు ఇంధనంగా మారిన చరిత్ర నేను కూడా చూశాను. ప్రళయ కాళ రుద్రుడిలాంటి కేసీఆర్ ధాటికి తట్టుకుంటూ 20 ఏళ్లు ఆయనతో ఈటెల ఉన్నాడంటేనే అద్భుతం…ఆశ్చర్యం…ఎందుకంటే కేసీఆర్ తో అత్యంత సన్నిహితంగా ఉన్ననేతలెవరూ ఆ తర్వాత పార్టీలోనూ, ఆయన టీములోనూ ఎక్కువ మాట్లాడితే రాజకీయాల్లోనే కనుమరుగయిపోయారు..పోతారు…ఆయన పక్కన ఉన్నప్పుడు హీరోల్లా కనిపించినవాళ్లంతా ఆ తర్వాత జీరోల్లా మారిపోవడం కష్టంగా అనిపించినా వాస్తవం.

సరే… అంతగా కలిసి ఉన్న ఈ ఇద్దరికి ఎక్కడ బెడిసి కొట్టింది..? ఎవరో ఈటెల గురించి లేనిపోనివి కేసీఆర్ కు నూరిపోశారని ఒక టాక్. అసలు మొన్నటి ఎన్నికల్లో ఈటెల ను ఓడించడానికే ప్రయత్నాలు జరిగాయని ఆయన ఆరోపణ. అసలు ఈటెలను టీఆర్ఎస్ టిక్కెట్ వస్తుందా రాదా అనే సంశయం కూడా కొంత కాలం సాగింది..చిట్టచివరి క్షణంలో ఈటెలకు టిక్కెట్ ఇచ్చారు. ఇదో పెద్ద షాక్.. ఆ తర్వాత ఆయన్ని ఓడించడానికి ప్రయత్నాలు. రెండో ప్రభుత్వంలో ఆయనకు మంత్రి పదవి వస్తుందా రాదా అనే సంశయం. అతి కష్టం మీద పదవి. ఇప్పుడు ఆరోపణల మీద ఉద్వాసన.

టీఆర్ఎస్ ఏం ఆరోపిస్తోంది..ఆయన పార్టీని చీల్చే ప్రయత్నం చేశారు అని? నిజమా…టీఆర్ఎస్ లో ఈటెలకు ఒక వర్గం ఉందా..? బొడిగె శోభ…రసమయి బాలకిషన్…పుట్టామధు…లాంటి నేతలతో మరో 30 మంది ఎమ్మెల్యేలతో ఆయన ఒక వర్గాన్ని మెయింటెన్ చేస్తున్నారా? ఈటెల రాజేందర్ అంత పని చేశారా? కేసీఆర్ సంగతి తెలిసీ ఆయన ఇలాంటి పాలిటిక్స్ చేస్తారా??

అందునా హరీష్ రావు..ఈటెల కూడా అత్యంత సన్నిహితులు. కేటీఆర్ కూడా ఈటెలను ఎంతగానో గౌరవిస్తారు.అంతెందుకు 14 సార్లు స్వయంగా కేటీఆర్ ఈటెలను బుజ్జగించే ప్రయత్నం చేశారట.రెండు సార్లు కేసీఆర్ తో ముఖాముఖి చర్చలకు కూర్చోబెట్టారట. అయినా ఎందుకో కేటీఆర్ రాయబారం ఫలించలేదు.. ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు.

ఈటెల కూడా కేటీఆర్ ను ప్రతీ ప్రసంగంలో మెచ్చుకున్న తీరు చూశాం. పార్టీలోంచి గెంటేసిన తర్వాత కూడా. .ఇంత హటాత్తుగా ఈటెలను రాత్రికి రాత్రి ఎందుకు పక్కనబెట్టారు. అంటే దానికో స్టోరీ చెబుతున్నారు..

మూడు నెలల క్రితం ఈటెల బెంగుళూరులోని గోల్ఫ్ కోర్సు రోడ్డులో 32 మంది ఎమ్మెల్యేలతో ముఖ్య నేతలతో రహస్య సమావేశం నిర్వహించారట. ఈ విషయం తెలిసి కేసీఆర్ ఆగ్గిమీద గుగ్గిలం అయ్యారట. కానీ ఎన్నికల వేళ ఈటెల ను ముట్టుకుంటే బీసీ వర్గాల నుంచి వచ్చే వ్యతిరేకతను తట్టుకోవడం కష్టం అని భావించి సైలెంట్ గా ఉన్నారట…ఎన్నికలు అయిన మరుక్షణం వేటు వేశారట… ఇదీ కొన్ని వర్గాల ఉవాచ…

కేసీఆర్ ఎంతో మందిని అవలీలగా పార్టీలోంచి విసిరిపారేశాడు. కానీ ఈటెల విషయంలో మాత్రం కొంత టెన్షన్ పడ్డాడు. పాత సాన్నిహిత్యమో లేక బీసీల నిరసనకు భయపడో కానీ కేసీఆర్ మనస్తత్వం కాదిది. ఈటెలను పంపించడానికి చేరిన ప్రయత్నాలు కూడా అంత వ్యూహాత్మకంగా లేకపోవడం ఆయన మీద చేసిన ఆరోపణలు పెద్దగా నిలబడేవి కాకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. అసంతృప్తి ఉన్నా కేసీఆర్ ఈటెల మీద వేటు వేయడానికి రెండుమూడేళ్లు వేచి చూశాడు. ఇష్టం లేకుండా ఆయన్ని కనీసం కలవను కూడా కలవకుండా బలవంతగానైనా పదవులు ఇస్తూ వచ్చాడు.

అది ఈటెల బలమో… కేసీఆర్ బలహీనతో కానీ… మొత్తానికి అంతగా ప్రిపరేషన్ లేకుండానే ఉద్వాసన జరిగిపోయింది…సరే…ఈటెల ఏం చేస్తారు? ఈ గొడవ ఎందుకు జరిగింది అంటే ఈటెల దగ్గర కూడా సరైన బలమైన కారణం ఏదీ చెప్పడం లేదు. ఇది ఆత్మ గౌరవ పోరాటం అనే మాటే అంటున్నారు. అటు టీఆర్ఎస్ కూడా సరైన ప్రిపరేషన్ లేకుండా, సరైన కారణం లేకుండానే ఈటెలను సాగనంపింది.

ఇలాంటి సమయంలో ఈటెల బీజేపీలో చేరడం కరెక్టేనా? కొందరంటారు…కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే బీజేపీలో చేరడమే కరెక్ట్ అని.. బీజేపీలో చేరడం అంటే ఈటెల తన ఆత్మాభిమానాన్ని చంపుకోవడమే అంటున్నారు కొందరు. ఢిల్లీలో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులంటున్నాయి. ఆస్తులను కాపాడుకోవడానికే ఈ చేరిక అంటున్నాయి.

EETELA

బీజేపీలో ఉంటూ ఆత్మగౌరవ పోరాటం చేస్తారా ఈటెల? కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఎంత స్ట్రగుల్ అవుతున్నారో…రేపు ఈటెల బీజేపీలో అంతే స్ట్రగుల్ అవుతారా? సహజంగా ఈటెలలో కమ్యూనిస్టు భావాలుంటాయి. మరి కమ్యునల్ భావాలుంటే బీజేపీలో ఇముడుతారా…

గత కొంత కాలంగా బీసీ ఉద్యమం మీద చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. బీసీ ముఖ్యమంత్రిని చూడాలనే ఆశతో చాలా మంది ఉన్నారు. కానీ బీసీల్లోని అనైక్యత కారణంగా ఈ వర్గాలు ముందుకు దూసుకెళ్లే పరిస్థితి కనబడటం లేదు. కనుచూపు మేరలో కూడా లేదు..కారణం. వారికో నాయకత్వమే లేకపోవడం ఈటెల ను ఆ కోణంలో చాలా మంది చూశారు. ఇతను బీసీల ఆత్మగౌరవ పతాకగా మారుతాడు అనే ఆశ కొందరిలో కనబడింది.

ఈటెల కొత్త పార్టీ పెట్టాలని చాలా మంది కోరుకున్నారు. కాంగ్రెస్ జవసత్వాలు ఉడిగిపోయిన నిస్తేజంగా ఉంది. బీజేపీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది.  అసలు ఆ పార్టీ టీఆర్ఎస్ కు శత్రువా కాదా అన్నది జనమే తెల్చుకోలేకపోతున్నారు. అంతెందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికీ టీఆర్ఎస్ కు బీ టీమ్ గానే ఉందా అనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో ఏ పార్టీ కూడా టీఆర్ఎస్ వ్యతిరేకంగా గొంతు విప్పే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో కేసీఆర్ ను ఎదిరించాలి అంటే ఇంకో కొత్త పార్టీతో ఈటెల రావాలని చాలామంది కోరుకున్నారు.. అయితే ఒక బీసీ పార్టీ పెడితే అది బతకడం కష్టం…బతకనివ్వరు అంటూ పెదవి విరిచారు చాలా మంది.

ఏడేళ్ల పాలన తర్వాత కేసీఆర్ ఇప్పుడు కొంత ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. సరే పాలకవర్గానికి ఇది కామనే. కానీ ఈటెల ఆ సాహసం చేయలేదు. కనీసం ఎమ్మెల్యే పదవికైనా తక్షణం రాజీనామా చేయలేదు. కరోనా టైమ్ లో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే అన్నాడు. కనీసం పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయలేదు..ఇప్పటికీ… వాళ్లే తీసేయాలనేది ఈటెల ప్లాన్…

టీఆర్ఎస్ కూడా ఈటెల విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటానికి ఒక్క మంత్రి గంగుల కమలాకర్ కు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. మిగతా పార్టీ శ్రేణులెవ్వరూ నోరు మెదపడం లేదు.

ఇలాంటి సమయంలో ఈటెల బీజేపీలో చేరడం కరెక్టేనా? కొందరంటారు…కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే బీజేపీలో చేరడమే కరెక్ట్ అని.. బీజేపీలో చేరడం అంటే ఈటెల తన ఆత్మాభిమానాన్ని చంపుకోవడమే అంటున్నారు కొందరు. ఢిల్లీలో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులంటున్నాయి. ఆస్తులను కాపాడుకోవడానికే ఈ చేరిక అంటున్నాయి.

బీజేపీలో ఉంటూ ఆత్మగౌరవ పోరాటం చేస్తారా ఈటెల? కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఎంత స్ట్రగుల్ అవుతున్నారో…రేపు ఈటెల బీజేపీలో అంతే స్ట్రగుల్ అవుతారా? సహజంగా ఈటెలలో కమ్యూనిస్టు భావాలుంటాయి. మరి కమ్యునల్ భావాలుంటే బీజేపీలో ఇముడుతారా…

ఇప్పటికే ఈటెల చేరికను బీజేపీలోని చాలా వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆయన్ని పార్టీలో పని చేయనిస్తారా?? కేంద్రంలోని బీజేపీకి వచ్చే ఎన్నికలకు కేసీఆర్ చాలా అవసరం…అలాంటి స్థితిలో బీజేపీలో ఉంటూ ఈటెల కేసీఆర్ మీద ఆరోపణలు చేయగలరా?

ఏంటో… ఏం అర్థం కావడం లేదు అనిపిస్తోంది కదా..నా పరిస్థితి ఇంకా దారుణం..లేదు భయ్యా..ఇది కూడా కేసీఆర్ గేమే.. ఆయనే ఈటెల ను బయటకు పంపించి తన శత్రువుగా కూడా తన మనిషినే పెట్టుకుంటున్నాడు… హీరో తానే..విలన్ కూడా తన అనుచరుడే ఉండేలా చూసుకుంటున్నాడు అంటోది మరో వర్గం…పార్టీలోని అసంతృప్తులెవరో పసిగట్టడానికి కేసీఆర్ విసిరిన పాచిక ఈటెల అంటున్నారు ఇంకొందరు..మీరు చూస్తూ ఉండండి..కొన్నాళ్లకు మిషన్ కంప్లీట్ చేసుకుని ఈటెల మళ్లీ పార్టీలో చేరతాడు అని మరికొందరు…

ఇంతకీ ఏంటి ఆ మిషన్… అదే పార్టీలోని విలన్లను ఏరిపారేయడం… శత్రువుగా నిలబడే చాన్స్ ఇంకొకరికి ఇవ్వకుండా చేయడం…

ఇంకా అర్థం కావడం లేదా…. ఉండు భయ్యా…కాసేపట్లో ఈటెల ప్రెస్ మీట్ పెడతాడు… ఆ తర్వాత చాలా క్లారిటీ వస్తుంది…

అప్పటిదాకా సశేషం..
ఈటెల ప్రెస్ మీట్ తర్వాత మళ్లీ కలుద్దాం..
ఈటెల సతీమణి జమున గారు పెట్టిన ప్రెస్ మీట్ ఒకలా ఉంది… జరుగుతున్న పరిణామాలు ఒకలా ఉన్నాయి…ఏంటో..అంతా గజిబిజిగా ఉంది..
సరే మరికాసేపట్లో మళ్లీ కలుద్దాం…

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article