Editorial

Thursday, November 21, 2024
OpinionWomen's day : పురుషస్వామ్యం ఒక కాడి లాంటిది - జయప్రభ తెలుపు

Women’s day : పురుషస్వామ్యం ఒక కాడి లాంటిది – జయప్రభ తెలుపు

భారత దేశంలోని పురుషుడు ఇప్పటికీ అతిగా వెనకబడి ఉన్నాడని, చదువు అతగాడికి ఏమీ సామాజికంగానూ సాంస్కృతికంగానూ నేర్పింది అంటూ పెద్దగా ఏమీ లేదనీ … ఆలోచన చేయగల ఒక పరిణితీ, మారగల ఒక ధైర్యం ఈ దేశపు మగవాడిలో ఎక్కువ శాతం మందిలో ఇప్పటికీ లేవు! పాతకాలపు అధికార స్వభావం ఎక్కువమంది మగవాళ్ళల్లో ఇంకా అలాగే మిగిలి ఉంది

నిజానికి ఇదంతా పురుష స్వామ్యం. ఆడదాని మెడ మీది దింపుకుందికి వీలు లేని ఒక కాడి లాంటిదది! అమలులో ఉంది ఇప్పటికీ అంతటా!

జయప్రభ

వాళ్ళు సమాజపు ఉత్పత్తిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇంటా బయటా శ్రమలో ముఖ్య భాగం ఔతున్నారు. వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ రంగానికి చెందిన శ్రమలో స్త్రీలదే ఇప్పటికీ ముఖ్య పాత్ర ! టీచర్లుగా వారు అన్ని విద్యాసంస్థల్లోనూ గణనీయంగా ఉన్నారు . లాయర్లు గా … డాక్టర్లు గా తాము బతికే సమాజానికి ముఖ్యమైన సేవల్ని అందించడంలో స్త్రీలు ప్రపంచ వ్యాప్తంగా ముందున్నారు. వారి సేవల్ని ఈ సమాజమూ – కుటుంబమూ అనునిత్యం పొందుతూ తాను వృద్ధి పొందుతూ ఉన్నది. వైద్య రంగాన నర్సులు వాళ్ళే ఎక్కువ. వీధులు ఊడ్చే వాళ్ళల్లోనూ స్త్రీలే ఎక్కువ. కూరగాయల మార్కెట్ కి వెళ్లి చూడండి – అలాగే ఏ ఆధునికమైన వ్యాపార సముదాయాలకు వెళ్లి గమనించండి అన్ని చోట్లా మీరు వయసులో ఉన్న ఆడవాళ్లనే ఎక్కువగా చూస్తారు. అలాగే ప్రపంచ ఐటీ రంగంలోనూ యువతుల పాత్ర గణనీయమైనది.

ఇంతగా ఈ లోకాన అతి ముఖ్య పాత్ర ని పోషిస్తున్న స్త్రీలకి మాత్రం సమాన హక్కులు అమలులో ఉన్నాయా ? లేవు అన్నది ఇవాళ్టికీ అందరికీ తెలిసిన సత్యం. ఉత్పత్తి అలాగే పునరుత్పత్తీ ఈ రెండు రంగాలలోనూ స్త్రీలు ఈ లోకానికి ప్రాణాధారమైన ముఖ్య స్థానంలో ఉండగా ఎందుకని వారి స్థానాలనీ , వారికే చెంది తీరవలసిన ఎన్నో హక్కుల్నీ ఇవాళ్టికీ నిర్లజ్జగా మగవాళ్ళు ఆక్రమించి శాసనాధికారాల్నీ చట్టాల్నీ చేసేస్తూ వస్తున్నారూ? స్త్రీలని ఇప్పటికీ రాజకీయంగా ఎదగడానికి వీలే లేకుండా అన్ని చోట్లా అలా నిరంతరంగా అడ్డుకుంటూనే ఉన్నారూ? దీనినే మనం పురుష స్వామ్యం అని అంటాం ! ఇది ఆడదాని మెడ మీది దింపుకుందికి వీలు లేని ఒక కాడి లాంటిది ! అమలులో ఉంది ఇప్పటికీ అంతటా !

ఆలోచన చేయగల ఒక పరిణితీ, మారగల ఒక ధైర్యం ఈ దేశపు మగవాడిలో ఎక్కువ శాతం మందిలో ఇప్పటికీ లేవు! పాతకాలపు అధికార స్వభావం ఎక్కువమంది మగవాళ్ళల్లో ఇంకా అలాగే మిగిలి ఉంది అనే దీనికి అర్ధం ! ఇదీ విషాదం అంటే !

స్త్రీలని ఇవాళ్టికీ ఒక వ్యాపార సరుకుగా మార్చి లాభాలు పొందుతున్న సంస్కృతి మొత్తంగా ప్రపంచమంతటా ఉంది. ఇప్పటికీ స్త్రీని ఒక భోగ వస్తువుగా పరిగణించి ప్రవర్తించగల ఒకానొక అపసవ్య నాగరికతకు ఎక్కువశాతం ప్రపంచం అలవాటు పడి ఉంది. ఇందులో మన భారత దేశం ముఖ్యమైన దేశం గా ఉండటమే అత్యంత విషాదం! దీనికి అర్ధం ఏమిటీ అంటే – భారత దేశంలోని పురుషుడు ఇప్పటికీ అతిగా వెనకబడి ఉన్నాడని, చదువు అతగాడికి ఏమీ సామాజికంగానూ సాంస్కృతికంగానూ నేర్పింది అంటూ పెద్దగా ఏమీ లేదనీ … ఆలోచన చేయగల ఒక పరిణితీ, మారగల ఒక ధైర్యం ఈ దేశపు మగవాడిలో ఎక్కువ శాతం మందిలో ఇప్పటికీ లేవు! పాతకాలపు అధికార స్వభావం ఎక్కువమంది మగవాళ్ళల్లో ఇంకా అలాగే మిగిలి ఉంది అనే దీనికి అర్ధం ! ఇదీ విషాదం అంటే !

స్త్రీల మీద జరిగే లైంగిక దాడి ఈ అపసవ్య నాగరికతలో ఒక ముఖ్యమైన భాగం! స్త్రీలపై అణచి వేతలో ఈ రకమైన మానసిక స్థితి ముందుంది. ఇలాంటి నాగరికతలో భాగమై పురుషుల్లో …. అన్ని వయసుల వాళ్ళూ ఉన్నారు.

స్త్రీల మీద జరిగే లైంగిక దాడి ఈ అపసవ్య నాగరికతలో ఒక ముఖ్యమైన భాగం! స్త్రీలపై అణచి వేతలో ఈ రకమైన మానసిక స్థితి ముందుంది. ఇలాంటి నాగరికతలో భాగమై పురుషుల్లో …. అన్ని వయసుల వాళ్ళూ ఉన్నారు. అన్ని ప్రాంతాల వాళ్ళూ ఉన్నారు అని మనకి గణాంకాలు తెలియజేస్తున్నవి. ఉత్తర భారత దేశం ఈ విషయంలో మరింత మూర్ఖంగా … మరింత వెనకబాటుదనంతో మిగిలి కన్పిస్తుంది. ఈ వైఖరికీ, ఆయా రాష్ట్రాల వెనకబాటుదనానికీ మధ్య ఉన్న లింకుని గురించి పెద్దగా ఎవరూ చర్చలు చేయడం లేదు. ఈ చర్చలు ముఖ్యమైనవి. వీటిని ఎక్కువమంది చేయాలి. ఎక్కువ సార్లు చేయాలి!

ఆ ప్రాంతాల పురుషులు అక్కడి స్త్రీల అభ్యుదయానికి ఏ రకంగానూ ముందుకు వచ్చి చేయూతనివ్వడం లేదనీ అర్ధం! దీనివల్లనే ఆ ప్రాంతాలు ఎక్కువ జనాభానీ ఎక్కువ పేదరికాన్నీ ఇప్పటికీ కలిగి ఉండటం!

స్త్రీల విషయంలో పురుషులు చేసే ఆలోచనలకీ, వాళ్ళ ప్రవర్తనకి వారు స్త్రీల విషయంలో చూపించే ఒక ఉత్తమ నాగరికతకీ ఆయా ప్రాంతాల అభివృద్ధికీ మధ్యన ఉన్న సంబంధం ఎంతో బలమైనది. వెనకబడిన ప్రాంతాలు ఆర్ధికంగా సామాజికంగా సాంస్కృతికంగా అంటే అర్ధం ఏమిటీ అంటే -ఆ ప్రాంతాలలో ఉన్న స్త్రీలు ఇంకా చదువు లేకుండా … ఆర్జనకి దూరంగా ఇంటిలోనే అలా మగ్గిపోతూ వెనకబడి ఉన్నారనీ! ఆ ప్రాంతాల పురుషులు అక్కడి స్త్రీల అభ్యుదయానికి ఏ రకంగానూ ముందుకు వచ్చి చేయూతనివ్వడం లేదనీ అర్ధం! దీనివల్లనే ఆ ప్రాంతాలు ఎక్కువ జనాభానీ ఎక్కువ పేదరికాన్నీ ఇప్పటికీ కలిగి ఉండటం! ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు వీటికి మనదేశాన ముఖ్యమైన ఉదాహరణలు! దక్షిణాదిన పరిస్థితి వీటికన్నా మెరుగు అని చెప్పడానికి గల కారణం ఇక్కడి ఆడపిల్లలికి విద్య, ఆ తరవాత ఉద్యోగం అన్నవాటికి అక్కడి రాష్ట్రాలకన్నా ఇక్కడ హెచ్చు అవకాశాలు ఉండటం!

కళ్యాణలక్ష్మి ; షాదీ ముబారక్ వంటి పథకాల లక్ష్యం ఇప్పటికీ అమ్మాయిలని పెళ్లి చేసుకుని పొమ్మని ప్రోత్సహించటమే గాని, విద్య నీ ఉపాధినీ ప్రోత్సహించడం కాదు కదా? ఇదీ పురుష స్వామ్యపు పునాదుల మీద తయారై ప్రవర్ధిల్లే ప్రభుత్వాల ఆలోచనా విధానాలు! ఇది భూస్వామ్య భావజాలం కానీ, ఆధునిక కాలపు భావజాలం కాదు.

అయితే ఇది సరిపోతుందా? అంటే చాలదు. ఇప్పటికీ ప్రభుత్వాల లక్ష్యం కూడా అమ్మాయికి “పెళ్లి ” అన్నదే పరమావధిగా ఉన్నట్టుగా ప్రభుత్వ పథకాలు మనకి ప్రత్యక్షముగా గొంతెత్తి చెప్తాయి. అమ్మాయిలకి చదువుకీ, ఉద్యోగాలకీ ఆడపిల్లల ఆర్ధిక భద్రతకీ ఎక్కడా పథకాలు లేవు. కానీ వివాహ వయసు రాగానే అమ్మాయికి పెళ్లి చేసేసి పంపడానికి గానూ తల్లితండ్రులకి సాయం చేసే పథకాల్ని మనం ఇక్కడ చూడొచ్చు. కళ్యాణలక్ష్మి ; షాదీ ముబారక్ వంటి పథకాల లక్ష్యం ఇప్పటికీ అమ్మాయిలని పెళ్లి చేసుకుని పొమ్మని ప్రోత్సహించటమే గాని, విద్య నీ ఉపాధినీ ప్రోత్సహించడం కాదు కదా? ఇదీ పురుష స్వామ్యపు పునాదుల మీద తయారై ప్రవర్ధిల్లే ప్రభుత్వాల ఆలోచనా విధానాలు! ఇది భూస్వామ్య భావజాలం కానీ, ఆధునిక కాలపు భావజాలం కాదు.

సాంస్కృతికంగా … ఆర్ధికంగా స్త్రీల విషయంలో పాలన చేసే వాళ్ళ దృక్పథాలు ముందుగా మారవలసి ఉంది. అందుకు వారు చదువుకుని సవంతంత్రంగా ఆలోచనలు చేసే స్త్రీల సహాయం తీసుకోవలసి ఉంటుంది. తమలోని వెనుకబాటుదనాలని పాలనా రంగంలో ఉన్న వారు ప్రయత్నం చేసి మరీ మార్చుకోవలసి ఉంటుంది. ఇది కష్టమైనా మొదట … సమాజపు పురోభివృద్ధికి ఇది ఎంతో ముఖ్యం! మంచి సమాజం అప్పుడే సాధ్యం అవుతుంది అని అందరూ అర్ధం చేసుకోవాలి!

తెలివైన ఆడవాళ్లు వంట ఇళ్ళల్లోనూ … తక్కువ సామర్ధ్యం ఉన్న పురుషులు వీథుల్లోనూ … ఉద్యోగాల్లోనూ నిండిపోయి ఉండే దృశ్యం అంతటా మారాలి!

తెలివైన ఆడవాళ్లు వంట ఇళ్ళల్లోనూ … తక్కువ సామర్ధ్యం ఉన్న పురుషులు వీథుల్లోనూ … ఉద్యోగాల్లోనూ నిండిపోయి ఉండే దృశ్యం అంతటా మారాలి! ఇలాంటి మార్పుల కోసమే ఎవరైనా పనిచేయాలి! ఈ స్వభావం అలవడేలాగా ప్రతీ తల్లీ తండ్రీ వారి సంతానాన్ని పెంచవలసి ఉంది. అప్పుడు మాత్రమే మంచి సమాజాల ఆవిష్కరణ అమలులో కుదురుతుంది. లేకపోతే ఆయా సమాజాలు ఇప్పటికీ, అనేక రంగాలలో వెనకబడే ఉండిపోతాయి

ఇవాళ మార్చి 8. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ  సందర్భంగా ఈ మాటలు నేను చెప్పాలి అని అనుకున్నవి.

జయప్రభ ప్రముఖ స్త్రీవాద రచయిత్రి. వారు రచించిన ‘చూపులు’, ‘పైటని తగలెయ్యాలి’ అన్న కవితలు ఒక  కొత్త చూపును అందించాయి. సాహిత్యప్రపంచంలో ఆ కవితలు తీవ్ర ప్రకంపనలను సృష్టించిన విషయం తెలిసిందే.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article