ఉదయ మిత్ర
ఇవాళ చీకటిని
ఆలస్యంగా రమ్మని చెప్పాలి
మేం
వెల్తురు పిట్టకు స్వాగతమివ్వాలి.
ఇవాళ
ఊరికొసన బావిని
వేయి వసంతాల లోగిలిని
శుభ్రం చేయాలి.
బావి అరుగుమీద కూచొని
ఆయన జైలు కబుర్లు వినాలి.
ఇవాళ
మరణవాక్యానికి
సెలవివ్వాలి
నాకుబతకాలని ఉందంటూ చెప్పే
జీవితేచ్ఛకు సలాముకొట్టాలి
మరణ భయాలకు లొంగని
ఆయన ధిక్కారగీతాన్ని
దేశానికి దిక్సూచిగ నిలపాలి
మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో అరెస్టయి జైలు శిక్ష గడుపుతున్న ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాను బాంబే హైకోర్టు నేడు నిర్దోషిగా ప్రకటించింది. తక్షణమే ఆయనను జైలు నుండి విడుదల చేయాల్సిందిగానూ ఆదేశించింది. జి.ఎన్. సాయిబాబా సహా మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టులోని నాగపూర్ బెంచ్ తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా ఒక ఉద్విగ్న కవిత.