పద్మ త్రిపురారి
రాజీవ నయనీ!
రసరమ్య రూపిణీ!
మంజీర పదమంటి
నీ పలుకు వింటినీ
నవరాత్రి వేళలో
నిన్ను సేవించగా
నవనీతసుమములా
నేరితెచ్చితిని
గలగలా నవ్వులే
గాజులై మ్రోగగా
మిలమిలా మెరిసెలే
నీ మోము కాంతులే
పసుపు కుంకుమలు
పారాణి పూయగా
పసిడి రూపమై నీవు
మాదరిని చేరగా
ముత్యమై విరిసెనే
దరహాస చంద్రికలు
పగడమై వెలిగెనే
రాజ్ఞి!నీ చూపులు
సిరులొలుకు శ్రీమాత!
శ్రీచక్రవాసినీ!
శ్రీలలిత!పార్వతీ!
పరమేశునీశ్వరీ!
ముచ్ఛటగ ముంగిట
రంగవల్లికలోన
రమణులే హరిణలై
కోలాటమాడగా
కోమలీ!నీ విజయ
గాథలే పాడగా
శాంభవీ!నీ దయను
మాపైన నిలుపవే