Editorial

Monday, December 23, 2024
కవితఅశ్రువొక్కటి చెక్కిలిపై... సయ్యద్ షాదుల్లా కవిత

అశ్రువొక్కటి చెక్కిలిపై… సయ్యద్ షాదుల్లా కవిత

చిత్రం : బీర శ్రీనివాస్

సయ్యద్ షాదుల్లా

ఊపిరి అందడం లేదు
గట్టున పడేసిన చేపలా
కొడిగట్టిన దీపంలా
కొట్టుకుంటున్నాయి ఊపిరి తిత్తులు గిలగిలా
నా శ్వాసనిశ్వాసలతో మృత్యువు దాగుడు మూతలాడుతున్నట్టుంది
ఎందుకో మృత్యువే గెలుస్తుందని నా అలసిన గుండె బేలగా చెబుతుంది
కరోన మృత్యుశయ్య ఇంత కఠినంగా ఉందేమిటి ?
చావనివ్వదు బ్రతుకునివ్వదు,
చావు ఇంత భయానకంగా ఉంటుందా?
కనురెప్పలు భారంగా మూతపడుతూ జ్ఞాపకాలదొంతరలు తెరిచాయి గతంలోకి వెళ్ళాయి.

లాక్ డౌన్ తో పట్టణమంత నిశ్శబ్దంగా
తుపానుకు ముందు ప్రశాంతంలా ఉంది.
శాంతివైద్యపారిశుధ్యం మన రక్షణ కవచంలా
మనకు లక్ష్మణ రేఖలా నిలిచి ఉండగా
నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ముందుకు వెళుతున్నాను
రక్షణ వలయం దాటుతూ సుడిగాలితో పోటీ పడుతూ, మృత్యుకుహరంలోకి
నా జీవితం కోసం తమ జీవితాన్ని పణంగా పెట్టిన పొలీసుల ఆగని పరుగు నా వెనక
నా కప్పుడు తెలీదు నేను కనిపించని మృత్యువుతో కలవడానికి తిరిగి రాని లోకాలకు వెలుతున్నానని,

కన్నీటి పొరల మధ్య లీలగా కనిపిస్తుంది నా అందాలసుందర హర్మ్యం
కోటి ఆశలతో, ఏడు జన్మలు నాతోనే ఉంటానని
ఏడడుగుల బంధంతో నను పెనవేసి వెచ్చని కౌగిలిలో బంధించిన నా భార్య అడుగుతుందిపగిలిన గుండెను నలిగిన గొంతుతో కలిపి ఎక్కడికెలుతున్నావని?

నా చెక్కిళ్ళపై ఇంకాఆరని నా రెండేళ్ళకూతురు లేలేత గులాబీపెదాల ముద్రలు
భీత హరిణిలా ఏదోతెలియని భయంతో నన్ను చూసిన ఆ కళ్ళు

ఒంటరి జీవితంతో వేసారి జంటకోసం ఎదురుచూస్తున్న నా సోదరి కళ్ళలో
ఇకనేనింతేనా అన్న నైరాశ్యం ననునిలువెల్లా దహిస్తున్నట్లుంది.

చరమాంకంలో చేతి కర్రలా ఉండాల్సిన కొడుకు
కరోన మృత్యు కౌగిలిలో విలవిలలాడడం జీవఛ్చవాల్లా చావలేక బతుకుతున్న
నా ముసలి తల్లితండ్రులకు తీరని శరాఘాతం

నా అనాధ శవ దహనసంస్కారం కన్నులకు కట్టినట్టుగా కనిపిస్తుంది
చితి మంటల చిటపటలు
అనాధల హాహా కారాలు

నేను చేసిన తప్పుకు ఎన్ని జీవితాలకు చిద్రాలు పడ్డాయి?
నా శ్వాస ఆగినట్లనిపిస్తుంది !
దూరంగా నర్సులు నా వైపుకు ఆత్రంగా వస్తున్నట్లుంది!!
నా చివరి అశ్రువొక్కటి కరోనాను శపిస్తూ నా చెక్కిలిపై ఘనీభవించింది !!!
నా కలం ఆగింది !!!!

కరోనా మహమ్మారి మూడో వేవ్ లో ఉన్నాం.
ప్రస్తుతం కాస్త వెసులుబాటు ఉన్నట్టు అనిపించినా ముందేమి జరగనున్నదో ఊహించలేని స్థితి. నిస్సహాయ స్థితి. జాగ్రత్తగా ఉండాలన్నహెచ్చరికకు దర్పణం ఈ కవిత.

సయ్యద్ షాదుల్లా, 548,
CSK గ్రీన్ విల్లాస్, షాద్ నగర్ – 509216.
మొబైల్ : 9121001918.  

More articles

4 COMMENTS

  1. మిత్రమా నీ హృదయ లోతులో నుండి వచ్చిన హృదయ విదరా కముగా. ప్రతి మనిషి ని గడ గడ లాడించిన కరోనా రక్కసిని నీ తేనే మనసు హృదయము విలా విలా లాడిన తీరు. బాధితుల బాధ ను ని అక్షర రూపములొ. ఆత్మీయులను కోల్పోయిన శోకము మరచిపోకుముందే కరోనా మహమ్మారి మూడవ రూపములో కాచుకొని. ఉన్నది తెలిసి ని వాణి కలం మూగపోకూడదు మిత్రమా. అమ్మ ను నాన్న ఆత్మను కోల్పోయిన అనాధ పసి కూనలకు ఆత్మీయ పిలుపు ని హృదయ స్పందన ని మృధువైన చెక్కలి పై జారిన అశృవు నీ నివాళికి తర్కానాము మిత్రమా బరువైన హృదయము తో నేను నీతో జతగా ఉంటాను. మనలో మనకు ధన్యవాదములు క్షమించుము ఉండదు మిత్రమా ని లాంటి శ్రీ వికటకవి ఉండడము మా లాంటి బాల్య మిత్రులకు గర్వాంగా ఉన్నది. అందరి హృదయము.దోచిన మిత్రమా 🙏🏻🙏🏻🙏🏻

  2. కరోనా సృష్టించిన కల్లోలాన్ని కళ్లకు కట్టినట్టుగా రాశారు.
    ఎందరో అనుభవించిన దుస్థితిని అక్షరాల్లో అద్భుతంగా చిత్రించారు. 👌👌🙏🙏🌹🌹

    • కరోన సృష్టించిన కల్లోలాన్ని కళ్ళకు కట్టినట్టుగా రాశారు. ఎందరో అనుభవించిన దుస్థితిని కళ్లకు కట్టినట్టుగా అక్షరాలలోఅద్భుతంగా చిత్రించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article