పద్మావతి
పూలంటే నేను
పళ్లంటే నేను
చెట్టంటే నేను
పుట్టంటే నేను
కొండంటే నేను
కొలనంటే నేను
మొలకంటే నేను
చేనంటే నేను
చిగురంటే నేను
పొదలంటే నేను
ఆవంటే నేను
దూడంటే నేను
ఊరంటే నేను
ఏరంటే నేను
చిలకంటే నేను
కొలికంటే నేను
చుక్కంటే నేను
ముగ్గంటే నేను
గడపంటే నేను
పసుపంటే నేను
గింజంటే నేను
గాజంటే నేను
కొమ్మంటే నేను
కోకంటే నేను
బడంటే నేను
గుడంటే నేను
పువ్వు నేను
నవ్వు నేను
బొట్టు నేను
బోనం నేను
నింగి చుక్కను నేను
నేల ముగ్గును నేను
కొలను కలువను నేను
కనుల కాటుక నేను
కాలి మువ్వను నేను
మెడలో ముత్యం నేను
చేతి వంకిని నేను
నడుమ్ పట్టిని నేను
చీర కుచ్చిళ్ళు నేను
జడ కుప్పెలు నేను
ఆ…. నేను
ఈ….. నేను
అన్నింట నేను
ఇంతకీ….. ఎవరిని నేనూ…..?