Editorial

Wednesday, January 22, 2025
Photo Featureపివి స్మరణలో నేడు జ్ఞానభూమి వెళదాం ...

పివి స్మరణలో నేడు జ్ఞానభూమి వెళదాం …

జ్ఞానభూమి :  స్మారక స్థలి

మరణించినపుడు ఎంతో అలక్ష్యానికి గురైన శ్రీ పివి నరసింహారావు గారిని గొప్పగా గౌరవించుకునే అవకాశం చిక్కడం తెలంగాణ ప్రజలకు, మొత్తంగా తెలుగు ప్రజలకు అదృష్టమే.

 

 

 

 

 

పివి యాదిలో హైదారాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన స్మారక స్థలిని ఎపుడైనా చూశారా?  అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా దానికి ‘జ్ఞానభూమి’ అన్న పేరు పెట్టడం ఎంతో సముచితమైన నివాళి. ఘనమైన స్మరణ.

అంతేకాదు, అక్కడ పివి గారి సమాధిని దర్శించడం, వారి భాహుముఖ ప్రజ్ఞకు దర్పణంగా నిలిచే ఆరు  నిలువెత్తు శిలా ప్రతిమలను వీక్షించడం అద్భుతమైన అనుభవం.

వీలున్నపుడు లేదా ఆ వైపుగా పోతున్నప్పుడు ఒక సారి లొపలికి వెళ్ళండి. ఆ మహనీయుడి ముద్రలు, వారి జీవితకాలపు కృషి, గంభీరంగా మన మేధస్సుకు, హృదయానికి మహత్తరమైన స్పూర్తినిస్తాయి. ఆ శిల్పకారుడు ఎవరో కానీ, పివి యశస్సుని అజరామరం చేశారు.

చిత్రాలు: కందుకూరి రమేష్ బాబు

మన దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారత రత్న’కు పివి అన్ని విధాల అర్హుడు. ఆ పురస్కారం వారికి లభించాలని మనందరం కోరుకుందాం.

భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు  : father of indian economic reforms

మౌని / మితభాషి : A man of Precision

అపర చాణక్యుడు : Extremely Good Strategist

బహుముఖ ప్రజ్ఞాశాలి  : Extremely intelligent

మహోన్నత దౌత్యవేత్త   : diplomat par excellence

బహుభాషాకోవిదుడు   : linguist

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article