Editorial

Wednesday, January 22, 2025
కథనాలునాన్నే అమ్మ‌.. బిడ్డల కోసం అమ్మలా

నాన్నే అమ్మ‌.. బిడ్డల కోసం అమ్మలా

కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కరుణించే ప్రతి దేవత అమ్మే కదా కన్న అమ్మే కదా.. కంటేనే అమ్మ అని అంటే ఎలా కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా.. రాతి బొమ్మే కదా..

నిజమే కదా. తొమ్మిది నెలలు మోసి కన్న తర్వాత అమ్మ తన బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఒకవేళ తన బిడ్డను ఆ అమ్మ సరిగ్గా చూసుకోకపోతే.. అప్పుడు ఎలా? ఆ బిడ్డను హత్తుకున్న ఎవరైనా అమ్మే కదా.. కన్న అమ్మే కదా. ఇప్పుడు మనం చదవబోయే స్టోరీ కూడా అటువంటిదే. ప్రేరణ పొందే స్టోరీ ఇది.. స్ఫూర్తినిచ్చే కథ ఇది. పదండి తెలుసుకుందాం.

థాయ్ లాండ్ కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి పనుథాయ్ కు ఇద్దరు కొడుకులు ఐదేళ్ల ఓజోన్, మూడేళ్ల ఇమ్సోమ్ ఉన్నారు. కొన్ని రోజుల వరకు వాళ్ల ఫ్యామిలీ బాగానే ఉంది. కాని.. కొన్నిరోజుల క్రితం అతడి భార్య అతడిని వదిలేసి వెళ్లిపోయింది. దీంతో పిల్లలు అమ్మలేని అనాథలయ్యారు. పిల్లల బాధ్యత తండ్రి పనుథాయ్ పై పడింది. పిల్లలకు ఎంత చేసినా అమ్మ లేని లోటు మాత్రం తీర్చలేడు కదా. భార్యతో విడిపోయినా.. మరో పెళ్లి చేసుకోకుండా పిల్లలకు అమ్మ, నాన్న అన్నీ తానే అయ్యాడు.

థాయ్ లాండ్ లో మదర్స్ డేను ఆగస్ట్ 12న జరుపుకున్నారు. థాయ్ లాండ్ లో మదర్స్ డే రోజున తల్లులంతా తమ పిల్లల స్కూల్ కు వెళ్లి అక్కడ వాళ్లతో గడపాలి. అది రూల్. సో.. ఆరోజు పనుథాయ్ పిల్లలు కూడా స్కూల్ కు వెళ్లారు. అందరి పిల్లల్లాగానే వాళ్లు కూడా తమ అమ్మ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ.. వాళ్లకు తెలియదు కదా వాళ్ల అమ్మ రాదని. వాళ్ల అమ్మ వాళ్లను వదిలేసి పోయిందనే విషయాన్ని మరిచిపోయారు. తన పిల్లలు అమ్మ రాలేదని బాధపడకూడదనుకున్నారు. దీంతో తానే మహిళలా డ్రెస్ వేసుకొని అమ్మలా పిల్లలు చదివే స్కూల్ కు వెళ్లాడు. అమ్మ రాకున్నా.. నాన్నే అమ్మయి వచ్చినందుకు ఆ పిల్లలు ఎంతో సంతోషించారు. మదర్స్ డేను అమ్మలా ఉన్న నాన్నతో, నాన్నలా ఉన్న అమ్మతో ఎంజాయ్ చేశారు.

ఇక.. తన పిల్లల కోసం అమ్మలా మారిన పనుథాయ్ ను చూసి అక్కడి వారు తెగ మెచ్చుకున్నారు. స్కూల్ లో అతడు తన పిల్లలతో కలిసి మదర్స్ డే వేడుకల్లో పాల్గొనగా కొంతమంది ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో మనోడు కాస్త సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు. లక్షల మంది ఆ ఫోటోలను, వీడియోలను చూసి తెగ మెచ్చుకుంటున్నారు. ఈరోజుల్లో కూడా ఇటువంటి తండ్రులు ఉన్నారా? నిజంగా నువ్వు గ్రేట్. నీ సుఖం నువ్వు చూసుకోకుండా.. పిల్లల కోసం ఇంత చేస్తున్న నువ్వు గ్రేట్ పో.. అంటూ నెటిజన్లు మనోడిని ఆకాశానికెత్తుతున్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article