Editorial

Tuesday, December 3, 2024
ARTSతెలంగాణ తెలుపు : టైలర్ శ్రీనివాస్ చిత్రం

తెలంగాణ తెలుపు : టైలర్ శ్రీనివాస్ చిత్రం

 

Tailor Srinivas

టైలర్ శ్రీనివాస్ బొమ్మలు చూస్తే అద్దం వంటి పల్లెటూరి చెరువులో మన అమ్మను చూసుకున్నట్టు ఉంటుంది.

కందుకూరి రమేష్ బాబు

Artist వృత్తి రీత్యా తాను గానీ తన తండ్రి గానీ టైలర్ కాదు. కానీ తాతల నాడు జతకూడిన ‘టైలర్’ అన్న పదం అయనకు ఇంటిపేరులా మారింది. అలాగే ఆయన్ని ఊరు కూడా కట్టిపడేసింది. తనని వదలకుండా అంటిపెట్టుకోవడమే కాదు, అది గ్రామీణ మహిళా మూర్తిమత్వాన్ని అత్యంత హృద్యంగా చిత్రించే అపురూప కళాకారుడిని చేసింది. ఒక రకంగా గ్రామ దేవతను అర్చన చేసే ఒక తపస్విని చేసింది.

మీరు ఒక్కో చిత్రం చూడండి. వాటిల్లో ఆయా మహిళల హావభావాలను పరికించండి. ఒక్కొక్కటి ఒక ముద్ర. అవి మోములు కాదు, దశాబ్దాలుగా అరిగోస పడ్డ తల్లులు దేహ రాగాలు. ఆత్మ గాయాలు. కష్టంలోనే స్వాంతన పొందిన అమ్మలక్కలు జీవన చరితలు.

Tailor Srinivas

Tailor Srinivasనిజానికి అతడి చిత్రాలన్నీ నలుపు తెలుపులా లేక వర్ణ చిత్రాలా అంటే మీరు ఒక్కపరి విస్తుపోయి మళ్ళీ చూస్తారు. నిజానికి నలుపు తెలుపులలోకి ఒక రంగును ప్రవేశపెట్టి అయన ఒక్కో మహిళను ఏకవర్ణ సింగిడిని చేస్తారు. చూసినకొద్దీ ఎండా వానా మబ్బు అందం ఆనందం విషాదం అన్నీ ముప్పిరి గొంటాయి. కొన్ని చిర్నవ్వు నవ్వుతయి సుత.

అతడి చిత్రాలు రంగుల సింగిడా అంటే అవుననే చెప్పాలి. ముందే చెప్పినట్టు వర్ణ సంచయం ఒక్కపరి అంతుపట్టదు.

నిజానికి అయన చేతిలో రేఖా లావణ్యమే అసలైన చిత్రం అనిపిస్తుంది. కాసేపే. ఆ పిదప కాదు…కాదు… తెలుపు, నలుపు, బూడిద, నీలం, ఆకుపచ్చ, గోధుమ, తదితర రంగులూ… వాటి లోవెలుపలి వన్నెలూ, ఆకాశాన ఒక సింగిడి విరియాలంటే ఎట్లాగైతే వెలుగు నీడలా ప్రతిఫలనాలు అవసరమో తెల్లటి కాన్వాసుపై అవన్నీ నిదానంగా తేటతెల్లమై ఆయా చిత్రాలు ఎంత గొప్పగా ఆకర్షిస్తాయని!

చూడండి. చూస్తూ చూస్తూ మీరు మీదైనా కవి హృదయానికి పని చెప్పండి.

Tailor Srinivas

Tailor Srinivas

చిత్రమేమిటంటే తాను గీసిన చిత్రాలన్నీ ఒక్క ఊరు మనుషులే. కానీ అవన్నీ నిర్మల తెలంగాణ తల్లి ఆత్మను కళ్ళకు కడతాయి. అందుకే అతడి చిత్రం తెలంగాణ తెలుపు అనాలి.

ఏమైనా, ఊరు సూక్ష్మదర్శినిగా ఉన్న చిత్రకారులే అదృష్టవంతులు. టైలర్ శ్రీనివాస్ కి అభినందనలు తెలుపుదాం. అయన స్వస్థలం మెతుకుసీమ ఐన మెదక్ జిల్లా టేక్మాల్ గ్రామానికి కూడా తెలుపు అభివాదం చెబుతోంది.

Tailor Srinivas

Art @Telangana అన్న గ్రంథంలో టైలర్ శ్రీనివాస్ ప్రత్యేకత గురించి Anand Kumar Gadapa పంచుకున్న అభిప్రాయం చూడండి….

He builds up the voluminous compositions with a painterly effect without losing the drawing, and the choice of the color palette is what makes him a distinct artist. What intrigues the viewer in his paintings is the monochromatic lucidity, which emits luminosity, as if they are sitting under the morning sun, even though subtle tinted hues apparently show solid opacity.

 

More articles

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article