ఎరుపు పద్యం
విశ్వ సోదర భావం పెంచే సామ్యవాదానికి అంజలిగా అభ్యుదయ వాదులు, మార్క్సిస్టులు, ఎర్ర జెండాతో ఉద్యమించే కమ్యూనిస్టులు కూడినప్పుడు, ప్రజలతో సమావేశమైనప్పుడు పాడుకోవడానికి వీలుగా రాసిన ఎర్ర పద్యం ఇది. రచన డా.డేరంగుల శ్రీనివాసులు (కవిత శ్రీ ), గానం శ్రీ కోట పురుషోత్తం
శ్రీ కోట పురుషోత్తం పరిచయం
సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తారు.