మట్టిలో మాణిక్యాలను వెలికితీసే మంత్ర దండమేది? బ్రతుకును దుర్భరం చేసే పాపిష్టి రాతను తొలగించు మంత్రం దండమేది? అంటూ శ్రమ గౌరవాన్ని, దాని ఆవశ్యకత పిల్లల మనస్సులో నాటుకునేలా, వారి బాధ్యతను గుర్తింపజేసి మరింత దీక్షతో కృషి చేసేలా ప్రేరేపించడానికి శ్రీ ఆముదాల మురళి రాసిన సీస పద్యమిది. గానం శ్రీ కోట పురుషోత్తం.
సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తారు.
అద్భుతం