తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ఆంగ్లేయులలో ఒకరిగా చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సదా స్మరణీయులు. మిగతా ముగ్గురి పేర్లు ఆర్థర్ కాటన్, కాలిన్ మెకెంజి, థామస్ మన్రోలు.
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు భాషోద్దరణకు, సాహిత్య పునరుజ్జీవనానికి విశేష కృషి చేసిన విషయం తెలిసిందే. తొలి తెలుగు శబ్దకోశమును పరిష్కరించనది వారే. వేమన పద్యాలకు ఖండాతర ఖ్యాతిని సమకూర్చి పెట్టినది కూడా వారే. అంతటి మహనీయుడి కృషిని హృదయంతరాల్లోంచి కొనియాడే ఈ పద్యాన్ని పుట్లూరు శ్రీనివాసాచార్యులు రచించారు.
నిర్వహణ కోట పురుషోత్తం
సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తారు.
నైస్ సర్