Editorial

Wednesday, January 22, 2025
Audio Columnగుణము శిఖర ప్రాయమని తెలుపు పద్యం

గుణము శిఖర ప్రాయమని తెలుపు పద్యం

విద్యార్థులకు చదువు సంధ్యలతో పాటు శీల నిర్మాణం ఎంత ముఖ్యమో విశదీకరించే ఈ పద్యం ఉపాధ్యాయులు సైతం వినదగ్గది. బడిలో పా ఠాలతో పాటు ఇలాంటి పద్యాలు కూడా గొంతెత్తి పాడితే పిల్లలకు వజ్రతుల్యమైన వ్యక్తిత్వం ఏర్పడటం ఖాయం. ఈ సీస పద్యం రచన శ్రీ ఆముదాల మురళి.
పాఠశాల, కళాశాల విద్యార్థుల వికాసం కోసం ఇలాంటి పద్యాలను ప్రత్యేకంగా రాపించి మరీ పాడి, ఎంతో చక్కటి కృషి నెరుపుతున్న శ్రీ కోట పురుషోత్తం తెలుపు కోసం నిర్వహిస్తున్న శీర్షిక ఇది.
ప్రతి రోజూ ఒక పద్యం – వినండి… వినిపించండి

 

సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article