Editorial

Wednesday, January 22, 2025
Audio Columnచదువు విలువ తెలుపు పద్యం

చదువు విలువ తెలుపు పద్యం

 

వీధి బాలుడి దుస్థితిని కళ్ళకు కడుతూ, ఎటువంటి  పరిస్థితులలోనైనా మనిషి ఎదురీది బతుకుతున్న వైనాని చాటి చెబుతూ, మనసు అడుగు నుంచి సమాజపు స్థితిగతులు ఎలుగెత్తి పాడుతూ, విద్యార్థులను చదువు వైపు మరల్చే సీస పద్యమిది. రచన శ్రీ ఆముదాల మురళి. గానం శ్రీ కోట పురుషోత్తం

సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తారు.

More articles

1 COMMENT

  1. ఆముదాల మురళి వ్రాసిన పద్యమిది అంటే బాగుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article