పిల్లలకు ఎన్ని విధాలా విద్య ప్రాధాన్యం చెప్పాలో అన్ని విధాలా తెలుపవలసినదే.
ఉదాహరణకు ఇది వినండి.
పేదరికంలో నలిగిపోయే పనిపిల్లను ప్రస్తావిస్తూ బంగారు భవితకు బాటలు వేసుకోమని, అందివచ్చిన చదువును సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోమని ఎంతో మార్దవంగా బాలికలకు ఉపదేశిస్తూ శ్రీ ఆముదాల మురళి ఈ పద్యాన్ని రచించారు. శ్రీ కోట పురుషోత్తం ఎంతో పరితాపంతో గానం చేశారు.
సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తారు.