గడ్డి పూవుపై ఆముదాల మురళి గారు రచించిన ఈ అపురూప పద్యం వినండి. ఈ రచన ఆ పూవు ఘనతను చెప్పడం మాత్రమే కాదు, కష్ట సుఖాల్లో మునిగి తేలే మానవుడికి ఒకానొక సమయంలో ఆ గడ్డి పూవు సైతం ఎంత ఉపశమనం కలిగిస్తోందో చెప్పడం. వినండి. మీ పరిసర ప్రపంచం నుంచి గొప్పగా స్ఫూర్తి పొందండి.
నిర్వహణ కోట పురుషోత్తం
సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తారు.