Editorial

Monday, December 23, 2024
జానపదం#ooantavamavaooooantavamava : ఇంద్రావతి సత్యవతులు - ఈ బంజారా బిడ్డలకు అభినందనలు తెలుపు

#ooantavamavaooooantavamava : ఇంద్రావతి సత్యవతులు – ఈ బంజారా బిడ్డలకు అభినందనలు తెలుపు

ఇద్దరూ ఇద్దరే. తమను తాము స్వయంకృషితో ప్రూవ్  చేసుకున్న మట్టిలో మానిక్యాలు. సత్యవతి ఇంద్రావతులు. ఈ అక్కచెల్లెండ్లు, రాయలసీమ బంజారా బిడ్డలు, నేపథ్య గాయకులు అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని అభినందన తెలుపు కథనం ఇది.

కందుకూరి రమేష్ బాబు 

ఇంద్రావతి చౌహాన్. ఈ పేరు ఇప్పుడు trending. “ఊ అంటావా మావా…ఊ ఊ ఊఊ అంటావా మావ .. అన్న పాటతో ఈ చెల్లెలు నేడు టాలీవుడ్ ని ఊపేస్తుంది. ఇంతకీ ఎవరీవిడ అంటే మన గాయని మంగ్లీ సోదరే అని తెలిసి అందరూ  ముచ్చట పడుతున్నారు. ‘మగవాళ్ళ వంకర బుద్ది’ని ఎద్దేవా చేస్తూ కుర్రకారునే కాదు, అన్ని వయస్కుల వారిని ఆకర్షించేలా రాసిన ఈ ఐటెం సాంగ్ తో ఇంద్రావతి సినీ రంగ ప్రవేశం గొప్ప ఆరంగేట్రమే. ఇక నుంచి ఆమెకు అవకాశాలు వెతుక్కోకుండానే వస్తయంటే అందులో విశేషం ఏమీ లేదు. అంతా ‘దేవీప్రసాద్’, ‘సుక్కు’ సార్ మహిమ అనడంలో తప్పేమీ కాదు. ఐతే, ఆల్రెడీ మంచి గాయనిగా స్థిరపడ్డ మంగ్లీకి ఇంద్రావతి స్వయానా చెల్లెలు కావడం అన్నది ఆమె ప్రతిభకు గౌరవమే అవుతుంది. ఎందుకంటే గాయనిగా మెప్పించినాకే ఆమె మంగ్లీ సోదరి అని పెద్ద ఎత్తున అందరికీ తెలిసింది. కాగా, తెలుగు పాట ఇంద్రావతి పాడగా అదే పాటను కన్నడంలో మంగ్లీ పాడిన విషయం తెలిసిందే. ఈ పాట సూపర్ హిట్ కావడం, కాసేపటి కిందే మంగ్లీ సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టు పెడుతూ, విడుదలైన నాలుగు రోజుల్లో మూడు కోట్ల వ్యూస్ సొంతం చేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ తన చెల్లెలికి మనసారా శుభాకాంక్షలు చెప్పి అభినందించడం విశేషం. ఇది ‘unstoppable buzz’ అని కొనియాడటమూ బాగుంది. కాగా, ఇక నుంచి ఈ అక్కచెల్లెండ్ల కు మరింత ఆదరణ గౌరవం అవకాశాలూ పెరుగుతాయనే చెప్పాలి. ఇద్దరూ కలిసి పాడే రోజులు కూడా వస్తాయని తెలుపు అశిస్తున్నది.

రాయలసీమ బంజరా బిడ్డలు

తెలంగాణా నుంచే కాదు, రాయలసీమ నుంచి కూడా ఇలా గాయనిలు నిలదొక్కుకుంటే వెండి తెర మరింత ఉజ్వలంగా ప్రకాశిస్తుంది. జానపదంతో వెలిగిపోతుంది. అందుకు పెద్ద పెద్ద అడుగులు వేస్తున్న ఈ బంజారా బిడ్డల వంటి మట్టిలో మానిక్యాలు మరెందరో చక్కటి అవకాశాలు పొందాలి. ఇదొక ఫక్తి వ్య్పాపార పరిశ్రమ. ఎంత పరిశామించినా గుర్తింపు రాక పోవచ్చు కూడా. అది ఐటెం సాంగా మరోటా అన్నది కాదు, ఒకసారి ఒక అవకాశంతో నిలదొక్కుకుంటే ఇక చాలు. తమ ప్రతిభ అనేక విధాలా వికసిస్తుందని మనకు తెలుసు. అందుకు సంతోషపడాలి. ఇద్దరు అక్కా చెల్లెండ్లకు అభినందనలు చెప్పాలి.

మాటకారి మంగ్లీగా సత్యవతీ చౌహాన్

అనంతపురం జిల్లా, గుత్తి మండలం, బసినేపల్లె తాండలో పేద బంజారా కుటుంబంలో పుట్టిన ఈ ఇద్దరు మానిక్యాలు స్వయంకృషికి ప్రతీకలు. తెలంగాణలో పల్లె పాటలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన మంగ్లీ వి 6 తీన్మార్ పొగ్రాంతో ప్రతి ఇంటికీ పరిచయం ఐంది. అక్కడే ‘సత్యవతి ‘ పేరుకు బదులు ‘మంగ్లీ’ అనే తన తాతమ్మ పేరు ఎంచుకుని ‘మాటకారి మంగ్లీ’గా పాప్యులర్ ఐంది. తర్వాతే తీన్మార్ న్యూస్’ తో మంగ్లీ పేరు తెలంగాణాలోని గడప గడపకీ చేరింది. ఇటీవలే సద్గురు సన్నిధిలో కూడా పాడే అవకాశం రావడంతో తాను ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇక తన చెల్లెలు మొదటి సినిమాతోనే సొంత పేరుతోనే తనదైన భిన్నమైన గళంతో తెలుగువారికి దగ్గరైంది.

ఊ అంటావా మామా ఊఊ అంటావా…

నిజానికి ఇంద్రావ‌తి త‌న హ‌స్కీ వాయిస్ పాడిన ఊ అంటావా మామా ఊఊ అంటావా పాట‌ శ్రోత‌ల‌ను మామూలుగా మెస్మ‌రైజ్ చేయడంలేదు,  ఈ పాట చివ‌రిలో ఇంద్రావ‌తి త‌న ఎక్స్ ప్రెష‌న్ ల‌తో కూడా ఆక‌ట్టుకోవ‌డం పాట‌కు మ‌రింత ప్ల‌స్ గా మారిన విషయం తెలిసిందే.

ఆ పాట ఒక సారి వినండి.

ఇంద్రావతి చౌహాన్

స్వతహాగా శాస్త్రీయ సంగీతం ఏమీ నేర్చుకోలేదు కానీ ఈ అమ్మాయి చక్కటి ప్రతిభావంతురాలు. డిగ్రీ వరకు చదువుకుంది. ఇదే తోలి సినిమా అవకాశం. ఐతే, అక్క మంగ్లీ తాను గతంలో పనిచేసిన వి 6 ఛానల్ మొదలు ఎన్నో చానల్లకు తీసుకువెళ్ళింది. సరైనా అవకాశాల కోసం తనవంతు ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు టైం వచ్చింది. చెల్లెలు చక్కటి అవకాశం దక్కించుకుంది. ఇకనుంచి ఇంద్రవతి తన సత్తా చూపాల్సిందే. అక్కను కూడా మరపించాల్సిందే.

తల్లి వెనక తల్లివి…

కాగా, ఈ పాట విజయోత్సాహంతో ఉన్న ఇంద్రావతి తన సోదరిని మరచిపోకపోవడం విశేషం. అక్క తనకు ‘దేవత’ అంటూ పేర్కొంటూ ‘అమ్మ తర్వాత అమ్మ’ అంటూ, ఆమె లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేదాన్నే కాదని సగౌరవంగా చెప్పడం అభినందనీయం. ఇది పాడు ఇండస్ట్రీ. ఐనా జెలసీకు తావు లేకుండా ఇద్దరూ హాయిగా ముందుకు సాగుతారనే ఆశిద్దాం.

సోదరీమణులు ఇంద్రావతి, సత్యవతులకు అభినందనలతో …వారిద్దరూ గతంలో పాడిన పాట…ఇప్పటి వైభవం కలిపి చేసిన ఈ సాదా వీడియో నేడు వైరల్ అయ్యే టైం రావడానికి కూడా సంతోషిస్తూ…

 

https://www.facebook.com/srishardacreations/videos/603876404178281

 

 

 

 

 

 

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article