Editorial

Monday, December 23, 2024
ఆధ్యాత్మికంఆమె శక్తి స్వరూపిణి - గన్నమరాజు గిరిజామనోహరబాబు తెలుపు

ఆమె శక్తి స్వరూపిణి – గన్నమరాజు గిరిజామనోహరబాబు తెలుపు

woman

విద్యాః సమస్తాః తవదేవి! భేదాః
స్ర్తియః సమస్తాః సకలా జగత్సు

మహిళను శక్తి స్వరూపిణిగా గౌరవించిన భావన మనది. మహిళ సర్వసృష్టికి ఆద్యురాలిగా ఆదరించిన ఆలోచన మనది. కాని కాల ప్రభావం మహిళలు ఒక విధమైన న్యూనతకు లోనుకావడానికి పురుషాధిక్యత అన్న ఒకే ఒక దుష్టభావనయే కారణం.

ఓ దేవీ! సమస్త కళలు, విద్యలు, ప్రపంచంలోని సమస్త స్త్రీలు నీ యొక్క వివిధ స్వరూపాలే. కనుక దేశము – జాతి – అను ఇటువంటి భేద భావాలు చూపుకుండా ప్రతి స్త్రీని కూడా ఆదరించి గౌరవ దృష్టితో చూడాలి- అన్న పవిత్ర ఆశయంతోనే అనేక శాస్త్రాలు, ధర్మాలు చెప్పిన మాటలు మన మౌలికమైన ఆలోచనలకు అద్దం పడుతున్నాయి.

అసలు ధర్మశాస్త్రాలు మహిళల పట్ల మనం చూపవలసిన గౌరవాలు ఏ విధంగా ఉన్నాయో చాలా స్పష్టంగా బోధించాయి. కొంతమందికి స్త్రీలను తాము రక్షిస్తున్నామన్న భ్రమలుంటుంటాయి. నకశ్చిత్ మోషితః శక్తః ప్రసహ్య పరిరక్షితుం…ఏతై రూపాయయోగైస్తు శక్యాః తాః పరిరక్షితుమ్…

ఎవరైనా సరే నేను స్త్రీని పోషించి రక్షిస్తాను అని గర్వంగా భావించరాదు. అది అసాధ్యమని కూడా తెలుసుకోవాలి. స్త్రీలలు తమను తామే రక్షించుకోగలరు. రక్షించుకోవాలి కూడా.

అన్న స్మృతికారుని మాటను అనుసరించి ఎవరైనా సరే నేను స్త్రీని పోషించి రక్షిస్తాను అని గర్వంగా భావించరాదు. అది అసాధ్యమని కూడా తెలుసుకోవాలి. స్త్రీలలు తమను తామే రక్షించుకోగలరు. రక్షించుకోవాలి కూడా. దాని కొరకు కావలసిన సాధనాలను సమకూర్చే బాధ్యత మాత్రం పురుషులదే. పుత్రులు స్వతంత్రంగా జీవించడానికి విద్యాబుద్ధులు నేర్పించినట్లే కూతుళ్ళకు కూడా అటువంటి సాధనాలను సమకూర్చాలి. అంతే కాదు, అర్థస్య సంగ్రహేచైనాం వ్యయేచైవనియోజయేత్! అన్నారు. అంటే స్త్రీని స్వయంగా సంపాదనా పరురాలుగా చేసే బాధ్యత మీదే. ఆ సంపాదనపైన సంపూర్ణాధికారం ఆమెకే ఉండాలి. ఆ ద్రవ్యాన్ని ఖర్చుపెట్టే విషయంలో పూర్తిగా ఆమెకే స్వేచ్ఛ ఉండాలన్నమాట. అంతేగాక ఎవరూ కూడా స్త్రీ సంపాదనపై ఆధార పడరాదు. స్త్రీ ధనాన్ని ఆశించరాదు. ఆమె ఉద్యోగినియై ధనార్జన చేయగలిగినప్పుడు తననుతాను రక్షించుకోగలిగే సమర్థురాలవుతుంది. అందుకే
స్త్రీని ధనేనతు యే మోహాదుపజీవంతి బాంధవాః
నారీయానాని వస్ర్తం వాతే పాపాయాంత్యధోగతిమ్…

ఎవరైన సరే స్త్రీ ద్వారా వచ్చే ధనాన్ని తాము గ్రహించి తమ సుఖం కోసం ఖర్చుచేసే పాపాత్ములుంటే వాళ్ళంతా అధోగతి పాలవుతారని శాస్త్రం చెబుతున్నది.

అనికూడా అన్నారు. ఎవరైన సరే స్త్రీ ద్వారా వచ్చే ధనాన్ని తాము గ్రహించి తమ సుఖం కోసం ఖర్చుచేసే పాపాత్ములుంటే వాళ్ళంతా అధోగతి పాలవుతారని శాస్త్రం చెబుతున్నది. ఏ పురుషుడైనా స్త్రీని అవమానపరిచే విధంగా ఊరక దూషిస్తుంటాడో వాడు నూరురెట్లు శిక్షార్హుడన్న విషయం ఎట్లా చెప్పారో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

అకన్యేతి యాంకన్యాం బ్రూణద్ధోషేణ మానవః
స శతంప్రాప్ప్నయాద్దండం తస్యాః దోషమదర్మయన్…

స్త్రీల పట్ల బలాత్కారం వంటి దోషాలకు పాల్పడ్డవాడు సద్యోవధమర్హతి అని శాసించారు. అంటే అటువంటి నీచునికి వెంటనే మరణదండన విధించాలని కఠినంగానే చెప్పారు.

అంటూ చెప్పిన ఈ మాటలు స్త్రీల పట్ల చులకన భావం, దోషభావం కలిగి ఉండరాదన్న సత్యం ఆవిష్కరించినట్లయింది. పైగా స్త్రీల పట్ల బలాత్కారం వంటి దోషాలకు పాల్పడ్డవాడు సద్యోవధమర్హతి అని శాసించారు. అంటే అటువంటి నీచునికి వెంటనే మరణదండన విధించాలని కఠినంగానే చెప్పారు. ఇంకా కొంచెం ముందుకువెళ్ళి యుక్త వయస్సు వచ్చిన కన్యకు వివాహం ముఖ్యమేకాని ఆ వివాహం ఎవరో ఒక గుణహీనునికి ఇచ్చి చేయరాదని ఖచ్చితంగా చెప్పాయి శాస్త్రాలు.

కామ మామరణాత్ తిష్ఠేత్ గృహే కన్యర్తు మత్యపి
నచైవైనాం ప్రయచ్ఛేత్తు గుణ హీనాయ కర్హిచిత్

పెళ్ళీడుకు వచ్చిన కన్య జీవితాంతం పెళ్ళికాకున్నా ఇంట్లో ఉండిపోయినా మంచిదేకాని, ఆమెను ఒక గుణహీనునికిచ్చి ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేయరాదని కట్టడి చేశారు. ఇది స్త్రీల పట్ల ఉన్న భద్రత భావానికి పరాకాష్ఠ. గర్భిణీతు ద్విమాసాదిః తథా ప్రవ్రాజితో మునిః అన్న నియమాన్ని బట్టి రాజ్యానికి, పాలకులకు కూడా స్త్రీల పట్ల కొన్ని బాధ్యతలున్నట్లు తెలుస్తున్నది. రెండు నెలలు దాటిన గర్భిణీ స్త్రీలను, సన్యాసులను, మునులను, అధ్యాపకులను, విద్యార్థులను ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సేవలందించి ఆదరించాలి అనడం పరిపాలకుల బాద్యతను గుర్తుచేసినట్లవుతుంది.

మన ఇంట్లో పనిచేసే పరిచారికలైనా సరే వారితో ఎటువంటి పరిహాసాలూ చెయ్యరాదు. అగౌరవసూచకమైన సంభోధనలతో పిలువరాదని కూడా నియమించారు.

మన ఇళ్ళలో పనిచేసే మహిళను కూడా గౌరవ ప్రదంగానే చూడాలని కాశ్యపసంహిత వంటి గ్రంథాలు తెలిపాయి. అంతేగాక నస్ర్తీభిః ప్రీష్యాభిరపి సహ ఉపహాసం గచ్ఛేత్ అంటూ మన ఇంట్లో పనిచేసే పరిచారికలైనా సరే వారితో ఎటువంటి పరిహాసాలూ చెయ్యరాదు. అగౌరవసూచకమైన సంభోధనలతో పిలువరాదని కూడా నియమించారు.

ఏ స్త్రీనైనా వయసును బట్టి తల్లిగా, సోదరిగా, కుమార్తెగా సంభావించి గౌరవించాలని, వారియందు అనవసర క్రౌర్యాన్ని, శౌర్యాన్ని ప్రదర్శించరాదని, తాము తప్పులు చేస్తూ స్త్రీల తప్పులను లెక్కబెట్టే విధానాన్ని మార్చుకోవాలని భారత, భాగవతాది గ్రంథాలు శ్రుతి స్మృతులు మొదలైనవెన్నో విపులంగా పేర్కొనడం విశేషం.

ఈ విధంగా స్త్రీల పట్ల సమాజం ఏవిధంగా ప్రవర్తించాలి, ఏవిధంగా ప్రవర్తించరాదని చాలా స్పష్టంగా చెప్పడం గమనిస్తే మహిళాశక్తిని ఎంతగా గౌరవించారో అర్థమవుతుంది. అకస్మాత్తుగా ఒంటరి స్త్రీలున్న ఇంట్లో ప్రవేశింపరాదని, వివాహిత స్త్రీలను వారి భర్తలకు ఇంటివారికి తెలియకుండా ఏ వస్తువుల్ని అడగరాదని, పురుషులు ఏ స్త్రీనైనా వయసును బట్టి తల్లిగా, సోదరిగా, కుమార్తెగా సంభావించి గౌరవించాలని, వారియందు అనవసర క్రౌర్యాన్ని, శౌర్యాన్ని ప్రదర్శించరాదని, తాము తప్పులు చేస్తూ స్త్రీల తప్పులను లెక్కబెట్టే విధానాన్ని మార్చుకోవాలని, ఈ విధంగా అనేక విధాల ధర్మాలను భారత, భాగవతాది గ్రంథాలు శ్రుతి స్మృతులు మొదలైనవెన్నో విపులంగా పేర్కొనడం పరిశీలిస్తే హిందూ ధర్మంలో స్త్రీ ఎంత గౌరవప్రదమైనదో తెలుసుకోవచ్చు. ఆ పద్ధతిలో మసులుకొని జీవితాన్ని వెలిగించుకోవలసిన బాధ్యత అందరిపై ఉన్నదన్నది తిరుగులేని సత్యం.

More articles

1 COMMENT

  1. అద్భుతమైన విషయ ములు. నేటి కాలానికి సరిపోయే బాధ్యత అంశాలు.👌💐💐

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article