ప్రజల్లో ఉద్విగ్న జ్ఞాపకంగా నమోదైన స్కైలాబ్ ఉదంతానికి కామెడి టచ్ ఇచ్చి రూపొందించిన సినిమా ట్రైలర్ నేడు విడులైంది. ఈ సినిమా తెలంగాణాలోని బండలింగంపల్లి గ్రామంలో జరిగే కథగా మలిచినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
సత్యదేవ్, నిత్యామీనన్ రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న చిత్రం స్కైలాబ్. విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో కొద్ది పిన్నమరాజు నిర్మాణంలో త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ (Skylab Trailer ) నేడు విడుదలై అందరినీ అలరిస్తోంది.
వాస్తవ ఘటనలకు కొద్దిగా హ్యూమర్ టచ్ ఇచ్చి విడుదల చేసిన ఈ ట్రైలర్ పూర్తిగా కామెడీ ఎంటర్ టైనర్ గా సాగింది. ఈ సినిమాలో తెలంగాణా భాషా యాసలు ప్రత్యేకం. ట్రైలర్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
బండలింగంపల్లి ఎక్కడుంది?
ఈ సినిమాతో తెలంగాణాలోని బండలింగంపల్లి అన్న గ్రామం పేరు నేటినుంచి నలుగురిలో నానుతోంది. ఈ పల్లెటూరు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఉంటుంది. సినిమా పరంగా ఈ గ్రామంలో కథ జరుగుతున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, ఇందులో నిత్యామీనన్ విలేకరిగా సత్యదేవ్ డాక్టర్ గెటప్ లో కనిపించగా కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఆ గ్రామ సుబేదారుగా నటిస్తున్నాడు.
“ఎంత పెద్ద వానైనా ఆకాశం తడవదు”
డిసెంబర్ 4వ తేదీన అన్ని థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు నిత్య మీనన్ ప్రధాన ఆకర్షణ. దొర బిడ్డగా, ‘గౌరమ్మ’గానే కాదు, ‘ప్రతిబింబం’ అన్న పత్రికా విలేకరిగా ఆమె ప్రేక్షకులను అలరించబోతోంది. “ఎంత పెద్ద వర్షం పడ్డా ఆకాశం తడవదు, గుర్తు పెట్టుకొండి” అన్న ఆమె డైలాగ్ తమాషాగా ఉంది.
ఆ రోజు పుట్టిన వాళ్లకు స్కైలాబ్…
మన దేశంలో 1979 జూలైలో స్కైలాబ్ పడుతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆకాశం నుంచి.. గ్రహ షకకాలు పడి ప్రజలు మరణిస్తానని అప్పట్లో వార్తలు వచ్చాయి. దాంతో ప్రజలు తీవ్ర భయందోళనలకు గురయ్యారు. పని పాటలు స్తంభించి పోయాయి. గోర్లు బర్లు అమ్ముకున్నారు. ఎక్కడ తలదాచుకోవాలో తెలియక నానా ఇబ్బంది పడ్డారు. ఆ రోజు పుట్టిన వాళ్లకు స్కైలాబ్ అన్న పేరు పెట్టుకోవడం తెలిసిందే. కాగా, ఈ వాస్తవ సంఘటనలకు సున్నితమైన హాస్యం రంగరించి నిర్మించిన ఈ సినిమాను ప్రేక్షకులను నాటి జ్ఞాపకాల్లో తీసుకెళ్లడం ఖాయం.