పుట్టినింట్లో అయినా, మెట్టినింట్లో అయినా పడతుల ముగ్గుల్లో సుప్రభాత సంగీతం వింటాం. అదే సంక్రాంతి. మగువ కానుక.
కందుకూరి రమేష్ బాబు
సంక్రాంతి సమీపించడం అంటే ఇల్లూవాకిలీ ఒక ఆహ్లాదకరమైన సంగీత నెలవుగా మారిపోవడం. చిత్రలిపితో ప్రతి ఇంటి లోగిలీ ఒక అందమైన గ్యాలరీగా కొలువు తీరడం. ఇదంతా ఒక అందమైన అనుభవం. అస్వాదన. వెరసి అంతానూ ఒకానొక శోభాయమానమైన కాలం.
నిజానికి స్త్రీకి అందంగా కనిపించాలనే తాపత్రాయం పురుషుని కంటే అధికం. అందుకే ఆమె అలంకరణపై మోజు పెడుతుంది అంటారు. కానీ, తానే గాదు, తన ఇల్లు, పిల్లలు, పరిసరాలు పరిశుభ్రంగా, అందంగా ఉండాలన్న తపన తరుణి అంతరంగంలో దాగి ఉంటుంది. దానికి సహజమైన వ్యక్తీకరణే ముగ్గు. అందుకే అంటారు ముగ్గు స్త్రీల హృదయలిపి అని!
ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ముగ్గు వేస్తారని విశ్వాసం. అందుకే తల్లి తమ కూతుళ్లను ఆదేశిస్తుంది, ముగ్గు గీత గీసిరా అని! కొంతమందేమో ఇంటిముందు ముగ్గుకర్ర వేయి అని కూడా అంటారు. నడిచే వ్యక్తి కాలికి కర్ర తగిలి పడిపోతాడు గదా, అట్లా గృహ ప్రవేశం చేయబోయే దుష్ట శక్తులకు అడ్డంగా ముగ్గు కర్ర వేస్తారని చెబుతుంటారు. అంతేకాదు, ఆ భగవంతుడికి ఆహ్వానం కోసమే ముగ్గు అనీ అంటారు.
కాగా, పండితుల అభిప్రాయం ప్రకారం ముగ్గు ముందు మంత్రంలో, తంత్రంలో, గృహాలంకరణలో ఒక భాగంగా ప్రారంభమై, క్రమంగా ఆచారంగా పరిణమించిందంటారు. శాస్త్రీయ విషయాలు ఎలా ఉన్నా, ముగ్గు ఒక మగువ కానుక.
ఆ మగువ ఎవరైనా ఒకరే. ఆమె భారతరత్న పురస్కార గ్రహీత కావచ్చు, సామాన్య మహిళ కావచ్చు, ముగ్గు ఒక సుప్రభాతం వంటి సుతారమైన జాలువారు. ఒక దివ్యమైన ఆరాధనా నర్తనం. ఆది మహిళా చేతివేళ్ళతో నడయాడె వర్తనం.
ఆ మగువ ఎవరైనా ఒకరే. ఆమె భారతరత్న పురస్కార గ్రహీత కావచ్చు, సామాన్య మహిళ కావచ్చు, ముగ్గు ఒక సుప్రభాతం వంటి సుతారమైన జాలువారు. ఒక దివ్యమైన ఆరాధనా నర్తనం. ఆది మహిళా చేతివేళ్ళతో నడయాడె వర్తనం.
సూర్యుడు మకర రేఖనుంచి కర్కాటక రేఖకు మారడం సంక్రాంతి. కానీ, మన చూపులు ముగ్గులవైపు వాలితేనే అది నిజమైన శోభ. చుక్కల ముగ్గులు, గీటు ముగ్గులు, ముత్యాల ముగ్గులు, రత్నాల ముగ్గులు, చివరాఖరికి రథం ముగ్గు దాకా మీ చూపులు వాలాలని తెలుపుతూ ఈ విశ్వ భాష…Mornign ragaa…