Editorial

Friday, December 27, 2024
సినిమాRRR Trailer : అది పెద్ద దెబ్బే అవుతుందా ?

RRR Trailer : అది పెద్ద దెబ్బే అవుతుందా ?

రౌద్రం రణం రుధిరం ( ఆర్.ఆర్.ఆర్ ) పెరుతో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం  ట్రైలర్ విడుదలైన కాసేపట్లోనే అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోంది. “యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి” అన్న డైలాగ్ …ఇందులో  ‘ది బెస్ట్’ అంటున్నారు. మూడు నిమిషాలా ఏడు సెకండ్లలో సినిమా ఇతివృత్తమైన రౌద్రం, రణం, రుధిరాన్ని అవిష్కరించినట్టే ఉంది. ఐతే ఆ డైలాగ్స్ ధోరణి సినిమాకు అందివస్తయా అన్నది సందేహమే!

కందుకూరి రమేష్ బాబు 

స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజుకొమురం భీమ్ జీవితాలను ఆధారం చేసుకొని తనదైన కల్పనతో రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమా మరోసారి ప్రపంచ ప్రేక్షకులను ఉత్తేజ పరిచే అవకాశం మెండుగా ఉంది. దాదాపు ఒకే కుటుంబం గా  సినిమాలు నిర్మించే రాజమౌళి ఈ సినిమాకు కూడా తండ్రి విజయేంద్ర ప్రసాద్ నుంచే కథ స్వీకరించారు. తాను స్క్రీన్ ప్లే రాసుకొని అద్భుతంగా దర్శకత్వం చేస్తున్నారు. తన అర్ధాంగి రామ రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనింగ్ చేస్తుండగా సోదరుడు కీరవాణి సంగీతం స్వరపరుస్తున్నారు. కె.కె.సెంథిల్ కుమార్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ కాగా బుర్రా  సాయిమాధవ్‌ బుర్రా ఈ చిత్రానికి డైలాగులు అందిస్తున్నారు. ఐతే, ట్రైలర్ లోని సన్నివేశాల రిచ్ గా ఉన్న్నప్పటికీ మాటలు వాడుక భాషలో ఉండి సినిమా గాంభీర్యాన్ని తగ్గిస్తున్న భావన కలుగుతోంది గానీ మొత్తంగా ట్రైలర్ ఆదరగొట్టిందనే చెప్పాలి. “మూడేళ్ళ కష్టం మూడు నిమషాల్లో మాములుగా చూపించలేదు” అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చూడబోయేది చరిత్ర…

ట్రైలర్ వీక్షించిన వారు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు ఆసక్తిగా ఉన్నాయ్. రాజమౌళి చరిత్రను ఆధారం  చేసుకొన్నప్పటికీ అది ఫిక్షన్ అని అందరికీ తెలిసిందే. ఐతే, చూస్తుంటే  అందులో ఎటువంటీ బలహీనత లేదని, రాజమౌళి నిరశాపరచలేడనే అభిప్రాయం ట్రైలర్ కలిగిస్తోంది.”తీసింది చరిత్ర కాకపోవచ్చు కానీ మనం చూడబోయేది చరిత్రలో నిలిచిపోతుంది” అని వీక్షకులొకరు కామెంట్ చేయడమే అందుకు నిదర్శనం.  అంతేకాదు, “జయహో రాజమౌళి గారు… మన తెలుగు వారి సత్తా ఈ మూవీ తో మళ్లీ ప్రపంచానికి తెలియచెబుతున్నారు” అన్న అభినందనలు జోరెత్తుతున్నాయ్. 

మూడు నిమిషాల ఏడు సెకండ్లు…

సినిమా చూస్తున్న ప్రేక్షకులు ప్రతి ఐదు నిమిషాలకు తీవ్ర ఉత్సుకతకు లోనయ్యేలా సన్నివేశాలను కల్పించుకునే రాజమౌళి ట్రైలర్ ద్వారా కూడా అలాంటి ఉత్తెజమే పంచారనాలి. ట్రైలర్ కి వారు మంచి ప్రతిస్పందననే అందుకుంటున్నారు. “నిజంగా ప్రతీ సీను, ప్రతీ షాట్ క్లైమాక్స్ లా ఉంది” అన్న కామెంట్లు వస్తున్నాయ్. “కళ్ళల్లో ఆనంద బాష్పాలు, శరీరమంతటా గూస్ బూమ్స్ వస్తున్నాయి” అని వీరాభిమానులు రెచ్చిపోతున్నారు. “Power packed, adrenaline gushing” అని కొందరి కామెంట్. “This movie will break the record of Bahubali” డ్యాం స్యూర్ అంటున్నారు మరికొందరు. “ఇప్పుడే , థియేటర్ లో ట్రైలర్ చూసి వచ్చా. ఇంకా తారక్ అన్న ఎంట్రీ సీన్కి అరిచి అరిచి గొంతు పోయింది” అని ఒక అభిమాని. ఇట్లా ఇద్దరు హీరులు, వారి అభిమానులకే కాక సాధారణ ప్రేక్షకులను ఆకర్షించేలా మూడు నిమిషాల ఏడు సెకండ్ల ఈ ట్రైలర్ మొత్తం సినిమా వైభవం ఎలా ఉంటుందో చెబుతోంది.

డైలాగ్ లు మామూలుగా లేవు

రౌద్రం స్థానంలో “ప్రాణం కన్నా విలువైన నీ సోపతి నా సొంతమన్న…గర్వంతోని ఈ మన్నులో కలిసి పోతానే” అని జూనియర్ ఎన్టీఆర్ ప్రేమగా అన్న మాట… “రణరంగంలోకి ఉరుకుదాం” అన్నట్టు “భీమ్ ఈ నక్కల వేట ఎంతసేపు కుంబస్తలాన్ని బద్దలకొడదాం పదా….” అన్న మాటా. రుదిర జ్వాలలా అల్లూరి బాణం జుమ్మంటూ రాగా “యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి” అన్న డైలాగ్ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయ్.

ఐతే అదే పెద్ద దెబ్బ కానుందా?

“స్వాట్ దొరవారు ఆదిలాబాద్ వచ్చినప్పుడు ఒక చిన్నపిల్లను తీసుకొచ్చారు” అన్న డైలాగ్ కు “మీరు తీసుకొచ్చింది గోండ్ల (గోండ్) పిల్లనండి” అని బదులు పలుకు ఉంటుంది. “ఐతే, వారికేమన్న రెండు కొమ్ములుంటాయా” అన్నది మలి  డైలాగ్. అప్పుడు ఆ పాప బీతివాహమైన అరుపు. ఆ వెంటనే “ఒక కాపరి ఉంటాడు” అన్న డైలాగ్. దాంతో హీరోఇజం ఎంట్రీ…పులిలా జూనియర్ ఎన్టీఆర్ అడవిలో అరుదెంచుతాడు. పులితో పోరాట ఘట్టం ఉంటుంది. అలా ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఐతే పై డైలాగ్ లు అంత బలంగా పేలలేదు. ఇందుకు కారణం డైలాగ్స్ కన్నా సన్నివేశాలు బలంగా చూపడానికేనా అన్నది తెలియదు. ఒకవేళ ఒక పౌరాణికం మాదిరి లేదా వీర తెలంగాణా సమరయోధుల గాథను కల్పితంగానైనా చెప్పడానికి తగినంత స్థాయిలో మాటలు లేకపోతే మటుకు సినిమాకు అది ముందు ముందు పెద్ద దెబ్బే అవుతుంది మరి!

‘Brace yourself’

కాగా, prepare mentally or emotionally for something unpleasant అన్న అర్థంలో వాడే Brace yourself అన్న కాప్షన్ తో ముగుసే ఈ ట్రైలర్.. ఇద్దరు హీరోల ఈ సినీ గాథ …. బానిసత్వంలో నలిగిపోయే ప్రజానీకానికి భారోసానిస్తూ ఒక అనివార్యమైన యుద్దాన్ని నివారించి శాంతిని నెలకొల్పేలా సాగి ఆనందాన్ని కలిగిస్తుందా లేక వీరిద్దరూ యుద్దంలో సమిధలుగా మారి విషాదాంతంతో మన మనసులను బాధకు గురిచేస్తాయా అన్నది ఇప్పుడే చెప్పలేం గానీ ‘రౌద్రం రణం రుధిరం’ మటుకు ఖాయం అనేలా ఉంది.

‘ది మోటార్ సైకిల్ డైరీస్’ ప్రేరణ

సంక్రాంతి సమయంలో విడుదల కానున్న ఈ సినిమా కోసం 20 వ శతాబ్దపు డిల్లీని పోలి ఉండే ఒక సెట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో పునఃసృష్టి చేసిన విషయం తెలిసిందే. కాగా, ఈ చిత్రానికి స్ఫూర్తి 2004లో విడుదలైన ‘ది మోటార్ సైకిల్ డైరీస్’ అని రాజమౌళి గతంలోనే వెల్లడించారు.

చే’ అన్న పాత్ర గెవారా అనే విప్లవకారుడిగా ఎలా మారుతుందో గమనించి, అదే ప్రేరణగా తన ఇద్దరు విప్లవ యోధులైన కథానాయకుల పాత్రలను ఒక సాధారణ పాయింట్ చుట్టూ అల్లిన కథగా ఆర్ ఆర్ ఆర్ ని పేర్కొనడం విశేషం. వారు అన్నట్టే ఈ సినిమాలో ఇద్దరి సన్నివేశాలు సమానంగా కనపడేలా సినిమా రూపొందించడం ఒకెత్తు అయితే, ఆ మేరకు trilar కట్ చేయడం ఆయా హీరో ఫ్యాన్లకు పండుగే అనాలి.

 

More articles

2 COMMENTS

  1. I personally felt that Ramcharan and Junior NTR had put their blood and soul into their
    performances. The accent of Junior NTR was impressive throughout the trailer. But it looked like Ramcharan has a slight edge given that he has two different get ups in the film. It also appeared that he had gray shades to his character. The scene where Alia gets kicked in the stomach was also quite emotional mixed with her expression and the background music. The action scenes are deliberately over the top. The bike scene was a bit too much but the conviction of its two male leads made it palpable.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article