Editorial

Wednesday, January 22, 2025
సంపాద‌కీయంరవి ప్రకాష్ : లెజెండ్  

రవి ప్రకాష్ : లెజెండ్  

 

తెలుగు టెలివిజన్ జర్నలిజంలో రవి ప్రకాష్ ఒక లెజెండ్. అయన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలతో తెలుపు అభినందన.

కందుకూరి రమేష్ బాబు 

తెలుగు టెలివిజన్ జర్నలిజాన్ని వేగం దూకుడుతో పాటు దానికి సంచలనాన్ని అద్దిన రవి ప్రకాష్ ఒక అద్భుతమైన విజనరీ. సవాల్ లేని వ్యక్తి. ఏక వ్యక్తి సేన.

తాను నిర్మించిన వ్యవస్థకు తాను బానిసగా మారి ఉండవచ్చు, అందులో తానే ప్రధానం అని భావించి భంగపడి ఉండవచ్చు. గెలుపోటముల పంజరంలో నానా విధాలా పోరాడుతూ ఉండవచ్చు. నలిగిపోతూ ఉండవచ్చు కూడా. కానీ తన వెన్నంటి ఒక నాడు తాను పోషించిన పాత్రికేయులు ఎవరూ లేకపోవచ్చ్చు కూడా. అయినా అయన గ్రేట్. తాను ఒక నాయకుడు.

అయన నిర్మించిన టివి 9 ఒక బ్రాండ్. అదొక అపూర్వ విజయం. అద్వితీయ విజయం. విజయవంతమైన ఆ బ్రాండ్ తర్వాత మరొకటి లేదు. ఇంకో బ్రేకింగ్ లేదు. మరో ఎన్ కౌంటర్ లేదు. అన్నిటికీ అదే మూలం.

రూపం సారంలో రవి ప్రకాష్ ఆరంభించిన పోకడ ఏదైతే ఉన్నదో దాన్నుంచి ఇతర తెలుగు న్యూస్ ఛానల్స్  ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోవడం వారి భావ దారిద్ర్యాన్నే మాత్రమే కాక అతడి ప్రత్యేకతను చాటుతున్నది.

రవి ప్రకాష్ తర్వాత రవి ప్రకాశే తప్పా మరొకరు లేరు. మరొక నవ్య పోకడ రాలేదు.

టివి 9 తర్వాత మనం ఎన్నో ఛానల్స్ చూశాం. కానీ అవేవీ సొంతదనంతో లేవు. ఇప్పటికీ వార్తల ప్రజెంటేషన్, ప్రసారం చేసే విధానంతో సహా ఏదీ మారలేదు. యాంకరింగ్, ఇంటర్వ్యూ చేసే విధానం, స్టూడియో రూప కల్పనతో అన్నీ కూడా మక్కీకి మక్కీ అక్కడి నుంచి స్ఫూర్తి పొందినవే. కాస్త అటూ ఇటూ చేసుకున్నవే గానీ స్వతంత్ర్య ధోరణితో బ్రేక్ చేసింది ఒక్కటీ లేదు.

జర్నలిస్టులు కూడా అయన ముందు ఎదిగిన వారే తప్పా వారికి సొంత ముఖం, వ్యక్తిత్వం లేదు. వార్తా చానళ్ళ టివి పోకడని వారెవరూ మార్చలేదు. అందుకే వారి వెన్నుపూస ఇంకా గాయపడలేదు. రవి ప్రకాష్ సుప్రభాతం నుంచి వెలుగుతూనే ఉన్నారు. అది మెరుగైన సమాజం కోసమా కాదా అన్నది ఇక్కడ అప్రస్తుతం.

రవి ప్రకాష్ ఓకే ఆద్యుడు అనేక విధాలా. ఆ మేరకు ఇప్పటిదాకా తెలుగు టివి జర్నలిజంలో రవి ప్రకాష్ మాత్రమే కనిపిస్తుంటాడు. మరొక ఛానల్ ఒక్క మెట్టు ఎక్కింది లేదు. దిగిందీ లేదు. కాబట్టి రవి ప్రకాష్ తర్వాత రవి ప్రకాశే తప్పా మరొకరు లేరు. మరొక నవ్య పోకడ రాలేదు. ప్రయత్నాలు కూడా అంత బలంగా లేవు. ఒక వ్యవస్థగా తన ప్రభావాన్ని దూరం చేసి అలోచించి అనుసరించే వారు రాలేదు.

భుజం వంచి ఎదుటివారి కళ్ళల్లోకి చూస్తూ చేసిన ఎన్ కౌంటర్ తర్వాత ఇంకా కొత్త మనిషి అరుదించలేదు.

అతడి ఆలోచనా ధోరణి, వ్యక్తం చేసే తీరు, భుజం వంచి ఎదుటివారి కళ్ళల్లోకి చూస్తూ చేసిన ఎన్ కౌంటర్ తర్వాత ఇంకా కొత్త మనిషి అరుదించలేదు. తనలా ఇంకొకరు రానంతవరకూ అయనే గుర్తొస్తాడు.

చిత్రమేమిటంటే, రవి ప్రకాష్ కూడా టివి 9 రవి ప్రకాష్ ను దాటలేదు. తననే తాను ఇప్పటికీ అనుసరిస్తున్నాడు. రవి ప్రకాష్ ఆ నాడు తొలి వెలుగు. నేటి తొలి వెలుగులోనూ అదే ముద్ర. అలా తాను, తెలుగు టివి జర్నలిజమూ రవి ప్రకాష్ దగ్గరే ఆగిపోవడంఫై మరోసారి మాట్లాడుకొందాం గానీ, తాను ఒక ప్రభావం అని చెబుతూ ఆ ప్రభాలశీలం ఇప్పటికీ అని చెబూతూ నేడు పుట్టినరోజు అభినందన.

నిజానికి వ్యాపార పరంగా టివి 9 తననుంచి వేరైపోవచ్చు గానీ అయన ఎక్కడికీ పోలేదు. అన్ని ఛానల్లలో ఆయనే కనిపిస్తున్నారు. దటీజ్ రవి ప్రకాష్. దటీజ్ మన భావ దారద్ర్యం కూడా.

సాహసోపేతమైన ఆ జర్నలిస్టు సోదరుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

 

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article