Editorial

Monday, December 23, 2024
కాల‌మ్‌పేరులోనూ పాలిటిక్సే! Yours Sportingly by C VENKATESH

పేరులోనూ పాలిటిక్సే! Yours Sportingly by C VENKATESH

 

మన దేశంలో ప్రతి ఫీల్డ్ పొలిటికల్ ఫీల్డే! అన్నీ పొలిటికల్ ప్లేగ్రౌండ్సే!

శ్రీనగర్ కాలనీ నుంచి బంజారా హిల్స్ వైపు మర్లుతుంటే “టర్న్ లెఫ్ట్ టు కైఫీ అజ్మీ రోడ్” అని నా ఫోన్ జీపీఎస్ చెప్పింది. అటుగా ఎన్నోసార్లు వెళ్తూనే ఉంటాను గానీ, ఆ రోడ్డుకు హైదరాబాద్ నగరంతో మంచి కనెక్షన్ ఉన్న ఆ కవిగారి పేరు పెట్టిన సంగతి నాకు తెలీనే తెలీదు. వెంటనే కైఫీ అజ్మీ రాసిన ‘వక్త్‌నే కియా క్యా హసీ సితం..’ పాట పెదాల మీదికి వచ్చేసింది. రోడ్ నంబర్ 2, 3 అని కాకుండా ప్రతి వీధికి ఇలా గొప్ప గొప్ప కళాకారులు, క్రీడాకారుల పేర్లు పెడితే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ కూడా మనసులో మెదిలింది. నెక్లెస్ రోడ్‌కి మాజీ ప్రధాని పి.వి. నరసింహా రావు గారి పేరు పెడుతున్నారట. అలానే కొన్ని రోడ్లకు క్రీడాకారుల పేర్లు పెడితే బాగుంటుంది కదా.

anil kumbhle

anilబెంగళూరులో అలాంటి సాంప్రదాయముంది. అనిల్ కుంబ్లే, ఎరాపల్లి ప్రసన్నపేర్లతో అక్కడ రోడ్లున్నాయి.

బెంగళూరులో అలాంటి సాంప్రదాయముంది. అనిల్ కుంబ్లే, ఎరాపల్లి ప్రసన్నపేర్లతో అక్కడ రోడ్లున్నాయి. బెంగళూరు ఐపిఎల్ టీమ్‌కు ఆడే సౌతాఫ్రికా ఆటగాడు ఎ.బి.డివిలియెర్స్ పేరు మీద కూడా ఒక రోడ్ అక్కడ ఉంది. అయితే ఆ రోడ్డుకు ఎ.బి.డి. పేరు పెట్టింది ఓ అభిమాని. గూగుల్ మ్యాప్స్‌లో ఎలాంటి పేరు లేని ఒక రోడ్‌ను ఎంచుకుని సదరు అభిమాని ఆ పేరు ఇరికించేశాడు. ఎక్కడో న్యూజిలాండ్‌లో కూడా గవాస్కర్, కపిల్ దేవ్ పేర్లతో రోడ్లు కనిపిస్తాయి. కానీ మన హైదరాబాద్ నగరంలో మాత్రం పొలిటీషియన్ల పేరిట చాలా రోడ్లుంటాయి కానీ, నాకు తెలిసి క్రీడాకారుల పేరున్న వీధి ఒక్కటి కూడా లేదు. బొలారం ప్రాంతం నుంచి బోలెడంతమంది ప్రఖ్యాత ఫుట్‌బాల్ ఆటగాళ్ళు వచ్చారు. ఆ వీధికి తంగరాజ్,కణ్ణన్, బలరాం లాంటి ఫుట్‌బాలర్ల పేరు పెట్టొచ్చు. మారేడ్‌పల్లిలో ఒక వీధిని ఎం.ఎల్.జయసింహ రోడ్ అంటే బాగుంటుంది.

రోడ్ల సంగతి పక్కన పెడితే, మన దేశంలో స్టేడియంలకు కూడా రాజకీయ నామాలే ఉంటాయి. హైదరాబాద్ నగరం నుంచి గులాం అహ్మద్ మొదలుకొని వీవీఎస్ లక్ష్మణ్ వరకు ఎందరో గొప్ప క్రికెటర్లున్నా, ఉప్పల్ స్టేడియంకు రాజీవ్ గాంధీ పేరు పెట్టారు.

రోడ్ల సంగతి పక్కన పెడితే, మన దేశంలో స్టేడియంలకు కూడా రాజకీయ నామాలే ఉంటాయి. హైదరాబాద్ నగరం నుంచి గులాం అహ్మద్ మొదలుకొని వీవీఎస్ లక్ష్మణ్ వరకు ఎందరో గొప్ప క్రికెటర్లున్నా, ఉప్పల్ స్టేడియంకు రాజీవ్ గాంధీ పేరు పెట్టారు. విశాఖపట్టనంలో కట్టిన క్రికెట్ స్టేడియంకు ఇండియా మొదటి క్రికెట్ కెప్టెన్ సికె నాయుడు పేరు సూచిస్తూ అప్పట్లో నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను. కానీ ఆ స్టేడియంకు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టారు. తొలి ప్రధాన మంత్రి నెహ్రూ పేరు మీద దేశంలో దాదాపు డజను క్రీడాంగణాలున్నాయి. అహ్మదాబాద్‌లో ఈ మధ్యనే కట్టిన అతి పెద్ద క్రికెట్ స్టేడియంకు గుజరాత్‌కి చెందిన గ్రేట్ క్రికెటర్ వినూ మన్కడ్ పేరు పెడితే బాగుండేది. కానీ దానికి నరేంద్ర మోదీ స్టేడియం అని నామకరణం చేశారు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంను ఇప్పుడు అరుణ్ జైట్లీ పేరుతో పిలుస్తున్నారు. హాకీ ప్లేయర్ల పేరు మీద ఉన్న ధ్యాన్ చంద్ స్టేడియం (ఢిల్లీ), కెప్టెన్ రూప్‌సింగ్ స్టేడియం (గ్వాలియర్), కెడి సింగ్ బాబు స్టేడియం (లక్నో) మినహా ఆటగాళ్ళ పేరుతో మరో క్రీడాంగణం మన దేశంలో లేనే లేదు.

మన క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం విషయంలోనూ ‘రాజకీయం’ తొంగి చూసింది. ఆ అవార్డుని ‘రాజీవ్ ఖేల్ రత్న ‘ అన్నారు. ఇలాంటి ఆవార్డుకు అమెరికాలోనైతే వారి అగ్రశ్రేణి అథ్లెట్ జెస్సీ ఒవెన్స్ పేరు పెట్టారు.

మన క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం విషయంలోనూ ‘రాజకీయం’ తొంగి చూసింది. ఆ అవార్డుని ‘రాజీవ్ ఖేల్ రత్న ‘ అన్నారు. ఇలాంటి ఆవార్డుకు అమెరికాలోనైతే వారి అగ్రశ్రేణి అథ్లెట్ జెస్సీ ఒవెన్స్ పేరు పెట్టారు. ఆస్ట్రేలియా అత్యున్నత క్రీడా పురస్కారం డాన్ ఫ్రేజర్ అనే స్విమ్మర్ పేరిట, న్యూజిలాండ్ అవార్డు హాల్‌బెర్గ్ అనే అథ్లెట్ పేరు పైన ఉన్నాయి. మన అవార్డుకు హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ పేరు పెడితే బాగుండేది. కానీ మన దేశంలో ప్రతి ఫీల్డ్ పొలిటికల్ ఫీల్డే! అన్నీ పొలిటికల్ ప్లేగ్రౌండ్సే!

తెలుగు జర్నలిజంలో క్రీడా విశ్లేషణకు గౌరవం, హుందా తెచ్చిన సీనియర్ క్రీడా పాత్రికేయులు సి.వెంకటేష్. జాతీయంగా, అంతర్జాతీయంగా టెలివిజన్ వ్యాఖ్యాతగా రాణించిన తొలితరం కామెంటేటర్ కూడా. వారు BITS AND PIECES, SECOND IINNINGS, క్రీడాభిరామం- పేరిట వ్యాసాల పుస్తకాలు వెలువరించారు. అలాగే, సికె నాయుడు ఆత్మకథ, సచిన్ పై SUCH A 100 అన్న గ్రంధాన్ని కూడా వెలువరించారు. ‘YOURS SPORTINGLY’ ప్రతివారం తెలుపు పాఠకులకు వారందించే క్రీడా స్ఫూర్తి.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article