Editorial

Thursday, November 21, 2024
కాల‌మ్‌వెలుతురు కిటికీ – సంతోషం తెలుపు

వెలుతురు కిటికీ – సంతోషం తెలుపు

‘వెలుతురు కిటికీ ‘ జీవన వికాసానికి సహజమైన ప్రవేశిక. ఈ వారం సంతోషం తెలుపు.

సిఎస్ సలీమ్ బాషా

అసలు సంతోషం అంటే ఏమిటి? ఇది చాలా కాలం నుంచి అందరిని వేధిస్తున్న ప్రశ్న. అసలు మనిషికి సంతోషం ఎలా కలుగుతుంది? దీని మీద కూడా చాలా కాలం నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి.
పనిని కాకుండా ఫలితాన్ని ఎంజాయ్ చేయాలి అనుకోవడమే సంతోషంగా ఉండకపోవడానికి ఒకానొక కారణం. సంతోషం అంటే ఒక ప్రయాణం, గమ్యం కాదు. ఈ విషయం అర్థం చేసుకుంటే సంతోషంగా ఎలా ఉండాలనేది అర్థమవుతుంది.

ఇది ‘వెలుతురు కిటికీ’ మూడో వారం కథనం. ఇందులో శ్రీ సిఎస్ సలీమ్ బాషా గదిలో ఉన్న మనకోసం అలవోకగా పక్కనే ఉన్న కిటికీ తెరిచి కొత్త గాలి ఆడేలా చేస్తారు. మంచి వెలుతురుకు స్వాగతం చెప్పేలా చూస్తారు. జీవితం అందంగా ఆనందంగా సాగిపోవడానికి కావాల్సిన అంశాలను గుర్తు చేస్తారు.

మామూలుగా క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు చాలామంది ఆటను ఎంజాయ్ చేయరు. మన దేశం గెలుస్తుందా లేదా అన్న టెన్షన్ లోనే ఉంటారు. ఆ క్రమంలో ఒక అద్భుతమైన క్యాచ్, కళ్లు చెదిరే సిక్సర్, అలవోకగా అలా బౌండరీకి చేరిన బంతి, ఇవన్నీ పెద్దగా పట్టించుకోరు. దేశం గెలిచిందా లేదా? గెలిస్తే సంబరాలు చేసుకుంటారు. ఓడిపోతే నిరాశ పడిపోతారు.

క్షణం ఆలోచిస్తే అది ఎంత అర్థరహితమైన విషయం అర్థమవుతుంది. సెహ్వాగ్ లాంటి వాడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేయకుండా, చాలామంది, సెంచరీ కొడతాడా లేదా అన్న యాంగిల్ లోని మ్యాచ్ ను చూస్తారు. జీవితం కూడా అంతే.

నేను ఇంజనీరింగ్ కాలేజ్ లో పని చేసినప్పుడు చాలా మంది పిల్లలు, చదువుతున్న క్రమాన్ని ఎంజాయ్ చేయలేక పోవడం స్వయంగా చూశాను. అది Engineering కాదు “Enjoyineering.” అని పిల్లలకు చెప్పే వాడిని.

నేను ఇంజనీరింగ్ కాలేజ్ లో పని చేసినప్పుడు చాలా మంది పిల్లలు, చదువుతున్న క్రమాన్ని ఎంజాయ్ చేయలేక పోవడం స్వయంగా చూశాను. అది Engineering కాదు “Enjoyineering.” అని పిల్లలకు చెప్పే వాడిని. అయినా సరే చాలామంది పిల్లలు టెన్షన్ తో ఉండేవాళ్ళు. వాళ్లు ఎంత సేపు, మంచి ర్యాంకు, ఆ తర్వాత క్యాంపస్ సెలక్షన్ మీద దృష్టి పెట్టే వాళ్ళు. చదువు ఎంజాయ్ చేయలేక పోయేవారు. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, వాటిని అమలులో పెట్టి ప్రయోగాలు చేసి ఎంజాయ్ చేయడం జరిగేది కాదు.

దానికి కారణం కొంతవరకూ వారి తల్లిదండ్రులు కూడా. ఎంత సేపు బాగా చదువు, మంచి మార్కులు తెచ్చుకో, మంచి ఉద్యోగం సంపాదించు, డబ్బులు కూడ పెట్టు, మంచి ఇల్లు కట్టుకో, పెళ్లి చేసుకో, పిల్లల్ని బాగా పెంచు. ఇదేనా జీవితం అంటే. తమాషా ఏంటంటే వాళ్ల పిల్లలు కూడా తర్వాత అదే ఫాలో అవుతారు. మార్కులు, ర్యాంకుల ప్రపంచంలో జీవితాలు ఇలాగే ఉంటాయి. ఎవరైనా తల్లిదండ్రులు చదువుకో, జ్ఞానాన్ని సంపాదించు, సంతోషంగా ఉండు అని చెప్తున్నారు అంటే . వాళ్ల పిల్లలు అదృష్టవంతులు. “Rich Dad-Poor Dad” అనే పుస్తక రచయిత ఈ విషయాలను చాలా చక్కగా చెప్పాడు.

జీవితంలో ఒక గమ్యం ఒక లక్ష్యం ఉండాలి అన్నది మన సమాజంలో చాలా రోజులుగా నడుస్తున్న ఒక విషయం. అయితే అందులో తప్పు లేకపోవచ్చు. కానీ గమ్యం చేరిన తర్వాతనే సంతోషంగా ఉంటామని అనుకుంటే ఎలా?

దీనికి కారణం మనలో చాలా మంది ఫలితాన్ని ఎంజాయ్ చేస్తాం. పనిని ఎంజాయ్ చేయము. ఫలితంతో సంబంధం లేకుండా సంతోషంగా పని చేస్తూ పోవడమే సంతోషంగా ఉండడం అంటే. నిజానికి ప్రతిక్షణం ప్రతి నిమిషం సంతోషంగా ఉండడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఒక రోజులో దాదాపు ఎక్కువ భాగం సంతోషంగా ఉండవచ్చు. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. జీవితంలో ఒక గమ్యం ఒక లక్ష్యం ఉండాలి అన్నది మన సమాజంలో చాలా రోజులుగా నడుస్తున్న ఒక విషయం. అయితే అందులో తప్పు లేకపోవచ్చు. కానీ గమ్యం చేరిన తర్వాతనే సంతోషంగా ఉంటామని అనుకుంటే ఎలా? అప్పుడు ప్రయాణం ఎలా ఉంటుంది.

ఒక చిన్న ఉదాహరణ చూద్దాం

చాలామంది ఉద్యోగస్తులు ఇరవై తొమ్మిది రోజులు కష్టపడి పని చేస్తారు, 30 వ రోజు కోసం! ఆ రోజు జీతం వస్తుంది! ఆ రోజు కొంచెం సంతోషంగా ఉంటారు.. ఒక్క రోజు కోసం ఇరవై తొమ్మిది రోజులు కష్టంగా, కోపంగా, చికాగ్గా, విసుగ్గా పని చేస్తారు. (అందరూ కాదనుకోండి). అలాంటివాళ్లు ఒకరోజు సంతోషంగా ఉంటారు. వాళ్లు 30 సంవత్సరాలు ఉద్యోగం చేశారు అనుకుంటే 30× 365= 10,950 రోజుల్లో 360 రోజులు మాత్రమే సంతో షంగా ఉంటారు. అంటే 10650 రోజులు వృధానే కదా? (ఇది కేవలం ఒక ఉదహరణ కోసమే.ఎక్కువ రోజులు సంతోషంగా ఉండరని చెప్పటం నా ఉద్దేశ్యం. మళ్ళీ అందరూ కూడా కాదు).

సంతోషంగా ఉండాలంటే ఏమైనా ఉండాలా?

మనం సంతోషంగా ఉండాలి అన్నది భౌతికమైన విషయాలమీద ఆధార పడ్డంతవరకూ సంతోషంగా ఉండడం సాధ్యం కాదు. సంతోషం అనేది బయట నుంచి లోపలికి వెళ్లే విషయం కాదు. అది లోపలి నుంచి బయటకు రావాల్సిన విషయం. సంతోషంగా ఉండాలి అంటే ఏదైనా ఉండాలి, అన్న కాన్సెప్ట్ వల్లనే చాలామంది సంతోషంగా ఉండలేరు.

కవి గుంటూరు శేషేంద్ర శర్మ చెప్పిన విషయం చెప్పాలనిపించింది ” ఒక్క పువ్వును చూస్తూ వందేళ్లు బతకగలను” అన్న విషయం. ఎంత సింపుల్ గా ఉందది.

ఇక్కడ కవి గుంటూరు శేషేంద్ర శర్మ చెప్పిన విషయం చెప్పాలనిపించింది ” ఒక్క పువ్వును చూస్తూ వందేళ్లు బతకగలను” అన్న విషయం. ఎంత సింపుల్ గా ఉందది.

ఏదైనా ఉంటేనే సంతోషంగా ఉండగలం అని అనుకోవడం “మన జీవితానికి మనమే లంచం ఇవ్వడం లాంటిది”.

చిన్నప్పుడు చదువుకున్న John Hay రాసిన “The enchanted Shirt” అన్న చక్కటి, అర్థవంతమైన Poem గురించి ప్రస్తావిస్తాను.

ఒక రాజు గారికి నయంకాని రోగం వచ్చింది. ఏం చేసినా అది తగ్గడం లేదు. చివరికి ” మహారాజా ఈ వ్యాధి తగ్గడానికి ఒకటే మార్గం ఉంది. ఎవరైతే నీ రాజ్యంలో సంతోషంగా ఉంటాడో వాడి చొక్కా(అంగీ) ఒకరోజు తోడుక్కుంటే నీకు నయమయ్యే అవకాశం ఉంది.” అని సెలవిచ్చాడు ఓ పెద్ద వైద్యుడు. దాంతో కొంతమంది సైనికులు రాజ్యంలో ఎవరు సంతోషం గా ఉన్నాడో వాడిని తీసుకురావడానికి బయలుదేరారు. అలా కొంచెం దూరం వెళ్ళగా ఒకడు హుషారుగా పాటలు పాడుకుంటూ కనబడ్డాడు. ” ఒరేయ్ నువ్వు సంతోషంగా ఉన్నావా?” అని అడిగారు. దానికి వాడు ” అవును” అన్నాడు. ” మా రాజు గారి కి నీ చొక్కా ఇస్తావా. ఒకరోజు తొడుక్కుని మళ్లీ నీకు ఇస్తారు”, అంటే వాడు ” భలే వాళ్ళ అయ్యా మీరు నాకు ఉన్నది ఒకటే చొక్కా. ఇది ఇస్తే నేను బాధ పడతాను” అన్నాడు.

ఒక ముసలావిడ వాళ్ళు ఎందుకు అలా కూర్చున్నారు అని అడిగితే, వాళ్లు రాజు గారి రోగం గురించి చెప్పారు. అప్పుడామె “ఆ పొలంలో ఉన్న మంచె మీద ఒకడున్నాడు. వాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు వాడిని అడగండి” అని చెప్పింది.

అప్పుడు వాళ్ళు వీడు సంతోషంగా లేడు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తరువాత అలాంటివాడు ఇంకొకడు కనబడ్డాడు. వాణ్ణి కూడా చొక్కా ఇవ్వమని అడిగారు. వాడు అదే సమాధానం చెప్పాడు. అలా సాయంత్రం వరకు తిరిగి తిరిగి అలసి పోయి ఒక చెట్టు కింద కూర్చున్నారు. అప్పుడు అదే దారిలో వెళ్తున్న ఒక ముసలావిడ వాళ్ళు ఎందుకు అలా కూర్చున్నారు అని అడిగితే, వాళ్లు రాజు గారి రోగం గురించి చెప్పారు. అప్పుడామె “ఆ పొలంలో ఉన్న మంచె మీద ఒకడున్నాడు. వాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు వాడిని అడగండి” అని చెప్పింది.

అప్పుడు మంచె దగ్గరికి వెళ్లి అందరిలాగే వాణ్ణి అడిగారు చొక్కా ఇమ్మని. దానికి వాడు “ఓస్ ఇంతేనా? చొక్కాయే కదా. తీసుకెళ్లండి” అని అన్నాడు. అలా అని కిందికి దిగాడు. వాడి ఒంటి మీద చొక్కాయే లేదు!

సంతోషంగా ఉండాలంటే చొక్కా నే కాదు ఏమీ ఉండాల్సిన అవసరం లేదు, అన్నీ ఉన్నా సంతోషంగా ఉండలేము. ఏమీ లేకున్నా సంతోషంగా ఉండొచ్చు.

ఇదే “సంతోషం” యొక్క రహస్యం!

కాలమిస్టు సలీం భాషా సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. ఉద్యోగ నైపుణ్యాల భోదకులు కూడా. వారి మొబైల్ నంబర్ 93937 37937

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article