చిన్న కథే. లఘు చిత్రమే. కానీ ఇది ప్రపంచ సినిమా. ప్రతి ఒక్కరం కుటుంబ సమేతంగా చూడవలసిన చిత్రం. ఇంటింటా స్క్రీన్ చేయవలసిన అతి పెద్ద సినిమా, ‘Domestic Peace’
కందుకూరి రమేష్ బాబు
అంతర్జాతీయంగా ప్రతి ఏటా నిర్వహించే ఇంటర్ నేషనల్ ఎమ్మి అవార్డు పురస్కారానికి గాను మన హైదరాబాద్ కు చెందిన శరత్ చంద్ర తీసిన లఘు చిత్రం అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా ఎంపికైంది. ఆ సినిమా గురించే ఈ మాట. నిజానికి ఇది షార్ట్ ఫిల్మ్. ఐనప్పటికీ దీన్ని మనం ప్యాన్ వరల్డ్ సినిమా అనాలి. ఎందుకూ అంటే, కులమతప్రాంతజాతి భేదాలు లేకుండా ప్రతి కుటుంబంలోని కథే ఈ సినిమా ఇతివృత్తం కాబట్టి.
Change begins at home…
అందరం కుటుంబ సమేతంగా కలిసి ఒక్క నిమిషం ఈ సినిమా చూడవలసిందే. నిమిషం నిడివి గల ఈ చిత్రంలో భార్యా భర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు తగువులాడటంతో సినిమా మొదలవుతుంది. వారి మధ్య మాటలు పెరుగుతాయి. అరుచుకుంటారు. చేతిలో ఏదుంటే దాన్ని విసురుకుంటారు. చేయి చేసుకునేదాకా వెళుతారు. ఫ్రేంలో ఉండే ఆ ఇద్దరి కథ ఆ ఫ్రేంలోనిదే కాదు, అందరి కథే. యే దంపతులైనా ఎప్పుడో ఒక సారి ఎదుర్కొనే సమస్యే లేదా ఎప్పుడూ ఉండే సమస్యే అనుకుందాం. ఏమైనా, నిమిషం నిడివి గల ఈ లఘు చిత్రంలో 39వ సెకండ్ దాకా వారిద్దరే గోడవపడుతారు. ఇద్దరి విషయమే అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత వారిద్దరి దృష్టి పిల్లలపై పడుతుంది. ఫ్రేంలోకి ఆ పిల్లలిద్దరూ వస్తారు. నిజానికి అప్పటిదాకా జరిగిన అ గోడవ పిల్లల ముందే జరిగింది. పిల్లలు ఫ్రేంలోకి రావడంతో వారిలో ఒక్క క్షణం ఒక ఆందోళన. కలవరం, విచారం. ఒకరి ముఖం ఒకరు చూసుకుని తప్పు చేసామన్న భావం ఇద్దరిలో కదలాడుతుంది. ఇదే ఈ చిత్రం కథ. అనంతరం ‘ఇంటి నుంచే మార్పు’ మొదలు కావాల్సిన ఆవశ్యకతను చెప్పే మాటలు తెరమీద ప్రత్యక్షం అవుతాయి. ‘మీ పిల్లలు మిమ్మల్ని సన్నిహితంగా గమనిస్తున్నారు. భావితరం మిమ్మల్ని గమనిస్తున్నది’ అన్న అంశం అక్షరాల్లో చెబుతారు. ‘తర్వాతి తరానికి ప్రశాంతమైన జీవితం ఇవ్వండి’ అన్న సందేశం ఉంటుంది అందులో.
ఈవే ఆ వాక్యాలు: Change begins at home. The next generations are watching. Show them Peace. ఇదే ఆ సినిమా ఇతివృత్తం.
కాగా, చిత్రంలో భార్యాభర్తలుగా సంఘవి, మోహన్ దండోత్కర్ లు, పిల్లలుగా రాజేష్, తేజస్వినిలు నటించగా సాయి వంశీ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
ఇంత చిన్న సందేశం ఇవ్వడానికి గానూ ఆ లఘు చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా శాంతికై, ఆ శాంతిని నెలకొలిపే సంభాషణ నేరపాలన్న సదుద్దేశంతో నిర్వహించిన ఈ చిత్రోత్సవంలో దాదాపు ఇరవై ఏడువేల ఎంట్రీలు రాగా ఈ చిత్రం మూడింటిలో ఒకటిగా నిలవడం విశేషం.
ఇరవై ఏడు వేల ఎంట్రీల్లో…
ఇంత చిన్న సందేశం ఇవ్వడానికి గానూ ఆ లఘు చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా శాంతికై, ఆ శాంతిని నెలకొలిపే సంభాషణ నేరపాలన్న సదుద్దేశంతో నిర్వహించిన ఈ అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఈ చిత్రం నిమిషం కేటగిరిలో JCSI YOUNG CREATIVES AWARDను గెలుచుకుంది. దాదాపు ఇరవై ఏడువేల ఎంట్రీలు రాగా అందులో పబ్లిక్ ఓటింగ్ ఆ తర్వాత జ్యూరి ఎంపికలో ఈ చిత్రం మూడింటిలో ఒకటిగా నిలవడం విశేషం.
ఇతివృత్తమే చిత్రం…
శరత్ చంద్ర తీసిన ఈ షార్ట్ ఫిలింలో ఇతివృత్తమే హీరో. పెద్ద సాంకేతికత లేదు. గొప్ప నటనా వైదుష్యం లేదు. సంభాషణలు అసలే లేవు. ఉన్నదల్లా ఒక సందేశం. అది పిల్లల కళ్ళ ముందు పెద్దలను దోషిగా నిలిపిన దర్శకత్వ ప్రతిభ.
ఇదంతా పిల్లలు, పెద్దలూ కూడిన ఒక కుటుంబ చిత్రం కావడం విశేషం. ‘శాంతి’ కోసం, ఒక అవశ్యమైన సంభాషణ కోసం ఈ వారంలో జరిగిన ఒక తెరవెనుక కథ కూడా.
తెరవెనుక హీరో కేటీఆర్ : Show them Peace.
దర్శకుడికి సంభందించి ఒక విశేషం చెప్పాలి. శరత్ చంద్ర తీసిన ఈ లఘు చిత్రం జ్యూరీ అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా ఎంపిక చేశాక తాను పురస్కారం స్వీకరించడానికి అమెరికాకు ఆహ్వానించారు. సమయం ఎక్కువ లేదు. వీజా సమస్య ఎదురైంది. ఆ సమయంలో దక్కన్ క్రానికల్ పాత్రికేయుడు అడవి శశిధర్ ఈ అంశం వార్తగా రాస్తూ మంత్రి కేటిఅర్ కి ట్వీట్ చేయడం, మంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని ఎంబసీ బాధ్యులు జోయెల్ రెఫ్ మెన్ కి సమాచారం ఇస్తూ ట్యాగ్ చేయడం, వీసా ఆఘమేఘాల మీదా వచ్చేలా కృషి
చేయడం, శరత్ చంద్ర వెళ్లి స్వయంగా పురస్కారం స్వీకరించడం, మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చి, ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి గానూ తమ స్వస్థలమైన విశాఖ వెళ్ళడం, అక్కడ ఒక ఊరేగింపుగా బంధుమిత్రులు ఇంటికి సాదరంగా తీసుకువెల్లడం – ఇదంతా పిల్లలు, పెద్దలూ కూడిన ఒక కుటుంబ చిత్రం కావడం విశేషం. ‘శాంతి’ కోసం, ఒక అవశ్యమైన సంభాషణ కోసం ఈ వారంలో జరిగిన ఒక తెరవెనుక కథ కూడా.
ముందు చెప్పినట్టు ఇది చిన్న చిత్రం. అతి పెద్ద ప్యాన్ వరల్డ్ మూవీ. ప్రతి కుటుంబం ఇంట్లో ఒక నిమిషం స్క్రీన్ చేసుకొని చూడాల్సిన చిత్రం.
ఏమైనా, ముందు చెప్పినట్టు ఇది చిన్న చిత్రం. అతి పెద్ద ప్యాన్ వరల్డ్ మూవీ. ప్రతి కుటుంబం ఇంట్లో ఒక నిమిషం స్క్రీన్ చేసుకొని చూడాల్సిన చిత్రం. మరి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలుపు…