Editorial

Wednesday, January 22, 2025
అభిప్రాయంఎనుముల రేవంత్ రెడ్డి : మిస్టర్ యాడ్స్ ... మిస్టర్ రేవంత్ రెడ్డి

ఎనుముల రేవంత్ రెడ్డి : మిస్టర్ యాడ్స్ … మిస్టర్ రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ అంటేనే హిందూ మహా సముద్రం. అందులో పడి కూడా తన ఉనికిని తాను నిలబెట్టుకోవడం, మహామహులను ఎదిరించి అధ్యక్ష పదవిని దక్కించుకోవటం మాటలు కాదు.

శ్రీనివాస్ సత్తూరు

పిసిసి అధ్యక్ష పదవి తనను వరించడం వాస్తవానికి మానవ మాత్రులు ఊహించని సంఘటన. అంతర్గత కుమ్ములాటలు, సమన్వయ లేమి, అసంతృప్తులకు నిలయమైన కాంగ్రెస్ రాజకేయాలు తెలిసిన వారికీ ఇది నిజంగానే నమ్మకశక్యం గాని అంశం.

ఒక సాదా సీదా ఆర్టిస్టుగా జీవితం మొదలు పెట్టి సమాచార వ్యవస్థను అవపోసన పట్టి, యువతరాని ఆదర్శంగా నిలుస్తూ, కుట్రలు కుతంత్రాలతో సాగే ఫక్తు రాజకీయ క్రీడల్లో నెగ్గుకువస్తూ నేడు రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టే దాకా ఎదగడం అన్నది అయన పట్టుదలకు, సమర్థతకు నిదర్శనం.

నేడున్న స్థితిలో కాంగ్రెస్ అద్భుత విజయాలు సాధిస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. కానీ, అతడు పదవిని అధిష్టించడం ఒక రకంగా ముందస్తుగానే విజయ పతాకం ఎగురవేసినట్లు అనుకోవాలి.

నేడున్న స్థితిలో కాంగ్రెస్ అద్భుత విజయాలు సాధిస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. కానీ, అతడు పదవిని అధిష్టించడం ఒక రకంగా ముందస్తుగానే విజయ పతాకం ఎగురవేసినట్లు అనుకోవాలి.

కేసీఆర్ అంటే మహాశక్తి. ఎవరూ డీ కొనడానికి కూడా సాహసించని స్థితి. అలాంటిది ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నాడు ఇంతటి స్థాయికి రావడం అంటే నిజానికి అందుకు పరోక్షంగా దోహదపడిన కేసీఆర్ గారికి కూడా రేవంత్ కృతజ్ఞతలు చెప్పుకోవాలి.

హనుమంతుడికి తన శక్తి ఏ పాటిదో తేలియనట్లే, కేసీఆర్ కారణంగా రేవంత్ రెడ్డి గారి శక్తి వెలికి వచ్చి తానేమిటో నిరూపించుకునే అవకాశం వచ్చినట్టయింది. ఐతే, కాంగ్రెస్ రథ సారథిగా నియమితులైతే గనుక ముందు మున్దూ కేసీఆర్ ప్రభుత్వం కేసులు తిరిగ దొడితే ఎట్లా అన్న శంక కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించింది అన్న వార్తలు వచ్చాయి. ఐతే, అవన్నీ ఉన్నా కూడా రేవంత్ ను ఎంపిక చేయడం అంటే ఈ పాలమూరు బిడ్డ పోరాట సరళికి మొగ్గు చూపినట్లే.

శ్రీనివాస్ సత్తూరు సీనియర్ జర్నలిస్టు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండల విలేకరి. తాను పత్రికలు మారుతారు గానీ రాజీపడి  పని మానుకోరు. ఎక్కడున్నా నిర్భయంగా రాసే కలం ఆయనది. స్థానిక ప్రజల మెప్పు, రాజకీయ నేతలకు కంటగింపు అయన సరళి. అలుపెరగని ఈ కలం యోధుడి అభిప్రాయం నూతన కాగ్రెస్ రథ సారథి రేవంత్ రెడ్డి వ్యక్తిత్వాన్ని, అతడి మరో పార్శ్వాన్ని రేఖా మాత్రంగా తెలుపుతుంది.

ఒక చిత్రకారుడు, కమ్యూనికేషన్ రంగం లోతుపాతులు ఎరిగిన దిట్ట… అనుకోకుండా ఉద్యమ పార్టీ తెరాసలో పనిచేయటం… అనంతరం మిడ్జిల్ మండలం జెడ్పీటీసీగా తన ప్రస్థానం ప్రారంభించడం, తర్వాత తెదేపాలో తన స్థానాన్ని పదిలం చేసుకోవటం… తెలంగాణ ఏర్పాటు అనంతరం తెదేపా నుంచి మహామహులు ఉన్న కాంగ్రెస్ లోకి రావటం… ఉద్దండులైన వీహెచ్, జీవన్ రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ రెడ్డి లాంటి అతిరథ మహారథులను ఎదుర్కొని అన్నీ తనకు అనుకూలంగా మార్చుకుని కాంగ్రెస్ రథ సారథిగా తనను నియమితులయ్యేలా చెసుకోవడం అంత ఆశామాషీ విషయం కాదు.

వాస్తవానికి తనకున్న తెంపరితనం. నిర్భయత్వం, ఉద్యమ నాయకులు కేసీఆర్ గారితో ప్రతీ విషయంలో, ప్రతీ సందర్భంగా మాటల తూటాలతో ఎదుర్కోనే చేవ – ఇవన్నీ కూడా తనకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక ఫాలోయింగ్ ని తెచ్చాయి. కాగా, ఇప్పుడు లభించిన ఈ పదవి అతడి భవిష్యత్ కార్యాచరణకు మరింత వన్నె తేవడం ఖాయం.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో లేదో అన్నది ద్వితీయం. ప్రస్తుతానికి కృంగి కూనారిల్లిన ఆ పార్టీకి తిరిగి జవసత్వాలు అందడానికి తాను ఉపకరిస్తాడు అనడంలో ఎవరికీ సందేహం లేదు. సీనియర్లు అసంతృప్తి తో ఉన్నారన్నది నిజమే గానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యావత్తుకు సంతృప్తికరమైన సమాధానం రేవంత్ అన్నదే తేలిపోయింది.

గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్, ఆ తర్వాత నుంచి రాష్ట్ర రాజకీయాలకు సంభంధించి మరో సాహసోపేతమైన నిర్ణయం ఏదైనా తీసుకున్నదీ అంటే అది రేవంత్ కు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడమే.

నిజానికి రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ నావ తెలంగాణలో ఈదుతుందా లేదో తెలియదు కానీ పిసిసి పదవిని అలంకరించడంతో కాంగ్రెస్ అభిమానులే కాదు, సామాన్య పౌరులకు కూడా కొంత ఆశ కలుగుతోంది. ప్రశ్నించే గొంతులు నిలదొక్కుకోవడం నేటి తరుణంలో ఎంతో అవసరం. అ రకంగా ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో సానుకూల ప్రభావమే కలిగిస్తుంది.

ఈ సమయంలో ఒక సామాన్యుడు ఒక పార్టీ అత్యున్నత స్థాయిలో పని చేసే అవకాశం చేజిక్కించుకోవడం అనేక విధాలా మంచి సంకేతాలు ఇస్తుంది. అది తాను పుట్టి పెరిగిన పాలమూరు ప్రజలకు కూడా ఎంతో గర్వకారణంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా నాకు వ్యక్తి గతంగా మంచి ఆత్మీయ సోదరుడు… మా ‘మిస్టర్ యాడ్స్ రేవంత్ రెడ్డి’ అని పిలుచుకునే అన్న గురించి ఒకట్రెండు ముచ్చట్లు చెప్పాలి.

విశేషం ఏమిటంటే, ఈ ప్రపంచం మొత్తం ద్వేషించినా మనల్ని ప్రేమించే వారు కూడా అంతే స్థాయిలో ఉంటారని నమ్ముతాడు అయన. మంచి చెడులను పక్కన పెడితే సాధ్యాసాధ్యాలను పక్కన ఉంచితే ఈ భూప్రపంచంలో కమ్యూనికేషన్ అనే ఆయుధానికి మించింది ఏదీ లేదన్నది కూడా రేవంత్ రెడ్డి గట్టిగా విశ్వసించే మరో మంచి విషయం. అక్కడి నుంచే తాను మొదలవడం కూడా ఆయనకు కలిసి వచ్చిందనే చెప్పాలి.

జెఎన్ టి యూ ఫైన్ ఆర్ట్స్ ఎంట్రన్స్ కోసం హైదరాబాద్ మొదటిసారి వెళ్లినప్పుడు విక్రమ్ అన్న రెఫరెన్స్ పై నారాయణ గూడ లో మిస్టర్ యాడ్స్ కార్యాలయానికి వెళ్లాను. అక్కడ రేవంత్ రెడ్డి అన్నను కలిసాను.

ఒక సాదా సీదా వ్యక్తి తాను. చెడ్డగా అనుకునే వారికి చెడుగా మంచిగా అనుకునే వారికి మంచిగా… మెత్తానికి ఒక క్రేజీ స్పోక్స్ మన్ గా… ఒక క్రేజీ లీడర్ గా తాను రానున్న ఎన్నికల్లో అసలు కేసీఆర్ హవాలో ఉనికిని నిలబెట్టుకున్న ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి. ఇది విమర్శకులు సైతం అంగీకరించే నిజం.

నేను ఇంటర్ వనపర్తిలో చదివేవాడిని. రూము కిరాయి కోసం, తిండి కోసం విక్రమ్ ఆర్ట్స్ రమేష్ అన్ తో ఖాళీ టైమ్ లో పనిచేసే వాడిని. అదే సైకిల్ చైన్ ప్లేట్ పై పేర్లు రాసి ఫ్లోరోసెంట్ పౌడర్ అద్దితే ఐదురూపాయలు వచ్చేవి. అందులో అన్న నాకు రెండు రూపాయలు ఇచ్చేవాడు. బాటనీ రికార్డులకు బొమ్మలేసి, బట్ట బ్యానర్లు రాసి వచ్చిన డబ్బుతో రూం ఖర్చు ఎల్లగొట్టేవాడిని. సాయంత్రం దర్జాగా ఢిల్లీ వాలా లో రెండు రూపాయలతో టీ తాగడం ఒక హాబీ.

దాదాపు ఖాళీ గా ఉన్నావు. జీతం ఎట్లా?’ అన్నారు. ‘స్కీన్ ప్రింటింగ్ నేర్చుకో’ అని తానే సలహా ఇచ్చారు. ఇవ్వడమే కాదు, తన యూనిట్ ఒకటి బర్కత్ పురాలో ఉంది అంటూ అక్కడికి తనే స్వయంగా తీసుకెళ్లి, ఆ రోజునే ఫైవ్ స్టార్ ఫిలింపై ఎట్లా ఎక్స్పోజ్ చేయాలో నేర్పించారు.

జెఎన్ టి యూ ఫైన్ ఆర్ట్స్ ఎంట్రన్స్ కోసం హైదరాబాద్ మొదటిసారి వెళ్లినప్పుడు విక్రమ్ అన్న రెఫరెన్స్ పై నారాయణ గూడ లో మిస్టర్ యాడ్స్ కార్యాలయానికి వెళ్లాను. అక్కడ రేవంత్ రెడ్డి అన్నను కలిసాను. ఆయన సోదరుడు చంద్రకాంత్ అనుకుంటా. అతడికి మాట వరసకు చెప్పడం కాదు, నన్ను తన రేంజర్ సైకిల్ పై మాసాబ్ టాంక్ దగ్గర ఖాజా మెన్షన్ లో ఎక్సామ్ రాయించి, తిరిగి నారాయణ గూడలో బస్సు ఎక్కించేదాక రేవంత్ రెడ్డి చూసుకోవడం మరచిపోలేను.

బతుకు దెరువు కోసం పట్నంల ఓ లెఫ్ట్ వింగ్ పత్రికలో లే అవుట్ ఆర్టిస్టు గా చేరాను. అప్పుడే మాక్ సిస్టమ్ లు పబ్లికేషన్స్ లో ప్రారంభమయ్యాయి. లే అవుట్ వదిలి ఆడ్స్ డిజైన్ చేయటం మొదలెట్టాను. ‘స్థిరంగా ఉద్యోగం లేదు. దాదాపు ఖాళీ గా ఉన్నావు. జీతం ఎట్లా?’ అన్నారు. ‘స్కీన్ ప్రింటింగ్ నేర్చుకో’ అని తానే సలహా ఇచ్చారు. ఇవ్వడమే కాదు, తన యూనిట్ ఒకటి బర్కత్ పురాలో ఉంది అంటూ అక్కడికి తనే స్వయంగా తీసుకెళ్లి, ‘ఇతడు మన తమ్ముడు…తొందరగా నేర్పాలి’ అని చెప్పి ఆ రోజునే ఫైవ్ స్టార్ ఫిలింపై ఎట్లా ఎక్స్పోజ్ చేయాలో నేర్పించారు. ఇక ప్రింటింగ్ నా సొంత ప్రయోగం. అది వేరే విషయం.

అందుకే ఇలా అంటాను, పాలమూరును అమితంగా ప్రేమించే రేవంత్ నాకు తెలుసు. హైదరాబాద్ కు వచ్చిన అన్నార్థులను ఆదుకునే రేవంత్ నాకు తెలుసు. ఎప్పుడూ కమ్యూనికేషన్ వ్యవస్థను సవ్యంగా ఎలా ఉపయో గించుకోవాలో ఆలోచించే రేవంత్ తెలుసు.

తర్వాత కాలంలో చాలా సార్లు బ్రోచర్ డిజైన్ చేసి ప్రింటింగ్ కోసం తన దగ్గరకు వెళ్ళే వాడిని. ఎప్పుడు వెళ్ళినా అదే ఆదరణ. అతడు మారలేదు. ఎదిగినా ఒదిగి ఉండటం చూశాను. నేనే కాదు, ఎందరో చెప్పేమాట ఇది.

అందుకే ఇలా అంటాను, పాలమూరును అమితంగా ప్రేమించే రేవంత్ నాకు తెలుసు. హైదరాబాద్ కు వచ్చిన అన్నార్థులను ఆదుకునే రేవంత్ నాకు తెలుసు. ఎప్పుడూ కమ్యూనికేషన్ వ్యవస్థను సవ్యంగా ఎలా ఉపయో గించుకోవాలో ఆలోచించే రేవంత్ తెలుసు. పది మందికి ఎలా ఉపాధి కల్పించాలని పరితపించే రేవంత్ నాకు తెలుసు. అప్పట్లో హైదరాబాద్ లో ఎల్లో పేజెస్ హవా నడుస్తోంది అందులోనూ టాప్ లోనే మిస్టర్ యాడ్స్ ఉండేది. అప్పటి మిస్టర్ యాడ్స్ …మిస్టర్ రేవంత్ రెడ్డి అంటే నాకు ప్రాణం. నేడు నూతన బాధ్యత వరించిన సందర్భంలో అదే ఒరవడిలో, అదే సరళితో ప్రజలతో మమేకమై అన్న ముందుకు సాగాలని కోరుకుంటూ వారికి హృదయపూర్వక అభినందనలు, ఆత్మీయ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

 

 

More articles

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article