Editorial

Wednesday, January 22, 2025
Song'శెభాష్......బీమల నాయక' : పద్మశ్రీ మొగిలయ్యకు అభినందనలు తెలుపు

‘శెభాష్……బీమల నాయక’ : పద్మశ్రీ మొగిలయ్యకు అభినందనలు తెలుపు

సహజంగానే మొగిలయ్య గొంతు ఒక మాధ్యమం. అది అడుగు ప్రజలది. అనాది లోతుల్లోంచి పెగులుతుంది. వేదనను చెదరగొడుతూ దుఖాన్ని దూరం చేస్తూ ఒక వీరుడి రాకను ప్రకటిస్తుంది. బీమ్లా నాయక్ పరిచయానికి మొగిలయ్యను సాధనం చేసుకోవడం సినిమాకు పెద్ద అసెట్. అంతేకాదు, ఆయనిప్పుడు పద్మశ్రీ.

కందుకూరి రమేష్ బాబు 
“తెలంగాణ వస్తే ఏమొస్తది… పన్నెండు మెట్ల కిన్నెర మొగులయ్య కూడా పవణ్ కల్యాణ్ సినిమాలో పాట పాడుతూ కనిపిస్తడు” అంటూ ప్రముఖ సినీ పాత్రికేయులు చల్లా శ్రీనివాస్ గారు ఉదయం సామాజిక మాధ్యమయమైన ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు చూశాక ‘బీమ్లా నాయక్ ‘ టైటిల్ సాంగ్ పాడింది ఎవరో చాలా మంది దృష్టిలో పడింది.

సెభాష్‌.. ఆడాగాదు… ఈడాగాదు …అమీరోళ్ల మేడాగాదు’ అంటూ సాగే ఈ గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రాయగా జానపద కళాకారుడు మొగిలయ్య దాదాపు సగం వరకూ అద్భుతంగా గానం చేశారు. ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఈ పాటను టైటిల్ సాంగ్ గా రిలీజ్ చేయడం, అది అప్పుడే లక్షల వ్యూస్ సొంతం చేసుకొవడం విశేషం.

చిత్రమేమిటంటే పవన్ కళ్యాన్ ఒక అనిర్వచనీయమైన వ్యక్తి. అతడేమిటో విశ్లేషించవద్దు. అతడొక ఎనిగ్మా. సదా పౌరుశాన్ని కోరుకునే ఒక కామన్ మ్యాన్ ప్రొటెక్షన్. అది ఇంకా నీరుగారక పోవడం గమ్మత్తే. తన ఎనర్జీ రోజు రోజుకూ విస్తరించడంలో ఎన్నో ప్రతీకలు జత కూడినై. దాదాపు అన్నీ స్పూర్తివంతమైన ప్రేరణలే. ఇప్పుడు బీమ్లా నాయక్ కు కిన్నెర మెట్ల మొగిలయ్య తోడయ్యాడు. అతడొక అదృష్టవంతుడు. పుట్టినరోజు అభినందనలు.

తన ఇమేజీకి మరికొన్ని మెట్లు తోడయ్యాయి…

కిన్నెర మెట్ల మొగిలయ్య దక్కనీ ప్రాంతంలో పురాతన వాయిద్యమైన పన్నెండు మెట్ల కిన్నెరను వాయిస్తారు. సాధారణంగా ఈ వాయిద్యంతో జాంబ పురాణం మొదలు స్థానిక జానపద వీరుల గాథలనెన్నో  చెబుతారు. అటువంటి వాయిద్యంతో, అదీనూ మొగిలయ్యతో ‘బీమ్లా నాయక్’ గురించి  పాట రూపంలో సినిమా కథను ఉపోద్గాతంగా చెప్పించడం అన్నది పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజీకి మరి కొన్ని మెట్లు జత కూడాయని చెప్పొచ్చు. ఈ ప్రయోగం చూస్తుండగానే బాగానే సక్సెస్ అయింది. పాటకు వ్యూస్ ఎట్లా పెరుగుతున్నాయో చూడండి.
పవన కళ్యాన్ సంగతి సరే. మొగిలయ్య కూడా రస్టిక్ గా ఉంటాడు. నిజానికి అయన లుక్స్ ఒక హీరోను ప్రవేశ పెట్టేందుకు తగ్గట్టే ఉంటాయి. ఒక వీరోచిత గాథ చెప్పే కళాకారుడిగా మొగిలయ్య ప్రజలకు తెలుసు. అయన గొంతులో కిన్నెరతో ఈ ప్రయోగం నిజానికి లోతైన అంశం. సహజంగానే మొగిలయ్య గొంతు ఒక మాధ్యమం. అది అడుగు ప్రజలది. అనాది లోతుల్లోంచి పెగులుతుంది. వేదనను చెదరగొడుతూ దుఖాన్ని దూరం చేస్తూ ఒక వీరుడి రాకను ప్రకటిస్తుంది. బీమ్లా నాయక్ పరిచయానికి మొగిలయ్య పాట పెద్ద అసెట్.
మొగిలయ్య నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట నివాసి. ఏడు మెట్ల కిన్నెర స్థానంలో  పన్నెండు మెట్ల కిన్నెరను తాయారు చెసుకున్న అరుదైన సృజనశీలి. ఈ కళాకారుడు ఆ వాయిద్యంతో పాటూ తానూ అంతర్జాతీయ పేరొంది సామాన్యంగా పొట్ట పోసుకుని జీవిస్తున్డటం ఒక వాస్తవం. తన ఉనికిని చాటి మరొక అడుగు వేసే స్థితిలో ఉన్న కళాకారుల్లో తానొకరు. అలనాటి వీరగాథలు పాడటం తన జీవితం. పండుగ సాయన్న గురించి చెప్పినట్టే నేడు బీమ్లా నాయక్ గురించి చెప్పాడు.

తెలంగాణా రాష్ట్రం వస్తే, అది నిజంగా బలంగా సాకారమైతే, నిజానికి మొగిలయ్య నిజ జీవిత గాథలు సినిమాగా రావాలి. వాటిని పవన్ కళ్యాన్ వంటి వాళ్ళు పోషించే రోజులు రావాలి. అది వేరే కథ అనుకోండి.

గమ్మత్తేమిటంటే, ఇక్కడ బీమ్లా నాయక్ గురించి మొగిలయ్య పాడుతూ కవి రామజోగయ్య శాస్త్రి రాసినట్టు కాక తనదైన తీరులో ‘శెభాష్……బీమల నాయక’ అంటూ పాడటం మరింత బాగున్నది. అలా తన ఇమేజీ ని పవన్ కళ్యాణ్ సినిమాకు వాడుకోవడం కమర్షియల్ గా ‘సెభాష్’ అనే చెప్పాలి. కాకపోతే, తెలంగాణా రాష్ట్రం వస్తే, అది నిజంగా బలంగా సాకారమైతే, నిజానికి మొగిలయ్య నిజ జీవిత గాథలు సినిమాగా రావాలి. వాటిని పవన్ కళ్యాన్ వంటి వాళ్ళు పోషించే రోజులు రావాలి. అది వేరే కథ అనుకోండి.
ఇక మళ్ళీ ఈ సినిమా విషయానికి వస్తే, కాగా, మాండలికాలతో ప్రేక్షకులను ఆకర్షించడంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లు దిట్ట అని మనకు తెలుసు. శ్రీకాకుళం యాసలో ‘ఖుషీ’ సినిమాలో పవన్ పాడిన పాట గానీ, ఇటీవల ‘అల వైకుంఠపురంలో’ థమన్ తో రాబట్టుకున్న సంగీతం గానీ ప్రేక్షకులకు మరచిపోలేరు. దానికి తోడు ఈ సినిమాకు తెలంగాణా దర్శకుడు సాగర్ కే చంద్ర తోడవడం, అతడు ఏకంగా మొగిలయ్యతో టైటిల్ సాంగ్ పాడించడం మరో మెట్టు ఎక్కినట్టే చెప్పాలి.

సాగర్ కే చంద్ర అందమైన మనిషి. చారిత్రిక స్పృహ ఉన్న దర్శకులు. దేశీయ జీవితం, చరిత్ర, సంగీతం కళలపై పట్టున్న ఈ దర్శకుడు తన మొదటి పెద్ద సినిమాకు మొగిలయ్యతో ఈ టైటిల్ సాంగ్ పాడించడం అన్నది ఒక స్పృహతో జరిగిన ప్రయత్నమే అనుకోవాలి. అందుకు అభినందనలు.

చారిత్రిక స్పృహతో అడుగులు

సాగర్ కే చంద్ర అందమైన మనిషి. చారిత్రిక స్పృహ ఉన్న దర్శకులు. విదేశాల్లో సినిమా నిర్మాణం గురించి చదువుకున్న వారు. పరిమితుల మధ్య సినిమా మాధ్యమాన్ని శక్తివంతంగా వాడుకునే నేర్పు ఉన్న నేటితరం యువక. ‘అయ్యారే’ తర్వాత తాను తీసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ గంభీరమైన చిత్రం. అది గతాన్ని, వర్తమానాన్ని సమ్మిళితం చేసి తీసిన పీరియాడిక్ ఫిలిం. దాన్ని క్రికెట్ నేపథ్యంగా రూపొందడం విశేషం. కాగా, దేశీయ జీవితం, చరిత్ర, సంగీతం కళలపై పట్టున్న ఈ దర్శకుడు తన మొదటి పెద్ద సినిమాకు మొగిలయ్యతో ఈ టైటిల్ సాంగ్ పాడించడం అన్నది ఒక స్పృహతో జరిగిన ప్రయత్నమే అనుకోవాలి. అందుకు అభినందనలు.

ఈ సినిమాకు ఒక ఆదివాసీ ఆత్మను, తమ కోసం పోరాడే వాడి చరితను ఆర్తిగా చెప్పే మొగిలయ్య వంటి కళాకారుడిని జోడించే ప్రయత్నం బాగున్నది.

నిజానికి దర్శకుడు ఈ సినిమాను మలయాళం నుంచి రీమేక్ చేస్తున్నప్పటికీ ఈ సినిమా తనకు ఒరిజినల్ గా పెద్ద సవాల్.  ఇమేజీలో పట్టని పవణ్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేయడమే కాదు, మాటలు రాస్తూ స్క్రీన్ ప్లే కూడా ఇస్తున్న త్రివిక్రం ను భరించాలి. అలాగే భవిష్యత్తులో తన సత్తా చాటడానికి, తన ప్రతిభ పాన్ ఇండియా డైరెక్టర్ గా నమోదు కావడానికి వీలుగా ఆయన ఈ  సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలి. అందుకు అందరి సహకారంతో, లోప్రోఫిల్ తో పని చేసుకుంటూనూ ‘ఎవరీ దర్శకుడు?’ అనిపించాలి. అందుకే సినిమా ఒక ప్రత్యేక ముద్ర వేయడంలో భాగంగా ఏకంగా ఈ సినిమా టైటిల్ సాంగ్ మొగిలయ్యతో పాడిపించడం మరో  విశేషం. అట్లా ఈ సినిమాకు ఒక ఆదివాసీ ఆత్మను, తమ కోసం పోరాడే వాడి చరితను ఆర్తిగా చెప్పే మొగిలయ్య వంటి కళాకారుడిని జోడించే ప్రయత్నం బాగున్నది.

అంతేకాదు, ఈ సినిమాలో పవన్ కళ్యాన్ ని ‘నాయక్’ గా చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. పేరుకు తగ్గట్టే ‘బీమ్లానాయక్’ సినిమాలో ‘నాయక్’ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న నల్లమల, ఆదిలాబాద్, ఖమ్మం ఆచార, వ్యవహారాలు, సంస్కృతులు వేషభాషలతో కూడిన అంశాలు జత చేస్తున్నట్టు వినికిడి. ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే సినిమా కాబట్టి ఆ వివరాలన్నీ ముందుముందు తీరిగ్గా తెలుస్తాయి గానీ, నేడు విడుదలైన పాటను బట్టి, ఆ పాట పాడిన మొగిలయ్య ను బట్టి, ఒక జానపద వీరుడి గాథను పోలిన ఆధునిక గాథగా అయ్యప్ప కోశియమ్ ను నిర్మిస్తున్నట్టు, తెలుగు ప్రేక్షకుల కోసం, పవణ్ కళ్యాన్ ఫ్యాన్స్ కు తగ్గట్టు మలిచినట్లుగా తెలుస్తోంది. కాబట్టే సాగర్ ని అభినందిస్తూ మొగిలయ్యను చూడండి…వినండి  అని తెలుపడం.

కిన్నెర మెట్ల మొగిలయ్య ను చూడటం ఆనందం

అంతరించిపోతున్న వాయిద్యానికీ కాదు, స్థానిక చరిత్రను ఘనంగా పాడి చెప్పే మనుషులకే రోజులు కాని స్థితిలో మొగిలయ్య కొన్నేళ్ళ క్రితం మళ్ళీ పునరావృతమయ్యాడు. ఒకప్పుడు స్థానిక గాథలను, వీరుల గాథలను చెప్పే డక్కలి కులస్థుల సాంస్కృతిక వ్యాపకం ఇప్పుడు లేకుండా పోయింది.  ఐతే, మొగిలయ్య అటువంటి చారిత్రక పాత్రకు ప్రతీక. అయన మళ్ళీ కనపడటం అన్నది, సినిమాలో అలా కొన్ని క్షణాలైనా అది ఒక యాది. అయన గొంతులో వినిపించే పాట ఏదైనా ఒక ఉత్తేజమే. ఈ పాట సైతం మొగిలయ్య గొంతులో సరికొత్త అనుభూతిని పంచుతోంది. ఇంకా తనతో ఏమేమి చేపించవచ్చో స్పూర్తిని ఇస్తుంది. ఏమైనా, తనతో తమన్ సంగీత దర్శకత్వం జతకూడి ఈ మొత్తం పాట రెండు భాగాలుగా మారిన వైనం ఒక కొత్త స్పృహకు నిదర్శనం. అటు జానపదాన్ని ఇటు ఆధునికతను మిక్స్ చేయగా మొదటి భాగంలో మొగిలయ్యని వినడం మొత్తంగా  అటు అయన అభిమానులకు ఆనందం, పవన్ కళ్యాన్ అభిమానులకు గొప్ప పండుగ అనే చెప్పాలి.

రామజోగయ్య శాస్త్రి రాసిన పూర్తి పాట ఇక్కడ చదవండి.

సెభాష్
ఆడాగాదు ఈడాగాదు
అమీరోళ్ల మేడాగాదు
గుర్రంనిల్లా గుట్టాకాడ
అలుగూ వాగు తాండాలోన
బెమ్మాజెముడు చెట్టున్నాది
బెమ్మజెముడూ చెట్టుకింద
అమ్మా నెప్పులు పడతన్నాది
ఎండాలేదు రేతిరిగాదు
ఏగూసుక్కా పొడవంగానే
పుట్టిండాడు పులిపిల్ల
పుట్టిండాడు పులిపిల్ల
నల్లామల తాలూకాల
అమ్మా పేరు మీరాబాయి
నాయన పేరు సోమల గండు
నాయన పేరు సొమల గండు
తాతా పేరు బహద్దూర్
ముత్తులతాత ఈర్యానాయక్
పెట్టిన పేరు భీమ్లానాయక్
సెభాష్ భీమ్లానాయకా
భీమ్లానాయక్
ఇరగదీనే ఈడి ఫైరు సల్లగుండ
ఖాకీ డ్రెస్సు పక్కనెడితే వీడే పెద్దగూండా
నిమ్మళంగ కనబడే నిప్పుకొండ
ముట్టుకుంటే తాట లేసిపోద్ది తప్పకుండా
ఇస్తిరి నలగని చొక్కా పొగరుగ తిరిగే తిక్క
చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్కా ఎరుగును బొక్క
భీం భీం భీం భీం భీమ్లానాయక్ బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్
భీం భీం భీం భీం భీమ్లానాయక్. దంచి దడదడదడలాడించే డ్యూటి సేవక్
ఆ జుట్టునట్టా సవరించినాడో సింగాలు జూలు విదిలించినట్టే
ఆ షర్టునట్టా మడతెట్టినాడో రంగాన పులులు గాండ్రించినట్టే
ఆ కాలిబూటు బిగట్టినాడో తొడగొట్టి వేట మొదలెట్టినట్టే
భీమ్లానాయక్ భీమ్లానాయక్
ఎవ్వడైన ఈడి ముందు గడ్డిపోస
ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్ది ఎన్నుపూస
కుమ్మడంలో విడి ఒక బ్రాండు తెల్సా
వీడి దెబ్బతిన్న ప్రతివాడు పాస్టు టెన్సా
నడిచే రూటే స్ట్రెయిటు పలికే మాటే రైటు
టెంపరుమెంటే హాటు పవరుకు ఎత్తిన గేటు ఆ నేమ్ ప్లేటు
భీం భీం భీం భీం భీమ్లానాయక్ బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్
భీం భీం భీం భీం భీమ్లానాయక్. దంచి దడదడదడలాడించే డ్యూటి సేవక్
గుంటూరుకారం ఆ యూనిఫారం మంటెత్తిపోద్ది నకరాలు చేస్తే
లావాదుమారం లారీ విహారం పేట్రేగిపోద్ది నేరాలు చూస్తే
నెలవంటూ అనడు శనాదివారం అల్ రౌండ్ ది క్లాకు పిస్తోలు దోస్తే

More articles

3 COMMENTS

  1. ఒక కళాకారుడిని మరో కళాకారుడే గుర్తిస్తాడు ,గౌరవిస్తాడు. రమేష్ బాబు బహు బాగుగా రాసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article